Switch to English

జిల్లాకి ముగ్గురు: కన్‌ఫ్యూజన్‌లో సీఎం జగన్‌

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,422FansLike
57,764FollowersFollow

ఒక్కో జిల్లా నుంచి ఒక్కర్ని మాత్రమే క్యాబినెట్‌లోకి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తొలుత భావించారట. తొలి విడత మంత్రి వర్గానికి సంబంధించి వైఎస్‌ జగన్‌ దాదాపుగా ఓ నిర్ణయానికి వచ్చారనే ప్రచారం నేపథ్యంలో ‘ఆశావహులు’ అలర్ట్‌ అయ్యారు. వరుసగా ముఖ్యమంత్రితో భేటీలు షురూ చేశారు వారంతా. దాంతో, వైఎస్‌ జగన్‌ తన నిర్ణయాన్ని మార్చుకోక తప్పలేదని తెలుస్తోంది. మొత్తంగా 18 నుంచి 22 వరకు మంత్రుల సంఖ్యను పెంచాలని వైఎస్‌ కొత్త నిర్ణయం తీసుకున్నాగానీ, ఆశావహుల్లో ‘ఆందోళన’ చల్లారినట్లు కన్పించడంలేదు.

మొత్తం 151 మంది ఎమ్మెల్యేన్నారు అధికార పార్టీకి ప్రస్తుతం. మంత్రి వర్గంలో 25 మందికి అవకాశం కల్పించినా, ఒక్కో పోస్ట్‌ కోసం ఆరుగురు ఎమ్మెల్యేలు పోటీ పడే పరిస్థితి వస్తుంది. ఎమ్మెల్సీల మాటేమిటి.? చట్ట సభలకు ప్రాతినిథ్యం వహించకపోయినా, వైఎస్‌ జగన్‌ వెంట గత పదేళ్ళుగా నడుస్తున్నవారి సంగతేంటి? ఎలా చూసుకున్నా, మంత్రి వర్గ కూర్పు అంత ఈజీ కాదు. ఆయా జిల్లాల్లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు మంత్రి పదవులు తమనే వరిస్తున్నాయంటూ లీకులు పంపించేసుకుంటున్నారు. దాంతో, మీడియాలో ఫలానా ఎమ్మెల్యే మంత్రి కాబోతున్నారట, ఫలానా ఎమ్మెల్సీకి మంత్రిగా అవకాశం దక్కుతుందట, ఫలానా ముఖ్య నేతకు ఫలానా మంత్రిత్వ శాఖ ఖాయమైందట అంటూ కథనాలు వెల్లువెత్తడం వెనుక కూడా పెద్ద కథే నడుస్తోంది.

సదరు నేతలే మీడియాకి లీకులు ఇవ్వడం వల్ల, మీడియాలో కథనాలు షురూ అవడం వల్ల, అధినేతపై ఒత్తిడి పెరుగుతుందనీ, తద్వారా తమ అవకాశాలు పెరుగుతాయనీ సదరు నేతలు భావిస్తున్నారు. ఉత్తరాంధ్రలో ఈసారి అనూహ్యంగా వైఎస్సార్సీపీ వేవ్‌ కనిపించింది. దాంతో అక్కడి ప్రజా ప్రతినిథులు అత్యంత కీలక పదవులు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, తన సొంత ప్రాంతం రాయలసీమకు పెద్ద పీట వేయాలని వైఎస్‌ జగన్‌ భావిస్తున్నారనే ఆవేదన కోస్తా ప్రాంత నేతల్లో వెల్లువెత్తుతోంది. గెలవడం ఓ ఎత్తు, గెలిచాక మంత్రి పదవుల పంపిణీ ఓ ఎత్తు.

ఇంతటి భారీ విక్టరీ సాధించాక ఆశావహులు పెరిగాక, అసంతృప్తుల్ని బుజ్జగించడం అంత తేలిక కాదు. నామినేటెడ్‌ పదవుల పేరుతో కొంతమందిని ఇప్పటికే బుజ్జగించేందుకు వైఎస్‌ జగన్‌ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అలా ఉత్తరాంధ్రకు చెందిన కొందరు నేతల్ని వైఎస్‌ జగన్‌ బుజ్జగించినా, ‘ఇలాంటి దుస్థితి వస్తుందని అస్సలూహించలేదు’ అంటూ ఓ ముఖ్య నేత, తన అసహనాన్ని మీడియాకి లీకుల ద్వారా వెల్లడించడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఇంతటి గందరగోళం నడుమ వైఎస్‌ జగన్‌, ఎవరెవరికి తీపి కబురు అందిస్తారో, ఎవరికి చేదు వార్త అందిస్తారో వేచి చూడాల్సిందే.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

రాజకీయం

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

ఎక్కువ చదివినవి

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...