Switch to English

ధమాకా ప్రమోషన్స్.. మాస్.. ఊరమాస్.. అంతే!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

మాస్ రాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ధమాకా’ మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్ మొదలుకొని, సాంగ్స్, టీజర్, ట్రైలర్లకు సూపర్బ్ రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా విజయంపై చిత్ర యూనిట్ పూర్తి కాన్ఫిడెంట్‌గా ఉంది. ఇక ఈ సినిమాను జనంలోకి తీసుకెళ్లేందుకు ధమాకా యూనిట్ చేపడుతున్న ప్రమోషన్స్ చూస్తుంటే బాప్ రే అనాల్సిందే.

గతంలో రవితేజ తన సినిమా ప్రమోషన్స్‌లో ఎక్కువగా పాల్గొనేవాడు కాదు. కేవలం ఒకట్రెండు ఈవెంట్లు, ఇంటర్వ్యూల్లో మాత్రమే కనిపించేవాడు. కానీ, ప్రస్తుతం ధమాకా సినిమాపై ఆయనకున్న కాన్ఫిడెన్స్, ఆయన్ను ఏకంగా అభిమానుల్లోకి వెళ్లేలా చేసింది. దర్శకుడు నక్కిన త్రినాథరావు తెరకెక్కించిన ఈ ఔట్ అండ్ ఔట్ మాస్ ఎంటర్‌టైనర్ మూవీపై ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లోనూ అదిరిపోయే బజ్ క్రియేట్ అయ్యింది. అయితే సినిమా రిలీజ్ దగ్గరపడుతుండటంతో ఈ చిత్ర ప్రమోషన్స్‌ను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్తోంది చిత్ర యూనిట్.

ఇందులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ‘ధమాకా’ ప్రమోషన్స్‌తో మార్మోగుతోంది. రవితేజ ధమాకా సినిమా కోసం వినూత్నంగా ప్రమోషన్స్ చేస్తున్నారు. తాజాగా ఆయన హైదరాబాద్‌లో జరిగిన ఓ ఈవెంట్‌లో భారీ సంఖ్యలో వచ్చిన అభిమానులతో సందడి చేశారు. దాదాపు రెండు వేల మంది అభిమానులకు ఒక్కొక్కిరితో సెల్ఫీలు దిగి వారికి గుర్తుండిపోయే ట్రీట్ ఇచ్చారు. ఇక వారందరితో కలిసి ధమాకా సినిమా సాంగ్స్‌కు మాస్ రాజా చిందులు వేయడం అక్కడున్నవారిలో మరింత జోష్‌ను నింపింది.

సోషల్ మీడియా స్టార్ దుర్గారావుతో ఓ వినూత్నమైన ప్రమోషన్ చేయించారు చిత్ర యూనిట్. రిక్షా సైకిల్‌పై మైకు పట్టుకుని ‘ధమాకా’ సినిమా గరించి ఆయన తనదైన స్టయిల్‌లో సినిమాను ప్రమోట్ చేస్తూ రోడ్లపై సందడి చేశారు. ఇక దుర్గారావు వెంట రవితేజ అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో ఈ ప్రమోషన్స్‌లో కనిపించారు.

కాగా మరో ప్రమోషనల్ ఈవెంట్‌లో భాగంగా కర్నూలులో ఏకంగా 100 ఆటోలకు ధమాకా ఫ్లెక్సీలు పెట్టి చేసిన ర్యాలీ అక్కడి జనాలను బాగా అట్రాక్ట్ చేసింది. రవితేజ సినిమా అంటే ఎక్కువగా ఇష్టపడే కర్నూల్ వాసులు ధమాకా సినిమాపై నెలకొన్న క్రేజ్‌తో వారు ఈ సినిమాను ఖచ్చితంగా చూస్తారని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

అంతేగాక, వరంగల్‌లో ‘ధమాకా’ ప్రమోషన్స్‌లో భాగంగా బుధవారం రోజున ఏకంగా 30కి పైగా లారీలతో ర్యాలీ చేయబోతున్నారు చిత్ర యూనిట్. ఒక మాస్ హీరోకు ఇలాంటి మాసివ్ ప్రమోషన్స్ ఎక్కడా జరగవని అభిమానులు కాలర్ ఎగరేస్తున్నారు. తమ హీరో సినిమాకు ఈమాత్రం ప్రమోషన్స్ లేకపోతే ఎలా అంటూ రవితేజ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

అటు వైజాగ్‌లో ధమాకా సినిమా రిలీజ్ రోజున మరో భారీ ప్రమోషన్‌ను ప్లాన్ చేస్తోంది చిత్ర యూనిట్. ఏకంగా 200 బైకులతో భారీ ర్యాలీ చేసేందుకు ధమాకా యూనిట్ ప్లాన్ చేస్తోంది. అభిమానులు ఈ బైక్ ర్యాలీలో భారీ ఎత్తున పాల్గొనేందుకు రెడీ అవుతున్నారు. మొత్తంగా చూస్తే, రవితేజ అండ్ టీమ్ ‘ధమాకా’ ప్రమోషన్స్ చేస్తున్న తీరు నిజంగా యావత్ టాలీవుడ్ దృష్టిని ఆకర్షిస్తోంది. మరి డిసెంబర్ 23న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కాబోతున్న ఈ సినిమా థియేటర్లలో ఎలాంటి రచ్చ చేయబోతుందో చూడాలి.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

రాజకీయం

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఎక్కువ చదివినవి

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...