Switch to English

నెగ్గిన చంద్రబాబు పంతం: ఈసీ గ్రీన్‌ సిగ్నల్‌

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,433FansLike
57,764FollowersFollow

ఎట్టకేలకు తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి కేంద్రం ఎన్నికల సంఘం నుంచి ఓ తీపి కబురు అందింది. క్యాబినెట్‌ భేటీ నిర్వహించుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో టీడీపీ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఇప్పటికే, క్యాబినెట్‌ భేటీకి సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలతో కూడిన ఎజెండాను సిద్ధం చేసిన చంద్రబాబు, స్క్రీనింగ్‌కి పంపడం, ఆ తర్వాత అది కేంద్ర ఎన్నికల సంఘానికి చేరడం జరిగిపోయాయి. నిజానికి ఈ రోజు ఉదయమే కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ‘సమాధానం’ రావాల్సి వున్నా, కాస్త ఆలస్యంగా సాయంత్రానికి ‘లైన్‌ క్లియర్‌’ అయ్యింది.

ఈ రోజు ఉదయం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ చీఫ్‌ సెక్రెటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి క్యాబినెట్‌ భేటీకి గ్రీన్‌ సిగ్నల్‌ రాకపోతే ఏం చేయాలన్న విషయమై ఈ మేరకు ఇద్దరి మధ్యా చర్చ జరిగినట్లు కూడా ప్రచారం జరిగింది. కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చే అవకాశం లేదనే విషయాన్నే చంద్రబాబు దృష్టికి ఏపీ చీఫ్‌ సెక్రెటరీ తీసుకెళ్ళారనే ఊహాగానాలూ విన్పించాయి. కానీ, ఎట్టకేలకు ఉత్కంఠకు తెరపడింది.

మండుతున్న ఎండలు, కరువు, ఇటీవల సంభవించిన ఫోని తుపాను కారణంగా తలెత్తిన నష్టం.. వంటి అంశాలు క్యాబినెట్‌ భేటీకి సంబంధించిన ఎజెండాలో ముఖ్యంగా చేర్చారు. ఎన్నికల కోడ్‌ కారణంగా క్యాబినెట్‌ భేటీ జరిగే అవకాశాలే లేవని రాజకీయ విశ్లేషకులు చూచాయిగా అభిప్రాయపడిన వేళ, కేంద్ర ఎన్నికల సంఘం చంద్రబాబు సర్కార్‌కి ఆ అవకాశం కల్పించడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. అయితే, క్యాబినెట్‌ భేటీ అనేది సాధారణ ప్రక్రియ మాత్రమేననీ, కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి మాత్రం వీల్లేదనే అభిప్రాయాలు ఇంకా వ్యక్తమవుతూనే వున్నాయి.

ఎన్నికల పోలింగ్‌ ముగిసి, ఫలితాల విడుదల కోసం అంతా ఎదురు చూస్తున్న ఈ సమయంలో క్యాబినెట్‌ భేటీ పెట్టడం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఒకింత ‘పంతం పట్టినట్లే’ వ్యవహరించారని ఎవరికైనా ఇట్టే అర్థమయిపోతుంది. ఎలాగైతేనేం, ఆయన పంతం నెగ్గింది. ఎవరూ ఊహించని విధంగా క్యాబినెట్‌ భేటీ జరిపేందుకు చంద్రబాబుకి అవకాశం దక్కింది. దాదాపుగా ఏపీ మంత్రులంతా నీరసించిపోయిన వేళ ఎన్నికల సంఘం ఇచ్చిన ఈ గ్రీన్‌ సిగ్నల్‌ వారందరికీ ‘ఆక్సిజన్‌’ అందించినట్లయ్యింది.

అయితే, ఎన్నికల సంఘం అవకాశమిచ్చింది కదా అని, చంద్రబాబు క్యాబినెట్‌ కీలక నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదని ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ హెచ్చరిస్తోంది. ‘అధికారంలోకి వచ్చేది మేమే, ఇప్పుడు మీరు ఎలాంటి అత్యుత్సాహపు నిర్ణయాలు తీసుకున్నా, మేం అధికారంలోకి వచ్చాక వాటిని సమీక్షిస్తాం, మీ అత్యుత్సాహం అంతు తేల్చుతాం..’ అని వైఎస్సార్సీపీ నేతలు చెబుతున్నారు. ఎవరి గోల వారిది, మే 23 తర్వాత ఎవరు అధికారంలోకి వస్తారో ఆల్రెడీ ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్లలో ఫలితం నిక్షిప్తమైపోయి వుంది.

ఇదిలా వుంటే, క్యాబినెట్‌ భేటీకి ఎన్నికల సంఘం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన దరిమిలా, మంత్రులందరితోనూ చంద్రబాబు ప్రత్యేకంగా మంతనాలు జరిపారట. క్యాబినెట్‌ భేటీకి మంత్రులంతా హాజరు కావాల్సిందేనని హుకూం జారీ చేశారట కూడా. ఏమో, ఇదే చంద్రబాబు అండ్‌ టీమ్‌కి చివరి క్యాబినెట్‌ సమావేశమవుతుందా.? మళ్ళీ చంద్రబాబే అధికారంలోకి వచ్చే అవకాశాలుంటాయా? వేచి చూడాలి.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

ఎక్కువ చదివినవి

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

Kajal: కాజల్ విడుదల చేసిన ‘సత్య’ సినిమాలోని ‘నిజమా.. ప్రాణమా’ పాట

Kajal Agarwal: శివ మల్లాల (Shiva mallala) నిర్మాతగా వాలి మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సత్య' (Satya) సినిమా నుంచి ‘నిజమా ప్రాణమా’ పాట లిరికల్ వీడియోని స్టార్ హీరోయిన్ కాజల్...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

‘భజే వాయువేగం’ నుంచి ‘సెట్ అయ్యిందే’ సాంగ్ విడుదల

టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ( Karthikeya ) నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'భజే వాయువేగం'. ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను మూవీ టీం రిలీజ్ చేసింది. 'సెట్ అయ్యిందే'...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను : చిరంజీవి

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి ఆ తర్వాత కొంత సమయం సరదాగా...