పంచాంగం
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం వసంతఋతువు చైత్ర మాసం
సూర్యోదయం: ఉ.6:02
సూర్యాస్తమయం: రా.6:06 ని
తిథి: చైత్ర శుద్ధ అష్టమి రా.10:04 ని. వరకు తదుపరి చైత్ర శుద్ధ నవమి
సంస్కృతవారం: సౌమ్య వాసరః (బుధవారం )
నక్షత్రము: ఆరుద్ర రా.9:09 ని. వరకు తదుపరి పునర్వసు
యోగం: శోభ రా.1:12 వరకు తదుపరి అతిగండ
కరణం: విష్టి ఉ.9:12 ని. వరకు తదుపరి భాలవ
దుర్ముహూర్తం: ఉ.11:40 నుండి మ.12:28 వరకు
వర్జ్యం : లేదు
రాహుకాలం: మ.12:00 నుండి 1:30 వరకు
యమగండం: ఉ.7:30 నుండి 9:00వరకు
గుళికా కాలం: ఉ.10:50 ని.నుండి 12:21 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:41 నుండి 5:29 వరకు
అమృతఘడియలు:ఉ.10:14నుండి 11:59 ని. వరకు
అభిజిత్ ముహూర్తం : లేదు
ఈరోజు (29-03-2023) రాశి ఫలితాలు
మేషం: వ్యాపారాలలో స్వంత నిర్ణయాలు అమలు చేసి లాభాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి ఆశించిన విధంగా ఉంటుంది. చేపట్టిన పనులు మిత్రుల సహాయ సహకారాలతో పూర్తిచేస్తారు. దూర ప్రయాణాలు కలసివస్తాయి. వృత్తి ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.
వృషభం: దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి పెరుగుతుంది. వృధా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో అకారణ వివాదాలు చికాకు పరుస్తాయి. వృత్తి వ్యాపారాలలో పెట్టుబడుల విషయంలో పునరాలోచన చెయ్యడం మంచిది. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం దూర ప్రయాణాలు వలన శ్రమ అధికమౌతుంది.
మిథునం: సంతాన శుభకార్య విషయమై కుటుంబ సభ్యులతో చర్చలు జరుగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. పాత ఋణాలు తీర్చగలుగుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.
కర్కాటకం: ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు మందగిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో అవసరానికి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందవు. నిరుద్యోగులకు లభించిన అవకాశములు సద్వినియోగం చేసుకోవాలి. వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగిన గుర్తింపు లభించదు.
సింహం: ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలిస్తుంది. దూర ప్రాంతాల వారి నుండి అందిన సమాచారం ఆసక్తి కలిగిస్తుంది. బంధుమిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగ విషయంలో శుభవార్తలు అందుతాయి. వ్యాపార వ్యవహారాలు సజావుగా సాగుతాయి.
కన్య: కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. భూ క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు.
తుల: దూర ప్రాంతాల బంధుమిత్రుల నుండి కీలక విషయాలు సేకరిస్తారు. సంతానం విద్యా ఉద్యోగ విషయాలలో సంతృప్తినిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన స్థానాలు ఉంటాయి. దైవ చింతన పెరుగుతుంది. వ్యాపారమున ఉన్న సమస్యలు అదిగమించి ముందుకు సాగుతారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి.
వృశ్చికం: ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. మిత్రులతో అకారణ వివాదాలు కలుగుతాయి. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ఉద్యోగమున అధికారులతో అప్రమత్తంగా వ్యవహారించాలి. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి. భూ క్రయవిక్రయాలలో తొందరపాటు మంచిది కాదు.
ధనస్సు: విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. దీర్ఘకాలిక రుణఒత్తిడి నుండి బయట పడతారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.
మకరం: ఉద్యోగులకు అధికారుల అనుగ్రహం కలిగి హోదాలు పెరుగుతాయి. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుండి కొంత ఉపశమనం పొందుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆప్తుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.
కుంభం: ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరానికి డబ్బు అందుతుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు.
మీనం: కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత బాధిస్తుంది. చేపట్టిన పనులలో ఆటంకాలుంటాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహారించాలి. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి. ఋణ ఒత్తిడి పెరుగుతుంది. వాహన కొనుగోలు ప్రయత్నాలు మందగిస్తాయి.