Switch to English

కిరాతకం: యువతి దారుణ హత్య.. ప్రేమించట్లేదని నడిరోడ్డుపై నరికేశాడు..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,417FansLike
57,764FollowersFollow

తనను ప్రేమించడంలేదని ఓ యువతిని నడిరోడ్డుపై యువకుడు కత్తితో నరికి చంపిన ఘటన ఆంధ్రప్రదేశ్ లో సంచలనం రేపిన విషయం తెలిసిందే. కాకినాడ జిల్లా పెదపూడి మండలం కాండ్రేగుల-కూరాడ రహదారిపై శనివారం జరిగింది. ఈ ఘటనలో యువతి తీవ్ర గాయాలతో మృతి చెందింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై జిల్లా ఎస్పీ రవీంద్రనాధ్ బాబు వివరాలు వెల్లడించారు.

పోలీసు ఉద్యోగం ప్రయత్నిస్తూ..

కరప మండలం కూరాడలో కాదా దేవిక అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటూ డిగ్రీ చదువుకుని.. ప్రస్తుతం హెర్బల్ ప్రొడక్స్ట్ లో మార్కెటింగ్ చేస్తూ కానిస్టేబుల్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తోంది. ఈమె తల్లిదండ్రులు హైదరాబాద్ లో కూలీలుగా పని చేస్తూ పెద్ద కుమార్తెను బీటెక్ చదివిస్తున్నారు. వీరిది బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని పామర్రు మండలం కె. గంగవరం. రంగంపేట మండలం బాలవరానికి చెందిన నిందితుడు సూర్యనారాయణ డిప్లొమా పూర్తి చేసి పోర్టులో ఏడేళ్లు ఔట్ సౌర్సింగ్ లో పని చేసి ప్రస్తుతం ఖాళీగా మేనమామ వి.రామచంద్రరావు ఇంట్లో ఉండేవాడు.

యువతి దారుణ హత్య.. ప్రేమించట్లేదని నడిరోడ్డుపై నరికేశాడు..!

అనుమానం పెంచుకుని..

ఆ సమయంలో వీరిద్దరి మధ్యా ప్రేమించుకుంటున్నారని తెలిసి పెళ్లి చర్చలు జరిగాయి. అయితే.. అతనితో పెళ్లికి దేవిక తల్లిదండ్రులు నిరాకరించారు. నిందితుడి మేనమామ మరోసారి మాట్లాడినా యువతి నిరాకరించింది. దీంతో సూర్యనారాయణను హైదరాబాద్ పంపేశారు. ఇటివలే గ్రామానికి తిరిగొచ్చాడు. అయితే.. మరొకరితో దేవిక సన్నిహితంగా ఉంటుందనే అనుమానాన్ని పెంచుకున్నాడు. దీంతో ఆమెను హత్య చేసేందుకు కుట్ర పన్నాడు. శనివారం దేవిక  మోటర్ సైకిల్ పై కరప వెళ్లి తిరిగొస్తూండగా.. సూర్యనారాయణ ఆమెను అనుసరించి ఎవరూ లేని నిర్మానుష్య ప్రాంతంలో ఆమెను అడ్డగించాడు. తనను ప్రేమించాలని.. పెళ్లి చేసుకోవాలని బలవంతం చేశాడు.

యాసిడ్, కత్తితో బెదిరించి..

ఆమె తిరస్కరించడంతో వెంట తెచ్చుకున్న యాసిడ్, కత్తితో బెదిరించాడు. వెంటనే కత్తితో ఆమె మెడపై బలంగా వేటే వేశాడు. కిందపడి గిలగిలా కొట్టుకుంటున్న దేవిక చేయి, శరీరంపై పలుమార్లు దాడి చేశాడు. సమీపంలోపి పొలాల్లో పని చేస్తున్న కూలీలు గమనించి నిందితుడిని పట్టుకునే ప్రయత్నం చేశారు. తాను పారిపోనని పెళ్లి చేసుకోనని చెప్పడంతో హత్య చేశానని చెప్పాడు. దీంతో కూలీలు నిందితుడిని బంధించి స్థంభానికి కట్టేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. 108 వాహనంలో దేవికను కాకినాడ ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మరణించిందని వైద్యులు ధ్రువీకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

సీఎం జగన్ దిగ్భ్రాంతి..

నిందితుడికి ఉరిశిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పోలీసు అధికారులను ఆదేశించారు. ఏడు రోజుల్లో దర్యాప్తు చేసి చార్జిషీటు దాఖలు చేస్తామని.. నిందితుడిపై రౌడీషీట్ తెరిచి బెయిల్ రాకుండా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఘటనపై సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దిశ చట్టం ద్వారా నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని.. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని సూచించారు. నిందితులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన కేసుల్లో దిశ చట్టం మార్గదర్శకాలు పాటించి నేరస్థులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.

యువతి దారుణ హత్య.. ప్రేమించట్లేదని నడిరోడ్డుపై నరికేశాడు..!

