Switch to English

చెవిరెడ్డి కామెడీ.. ఓడలు ఏవి.? బండ్లు ఏవి.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

ఓడలు బండ్లు అవుతాయి.. బండ్లు ఓడలు అవుతాయి. రాజకీయాల్లో ఇదంతా సర్వసాధారణం. గెలిచామని విర్రవీగినోళ్ళంతా ఏమవుతారో చరిత్ర చూస్తే తెలుస్తుంది. ఇప్పుడంటే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అధికార పార్టీ ఎమ్మెల్యే అయ్యారుగానీ.. గతంలో ఆయన పరిస్థితి ఏంటి.? మెగాస్టార్‌ చిరంజీవి, తన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా కోసం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అపాయింట్‌మెంట్‌ కోరడం పెద్ద నేరంగా భావిస్తున్నారు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి.

గతంలో చరణ్‌, జగన్‌ అరెస్టు మీద స్పందిస్తూ చట్టం తన పని తాను చేసిందంటూ వెటకారంగా మాట్లాడారనీ.. ఇప్పుడు పడిగాపులు పడి జగన్‌ అపాయింట్‌మెంట్‌ని తండ్రీ కొడుకులిద్దరూ సంపాదించారనీ చెవిరెడ్డి సోషల్‌ మీడియా వేదికగా సెటైర్‌ వేశారు. అదే నిజమైతే, ‘సైరా నరసింహారెడ్డి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ హక్కుల కోసం సాక్షి మీడియా, మెగా కాంపౌండ్‌ ఎదుట పడిగాపులు కాసిందని అనుకోవాలా.?

నిజానికి ‘సాక్షి’ మీడియాలో చిరంజీవిని కీర్తిస్తూ కుప్పలు తెప్పలుగా కథనాలు వచ్చాయి. దానర్థమేంటి.? చిరంజీవికి వైఎస్‌ జగన్‌ మోకరిల్లారని అనుకోవాలా.? ‘బాబ్బాబూ నన్ను వచ్చి కలవండి..’ అని జగన్‌, చిరంజీవిని కోరారని అర్థం చేసుకోవాలా.? మెగా అభిమానుల నుంచి దూసుకొస్తున్న ప్రశ్నలివి.

తెలుగు సినీ పరిశ్రమ నుంచి ఎవరూ ముఖ్యమంత్రి జగన్‌ని అభినందించలేదు.. వచ్చి కలవలేదు.. అంటూ సినీ నటుడు, వైసీపీ నేత ‘థర్టీ ఇయర్స్‌’ పృధ్వీ చేసిన యాగీని ఎలా మర్చిపోగలం.? ‘పాపం, సినీ పరిశ్రమ నుంచి ఎవరూ జగన్‌ని పట్టించుకోవడంలేదు.. పోన్లే..’ అని మెగా కాంపౌండ్‌ భావించిందేమోనని ఎందుకు అనుకోకూడదు.! రాజకీయాలు వేరు, సినిమా వేరు.

నిజానికి, తన సినిమా అదనపు ప్రదర్శనల కోసమో.. టిక్కెట్‌ రేట్ల పెంపు కోసమే చిరంజీవిగానీ, చరణ్‌గానీ వైఎస్‌ జగన్‌ని కలిస్తే.. అదొక లెక్క. జగన్‌ని చిరంజీవి, చరణ్‌ ఎందుకు కలుస్తున్నారో తెలియదు.. అపాయింట్‌మెంట్‌ ఖరారవ్వగానే చెవిరెడ్డి లాంటోళ్ళు కారుకూతలు కూయడమంటే, జగన్‌ స్థాయిని తగ్గించడమే అవుతుంది.

ఇప్పుడు వైసీపీ నేతలు ఓడల్లో విహరించొచ్చుగాక.. కాలం కస్సుమంటే, ఆ ఓడలు బళ్ళుగా మారిపోవచ్చు. అహంకారం పెరిగిపోతే ఏమవుతుందో, ప్రత్యక్ష సాక్ష్యంగా చంద్రబాబు అక్కడ వైసీపీకి కన్పిస్తూనే వున్నారు కదా.!

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

Mudragada: ముద్రగడ ఇంట రాజకీయ చిచ్చు.. కుమార్తె వ్యాఖ్యలపై పద్మనాభం స్పందన

Mudragada: మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంకు సొంత ఇంటి నుంచే వ్యతిరేకత ఎదురైంది. పవన్ ను ఓడించకపోతే పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్న వ్యాఖ్యలను ఆయన కుమార్తె క్రాంతి ఖండించారు. ఆమె...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన ‘బాక్’ సినిమా సంగతేంటి.? పాస్ అయ్యిందా.?...

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా: దర్శకుడు వంశీ

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి దర్శకుడిగా తొలి సినిమా. సితార సినిమా...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా ‘సత్య’ (Satya)’ అని చిత్ర దర్శక,...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో వస్తున్న కల్కి 2898ఏడీ (Kalki 2898...