Switch to English

చంద్రయాన్‌-2: జాబిల్లిపై మన సంతకం.. కాస్సేపట్లో.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

కోట్లు ఖర్చు చేసి చంద్రుడి మీద ఎందుకు ప్రయోగాలు చేయాలి.? తినడానికి దేశంలో చాలామందికి తిండి లేని ప్రస్తుత పరిస్థితుల్లో వందల కోట్లు వెచ్చించి అంతరిక్ష ప్రయోగాలు చేయడం ఎంతవరకు సబబు.? అంతరిక్ష ప్రయోగాలతో భారతదేశానికి అదనంగా ఒనగూడే ప్రయోజనమేంటి.? ఇలా సవాలక్ష ప్రశ్నలున్నాయి. కానీ, అన్ని ప్రశ్నలకూ ఒకటే సమాధానం.! దేశం మీసం మెలెయ్యాల్సిందే.!

అవును, అంతరిక్ష ప్రయోగాల్లో మన ‘సంతకం’ చాలా చాలా ప్రత్యేకం. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చేపట్టే ప్రతి ప్రయోగం, ప్రపంచ దేశాలు చేస్తోన్న ప్రయోగాలతో పోల్చితే చాలా చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నది. అందుబాటులో వున్న వనరుల్ని సద్వినియోగం చేసుకుంటూ, అపారమైన మేధోశక్తిని మేళవించి మనం ప్రయోగాలు చేపడుతున్నాం. అందుకే, అభివృద్ధి చెందిన దేశాలు కూడా భారత అంతరిక్ష ప్రయోగాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాయి.

ఇప్పటికే పలుమార్లు చంద్రుడి మీదకు వెళ్ళొచ్చినా ‘నాసా’ కూడా చంద్రయాన్‌-2 గురించి ఉత్కంఠగా ఎదురు చూస్తోందంటేనే మన ఇస్రో.. ఆ ఇస్రో చేపడుతున్న ప్రయోగాలకి అంతర్జాతీయ సమాజంలో వున్న క్రేజ్‌ని చెప్పకనే చెబుతున్నాయన్నమాట. కమ్యూనికేషన్‌ శాటిలైట్స్‌ దగ్గర్నుంచి, రక్షణకు ఉపయోగపడే శాటిలైట్స్‌ వరకూ.. చాలానే ప్రయోగాలు చేశాం అంతరిక్ష రంగంలో. ఇప్పుడు చంద్రుడి మీదకు వెళుతున్నాం.

నిజానికి, చంద్రుడిపై ఇది మనకి రెండో ప్రయోగం. మార్స్‌ దగ్గరగా కూడా వెళ్ళాం మనం. ప్రపంచంలోని కొన్ని దేశాలు మాత్రమే ఈ ప్రయోగాలు చేశాయి. మనకన్నా ఎక్కువగా చేశాయి. అయినాసరే, మన ప్రయోగాలు చాలా ప్రత్యేకమైనవి. మరికొద్ది గంటల్లోనే చంద్రుడి మీద తొలిసారిగా మన చంద్రయాన్‌-2 ప్రాజెక్ట్‌లో భాగమైన ల్యాండర్‌ దిగబోతోంది. ఇలా ల్యాండర్‌ని ప్రయోగించడం భారత అంతరిక్ష ప్రయోగాల్లోనే మొట్టమొదటిది. ఇన్ని రోజుల ప్రయాణం ఓ లెక్క.. కేవలం 15 నిమిషాల ప్రయోగం ఇంకో లెక్క. సేఫ్‌ ల్యాండింగ్‌ జరిగితే, అది మన అంతరిక్ష ప్రయోగాల్లో ఓ అద్భుతమే. ఆ అద్భుతాన్ని సాధించి తీరతామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

అర్థరాత్రి సమయంలో ఈ ల్యాండింగ్‌ చోటుచేసుకోనుంది. ఇందుకోసం దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. దేశమే కాదు, ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ‘మేం చంద్రుడి మీద కాలు కూడా మోపేశాం.. మీరు ఇప్పుడు ల్యాండర్‌ పంపుతున్నారు..’ అంటూ ఎగతాళి చేసిన అమెరికన్‌ శాస్త్రవేత్తల్లో కొందరు, ‘చంద్రయాన్‌-2’ సాధిస్తున్న విజయాల్ని చూసి ‘ఇస్రో’కి మాత్రమే కాదు, భారత సమాజానికీ ఇప్పుడు క్షమాపణలు చెబుతున్నారు. భవిష్యత్తు అంతా అంతరిక్షంతోనే అనుసంధానమై వుంది. ఈ నేపథ్యంలో మనం అంతరిక్ష ప్రయోగాల ద్వారా విదేశీ మారక నిల్వల్ని పెంచుకోవచ్చు. అది దేశ ఆర్థిక ప్రగతికి ఎంతో మేలు చేస్తుందన్నది నిర్వివాదాంశం. అభివృద్ధి చెందుతున్న దేశంగా కాదు, అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ మారడానికి ఒక్కో మెట్టూ పైకెక్కుతున్నాం. అందులో ఈ అంతరిక్ష ప్రయోగాలు కూడా ఓ మెట్టుగానే భావించాలి.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ తనయుడిగా బాలనటుడిగా తెరంగేట్రం చేసి తొలి...