తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కి ఎట్టకేలకు ఉపశమనం లభించింది. గత అరవై ఆరు రోజులుగా ఆయన వివిధ కేసులకు సంబంధించి జైల్లో వున్న విషయం విదితమే. ఒకటి కాదు, రెండు కాదు.. పదుల సంఖ్యలో నమోదైన కేసులకు సంబంధించి.. ఒక్కో కేసునీ ప్రత్యేకంగా డీల్ చేసింది ఆంధ్రప్రదేశ్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.
నిజానికి, ఈ కేసుల్లో కొన్ని చంద్రబాబు హయాంలో నమోదైనవి కూడా వున్నాయి. ఇప్పుడు వైసీపీ అధికారంలో వుంది గనుక, అధికారులు కొంత ‘హుషారు’ ప్రదర్శించారనీ, గతంలో మిన్నకుండిపోయారనీ రాజకీయ విమర్శలు రావడం మామూలేననుకోండి.. అది వేరే విషయం.
చింతమనేని ప్రభాకర్ నైజం గురించి తెలిసినవారెవరూ ఆయన్ని సమర్థించే పరిస్థితి వుండదు. నియోజకవర్గంలో తనకు ఎదురే లేదనీ, తాను ప్రాతినిథ్యం వహిస్తోన్న నియోజకవర్గానికి తానే రాజుననీ అనుకుంటారాయన. మొత్తంగా ఇప్పుడు 18 కేసుల్లో బెయిల్ దొరికింది చింతమనేని ప్రభాకర్కి. అలా ఆయన 66 రోజుల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చేందుకు మార్గం సుగమం అయ్యింది.
అయితే, అప్పుడే చింతమనేని హ్యాపీగా ఫీలవడానికి లేదు. ఎందుకంటే, ఇంకా చాలా కేసులు ఆయన కోసం ఎదురుచూస్తున్నాయి. అందులో ఏ కేసు ఎప్పుడు ఎదురు తిరుగుతుందో తెలియని పరిస్థితి. కొత్తగా నమోదయ్యే కేసులూ వుండొచ్చు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా తనను వేధిస్తున్నారని చింతమనేని ఆరోపిస్తుండడం షరామామూలే.
ఇక్కడ అధికార పార్టీ అత్యుత్సాహాన్ని కాదనలేం. అదే పరిస్థితుల్లో చింతమనేనినీ సమర్థించలేం.
77343 268555Aw, this was a actually nice post. In concept I wish to put in writing like this moreover – taking time and actual effort to make an excellent article nevertheless what can I say I procrastinate alot and not at all appear to get something done. 162627
483155 629687Some truly outstanding articles on this internet internet site , thankyou for contribution. 152040
907753 642819Attractive part of content. I just stumbled upon your internet site and in accession capital to claim that I acquire in fact enjoyed account your weblog posts. Any way Ill be subscribing to your feeds and even I achievement you get entry to constantly quickly. 428021
570432 590823Some genuinely nice stuff on this internet web site , I it. 479338