భారత్ లో జనవరి నెలలో అందుబాటులోకి తీసుకొచ్చే కోవిడ్ టీకాపై కేంద్రం తీవ్రంగా ఆలోచిస్తోంది. ఈ క్రమంలో బ్రిటన్ కు చెందిన కోవిషీల్డ్ కే తొలిగా అనుమతులు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. కేంద్రం నియమించిన టాస్క్ ఫోర్స్ దీనికే మొగ్గు చూపిందని తెలుస్తోంది. ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ, ఆస్ట్రాజెనెకా సంయుక్తగం అభివృద్ధి చేసిన పూణెకు చెందిన సీరం ఇనిస్టిట్యూట్ కు వచ్చే వారమే అనుమతి లభించే అవకాశం ఉందని తెలుస్తోంది.
సీరం ఇనిస్టిట్యూట్ కు చెందిన వ్యాక్సిన్ ఇప్పటికే 40 మిలియన్ డోసుల ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ సిద్ధం చేసింది. ఇందుకు డీసీజీఐ అనుమతి కూడా ఇచ్చింది. భారత్ బయోటెక్ కు చెందిన కోవాగ్జిన్ టీకా ఇంకా మూడో దశ ప్రయోగాల్లో ఉంది. మరోవైపు ఇప్పటికే బ్రిటన్, అమెరికా, బెహ్రయిన్ లో ఫైజర్ టీకాకు అనుమతి లభించిన విషయం తెలిసిందే. బ్రిటన్ లో వెలుగుచూసిన కొత్త వైరస్ కు ఈ టీకాలపై ప్రభావం చూపదని అధికారులు అంటున్నారు.
766186 907666Woh I like your content material , saved to favorites ! . 236160
782178 279292There is noticeably a bundle comprehend this. I suppose you created specific nice points in functions also. 996743