Chiranjeevi: తెలుగు సినిమాకి డ్యాన్స్ అందం అంటే ఏంటో చూపించిన హీరో మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) . ఇంకా చెప్పాలంటే భారతీయ చిత్ర పరిశ్రమలోనే అద్భుతమైన గ్రేస్ తో డ్యాన్స్ చేసే హీరో ఇప్పటికీ చిరంజీవే అంటే అతిశయోక్తి కాదు. సమ్మోహనపరిచే డ్యాన్స్ తో దశాబ్దాలుగా ప్రేక్షకుల్ని మెప్పిస్తున్నారు ఆయన. తెరపై అయినా.. తెర బయట సందర్భానుసారం అయినా ఆయన డ్యాన్స్ గ్రేస్ లో మార్పు ఉండదు. దీనిని మరోసారి నిరూపించారు మెగాస్టార్.
దీపావళి సందర్భంగా తన ఇంట జరిగిన వేడుకల్లో స్టార్ సింగర్ రాజకుమారి (Raja Kumari) లైవ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆమెతో చిరంజీవి జత కలిసి అదిరిపోయే స్టెప్పులతో అలరించారు. షారుఖ్ సినిమా ‘జవాన్’ పాటకు చిరంజీవి స్టెప్పులేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. సర్వసాధారణంగా వచ్చిన సంగీతానికి కూడా చిరంజీవి లయబద్ధంగా డ్యాన్స్ చేయడం అభిమానుల్నే కాదు.. నెటిజన్లను మెప్పిస్తోంది. తన ఇంట పార్టీ జరిగిన సందర్భాల్లో వచ్చిన ఆహుతులతో కలిసి సరదాగా చిరంజీవి డ్యాన్స్ చేసిన వీడియోలు గతంలోనూ వైరల్ అయ్యాయి.