Switch to English

‘మా’ లో మరో రచ్చ.. చిరంజీవితో విభేదించిన రాజశేఖర్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,431FansLike
57,764FollowersFollow

వివాదాలతో వార్తల్లో నిలుస్తున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) లో మరో రచ్చ చెలరేగింది. గురువారం పార్క్ హయత్ హోటల్ లో జరిగిన మా డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో విభేదాలు బయటపడ్డాయి. ఈ కార్యక్రమానికి సుబ్బరామిరెడ్డితోపాటు చిరంజీవి, మోహన్ బాబు, కృష్ణంరాజు, మురళీ మోహన్, రాజశేఖర్, నరేష్, పరుచూరి గోపాలకృష్ణ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. ఇటీవల ‘మా’లో చోటు చేసుకున్న పరిణామాలపై ఆవేదన వ్యక్తం చేశారు.

మా గురించి మంచి ఉంటే మైకులో చెబుదామని, చెడు ఉంటే చెవిలో చెప్పుకుందామని వ్యాఖ్యానించారు. దూకుడుగా వెళ్తే సమస్యలు తప్పవని, నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని సూచించారు. పొరుగు రాష్ట్రం తమిళనాడుకు చెందిన నడిగర్ సంఘం భారీగా నిధులు సేకరిస్తోందని, కానీ మా మాత్రం అలా వ్యవహరించలేకపోతోందన్నారు. ఈ నేపథ్యంలో అందరం కలిసి నిర్మాణాత్మకంగా ముందుకు వెళదామని సూచించారు. అయితే, చిరంజీవి మాట్లాడుతున్నప్పుడు రాజశేఖర్ పదేపదే ఆయన ప్రసంగానికి అడ్డు తగిలారు. చిరంజీవి నుంచి మైక్ తీసుకుని మాట్లాడుతూ.. మా పై విమర్శలు చేశారు.

మా వ్యవహారం వల్ల తన కుటుంబంలో గొడవలు కూడా వచ్చాయని, తనకు కారు ప్రమాదం కూడా జరిగిందని పేర్కొన్నారు. ఇండస్ట్రీలో నిప్పు రాజేశారని, కప్పేస్తే దాగేది కాదని వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా వేదికపై ఉన్నవారందరి కాళ్లు మొక్కిన రాజశేఖర్.. మా పై విమర్శలు చేసి వేదిక దిగి వెళ్లిపోయారు. తాను మాట్లాడుతుండగా రాజశేఖర్ మైక్ తీసుకోవడంపై చిరంజీవి తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. తాను తప్పుగా ఏమీ మాట్లాడలేదన్నారు. మంచి ఉంటే మైకులో చెబుదామని, చెడు ఉంటే చెవిలో చెప్పుకుందామని మాత్రమే అన్నానని చెప్పారు. కార్యక్రమాన్ని రసాభాస చేయడానికే రాజశేఖర్ అలా వ్యవహరించినట్టుగా ఉందని విమర్శించారు.

తమకు గౌరవం ఇవ్వనప్పుడు ఎందుకు పిలవాలని అని ప్రశ్నించారు. రాజశేఖర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని, ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టంచేశారు. అనంతరం కృష్ణంరాజు కూడా దీనిని సమర్ధించారు. మోహన్ బాబు మాట్లాడుతూ.. చిరంజీవి ఏమీ తప్పుగా మాట్లాడలేదన్నారు. ఈ గొడవ నేపథ్యంలో గంభీరంగా మారిన వాతావరణాన్ని మోహన్ బాబు తనదైన శైలిలో చల్లబరిచారు. ఆయన మాట్లాడుతూ.. చిరంజీవిపై జోకులు వేశారు. దీనికి చిరంజీవి కూడా సరదాగా స్పందిస్తూ.. మోహన్ బాబుని ఆలింగనం చేసుకుని ముద్దు కూడా పెట్టారు. త్వరలోనే రాజశేఖర్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

ఎక్కువ చదివినవి

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితాన్ని...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన మంచు...

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...