8 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Devara: ‘బడా నిర్మాత బడాయి కబుర్లు..’ దేవర పాటకు నెటిజన్స్ ట్రోలింగ్

Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr Ntr) హీరోగా తెరకెక్కుతున్న భారీ సినిమా దేవర (Devara). ఇటివలే ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా సినిమాలో ఫియర్...

Taapsee: డెలివరీ బాయ్ నిబద్ధత.. స్టార్ హీరోయిన్ ఎదురైనా పనిలోనే.. వీడియో...

Taapsee: సినిమా తారలంటే ఎప్పుడూ క్రేజే. తెరపై అలరించేవారు బయట ఎదురైతే ఉబ్బితబ్బిబ్బవుతాం. వెంటనే మొబైల్ తీసి సెల్పీల కోసం ప్రయత్నిస్తాం. స్టార్ హీరో, హీరోయిన్లైతే...

Jabardasth Faima: లవర్ ని పరిచయం చేసిన జబర్దస్త్ ఫైమా.. షాక్...

Jabardasth Faima: జబర్దస్త్ వేదికగా పైమా-ప్రవీణ్ కలిసి చేసిన స్కిట్స్ నవ్వులు పంచాయి. వీరిద్దరూ నిజజీవితంలోనూ ప్రేమలో ఉన్నారని ప్రచారం కూడా జరిగింది. ఇద్దరూ కలిసి...

Vijay Devarakonda : రౌడీస్టార్‌, సుకుమార్‌ కాంబో కొత్త అప్‌డేట్‌

Vijay Devarakonda : రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుంది అంటూ నాలుగు సంవత్సరాల క్రితం అధికారికంగా ప్రకటన...

Jani Master: ‘బెంగళూరు రేవ్ పార్టీలో నేనా..?’.. జానీ మాస్టర్ స్పందన...

Jani Master: బెంగళూరు (Bengaluru) లో జరిగిన రేవ్ పార్టీ తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపింది. పలువురు సినీ, టీవీ నటులు పార్టీలో పాల్గొన్నట్టు...

రాజకీయం

ఈవీఎంని పగలగొట్టిన వైసీపీ ఎమ్మెల్యే

అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజు ఓ వైసిపి ఎమ్మెల్యే ఈవీఎం ని ధ్వంసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మే 13 న పొలింగ్ జరుగుతున్న సమయంలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి...

రేవ్ పార్టీ.! ఎంట్రీ ఫీజు అన్ని లక్షలా.? ఏముంటుందక్కడ.?

రేవ్ పార్టీ.. ఈ మాట చాలాకాలంగా మనం వింటున్నదే.! పోలీసులు ఫలానా చోట రేవ్ పార్టీ జరుగుతోంటే, దాన్ని భగ్నం చేశారన్న వార్తల్ని ఎప్పటికప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లోనే వింటున్నాం. కానీ, అసలు...

ఏపీ ఎన్నికల సిత్రమ్: తన మీద తానే బెట్టింగ్ వేసుకున్నాడట.!

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల బెట్టింగ్ అనేది ట్రెండ్ సెట్టింగ్ వ్యవహారంలా మారిపోతోంది. దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలకు సంబంధించి బెట్టింగ్ జరగడమనేది సర్వసాధారణమే అయిపోయిందిప్పుడు. తెలంగాణలో లోక్ సభ ఎన్నికల నేపథ్యంలోనూ బెట్టింగ్...

వైసీపీ ఆ 95 చోట్ల ఓడిపోనుందట.! ఈ లెక్క పక్కా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసి వారం రోజులపైనే వుంది. అసెంబ్లీతోపాటు లోక్ సభ నియోజకవర్గాలకూ పోలింగ్ పూర్తయ్యింది. ఎవరు గెలుస్తారన్నది జూన్ 4న తేలుతుంది. అయితే, ఎన్నికల ఫలితాల వెల్లడికి...

రేణు దేశాయ్‌ని సోషల్ మీడియాలో కెలుకుతున్నదెవరు.?

సినీ నటి రేణు దేశాయ్ పేరు మరోమారు వార్తల్లోకెక్కింది.! ఆమె తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా పోస్ట్ చేసిన ఓ ‘స్టోరీ’ ఆమెను వార్తల్లోకెక్కించింది. పెంపుడు జంతువుల సంరక్షణ విషయమై రేణు...

ఎక్కువ చదివినవి

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

ఈవీఎంని పగలగొట్టిన వైసీపీ ఎమ్మెల్యే

అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజు ఓ వైసిపి ఎమ్మెల్యే ఈవీఎం ని ధ్వంసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మే 13 న పొలింగ్ జరుగుతున్న సమయంలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి...

రేవ్ పార్టీ.! ఎంట్రీ ఫీజు అన్ని లక్షలా.? ఏముంటుందక్కడ.?

రేవ్ పార్టీ.. ఈ మాట చాలాకాలంగా మనం వింటున్నదే.! పోలీసులు ఫలానా చోట రేవ్ పార్టీ జరుగుతోంటే, దాన్ని భగ్నం చేశారన్న వార్తల్ని ఎప్పటికప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లోనే వింటున్నాం. కానీ, అసలు...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....