మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ మూవీ కన్ఫ్యూజన్ పై మొత్తానికి క్లారిటీ వచ్చింది. చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమాలో నటిస్తోన్న విషయం తెల్సిందే. ఇది తనకు 152వ సినిమా. అయితే 153వ సినిమా ఏదై ఉంటుందా అన్న సస్పెన్స్ కు మొత్తానికి తెరపడింది. లూసిఫెర్ రీమేక్, వేదాళం రీమేక్ ఈ రెండూ చిరంజీవి ఒప్పుకున్నా ఇందులో ఏది ముందు సెట్స్ పైకి వెళుతుంది అన్న కన్ఫ్యూజన్ బాగా ఉండేది.
అయితే ఇప్పుడు కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ ఈ విషయంలో అధికారిక ప్రకటన ఇచ్చింది. ఆచార్య పూర్తైన తర్వాత చిరంజీవి లూసిఫెర్ రీమేక్ ను మొదలుపెడతారని తెలిపింది. మోహన్ రాజా ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నాడు. అలాగే ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, ఎన్వీఆర్ సినిమాలు సంయుక్తంగా నిర్మించనున్నాయి.
అలాగే చిరంజీవి సంక్రాంతి 2021 తర్వాత షూటింగ్ లో పాల్గొంటాడని కూడా అధికారికంగా తెలియజేసారు. ముందు వివి వినాయక్ ను ఈ సినిమా రీమేక్ గురించి అనుకున్నా కానీ ఆయన స్థానంలో మోహన్ రాజా వచ్చి చేరారు. ధృవ ఒరిజినల్ తని ఒరువన్ ను డైరెక్ట్ చేసాడు మోహన్ రాజా. తమిళ్ లో ఫుల్ డిమాండ్ లో ఉన్న మోహన్ రాజా చిరంజీవి కోసం తెలుగు ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
#MegaStar153 #Lucifer movie Telugu remake will be directed by @Jayam_Mohanraja and jointly produced by @KonidelaPro & NVR Cinema.
#MegaStar @KChiruTweets will join the sets after Sankranthi 2021. pic.twitter.com/r5t0ZiuWo9
— Konidela Pro Company (@KonidelaPro) December 16, 2020
677154 168733Id need to speak to you here. Which isnt something Which i do! I enjoy to reading a post that need to get people to believe. Also, thank you for allowing me to comment! 733017
777774 257765If you tow a definite caravan nor van movie trailer your entire family pretty soon get exposed to the down sides towards preventing very best securely region. awnings 780239