సికింద్రబాద్ కు చెందిన ఒక యువకుడు వేదిస్తున్నాడు అంటూ ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేసి ఎంక్వౌరీ చేస్తున్న సమయంలో భయంకర విషయాలు వెలుగు చూశాయి. ప్రముఖ ఓటీటీ ల సబ్ స్క్రిప్షన్ అవసరం లేకుండా కేవలం ఓటీటీ తో లాగిన్ అయ్యే అవకాశంను కల్పించేలా తక్కువ రేటుకు అమెజన్ తో పాటు అన్ని ఓటీటీలను ఇస్తున్నారు. ఓటీపీ బయ్యర్స్ సెల్లర్స్ అనే సోషల్ మీడియా గ్రూప్ లో ఇది జరుగుతుంది. పోలీసులు ఈ విషయాన్ని సైబర్ క్రైమ్ కు బదిలీ చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
అమెజాన్ నెల వారిగా చందా 129 రూపాయలు. కాని ఈ గ్రూప్ లో సభ్యత్వం తీసుకుని కేవలం రూ.20 ఇస్తే చాలు నెల రోజులు అమెజాన్ ను ఎంజాయ్ చేయవచ్చు. ఇలా ఆహా నుండి యూట్యూబ్ వరకు పది నుండి పదిహేను ఓటీటీ ప్లాట్ ఫామ్ లకు సంబంధించిన ఓటీపీలు అందుబాటులో ఉన్నాయి. ఈమొత్తం వ్యవహారం ఎలా జరుగుతుంది, దీని వెనుక ఉన్నది ఎవరు అనే విషయాలను గుర్తించేందుకు ప్రస్తుతం పోలీసులు ఎంక్వౌరీ చేస్తున్నారు. దీని వెనుక పెద్ద కుట్రే జరుగుతున్నట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
27867 504890Some truly great info , Gladiola I identified this. 557248