ఆల్రెడీ ‘గీతగోవిందం’ సినిమాలో విజయ్ దేవరకొండ, రష్మిక మండన్నల మధ్య రొమాన్స్ చూశాం. అది కాస్తంత క్లాస్ టచ్‌తో వున్న సినిమా. ఇప్పుడు ‘డియర్ కామ్రేడ్’ సినిమా వస్తోంది ఈ ఇద్దరి కాంబినేషన్లో. ఇదీ రొమాంటిక్ సినిమానే.. కాకపోతే, కాస్తంత మాస్. స్టూడెంట్ పాలిటిక్స్ నేపథ్యంలో సాగే సినిమా ఇది. ‘గీత గోవిందం’ సినిమాని మించి అదిరిపోయే కెమిస్ట్రీ విజయ్ దేవరకొండ, రష్మికల మధ్య పండిందట ‘డియర్ కామ్రేడ్’ సినిమాలో.
ఫస్ట్ లుక్ నుంచి, విడుదలవుతున్న ప్రతి ప్రోమో.. సినిమాపై ‘హాట్ హాట్’గా అంచనాల్ని పెంచేస్తున్నాయి. విజయ్ దేవరకొండ పవర్ ఫుల్ డైలాగులు చెప్పాడు.. రష్మిక క్రికెటర్ పాత్రలో కన్పిస్తోంది.. వీటన్నిటికీ మించి స్టూడెంట్ పాలిటిక్స్.. ఇవన్నీ పక్కన పెడితే, విజయ్ – రష్మికల మధ్య ఘాటు లిప్ కిస్‌లు ఇప్పుడు ఈ ట్రైలర్‌తో పెను సంచలనానికి కారణమయ్యాయి. లిప్ లాక్ సీన్ లేకపోతే అసలు తెలుగు సినిమా ఉనికి లేనట్లే.. అన్నట్టు వ్యవహరిస్తున్నారు చాలామంది దర్శక నిర్మాతలు. ఈ క్రమంలోనే ఈ సినిమాలో కూడా లిప్ కిస్‌లు పోటెత్తనున్నాయని ట్రైలర్‌తో సంకేతాలు పంపేశారు.
గత సినిమాలతో పోల్చితే రష్మిక ఈ సినిమాలో కొంచెం బొద్దుగా కన్పించేలా వుంది. మరోపక్క, విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ షరామామూలే. ఆ యాటిట్యూడ్‌కి తగ్గట్టే సన్నివేశాల చిత్రీకరణ వుంది. అలా చూస్తే ఈ సినిమాలో కొత్తదనమేమీ కన్పించదు. కానీ, రష్మిక క్రికెటర్ కావడం ఈ సినిమాకి స్పెషల్ ఎట్రాక్షన్ అని చెప్పక తప్పదు. కాలేజ్ లైఫ్, ఆ తర్వాత హీరో యాటిట్యూడ్‌లో మార్పు రావడం.. ఇలా సాగుతోంది ట్రైలర్.
ప్రేమలో పడి, ఆ తర్వాత హీరో యాటిట్యూడ్ నచ్చక, హీరోకి దూరమయ్యే హీరోయిన్.. హీరోయిన్ కోసం తనను తాను మార్చుకున్నట్లు కన్పించే హీరో, అతను నిజంగా మారలేదని బాధపడే హీరోయిన్.. ఇలా యూత్‌ని కనెక్ట్ చేసేలా ట్రైలర్లో చాలా అంశాలున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి పెద్ద ప్లస్ అయ్యేలా వుంది. సినిమాటోగ్రఫీ కూడా చాలా బావుంది. ఈ జనరేషన్‌కి బాగా కనెక్ట్ అయ్యే స్టూడెంట్ పాలిటిక్స్ ఈ సినిమాకి మరో మేజర్ ప్లస్ పాయింట్. ఓవరాల్‌గా ‘డియర్ కామ్రేడ్’ ట్రైలర్, విజయ్ దేవరకొండ అభిమానుల్ని ఓ రేంజ్లో మెప్పించేలా వుంది.
241806 559459Hello there, just became alert to your weblog via Google, and discovered that it is really informative. Im gonna watch out for brussels. Ill be grateful in the event you continue this in future. A lot of folks will probably be benefited from your writing. Cheers! 93118
972511 894537Outstanding post, I believe blog owners should larn a good deal from this weblog its actually user genial . 212554
128451 637472youve gotten an important weblog proper here! would you wish to make some invite posts on my weblog? 627501