మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడిని ఏసీబీ అరెస్ట్ చేసింది. ఈఎస్ఐ మెడికల్ స్కామ్ కి సంబంధించి ఏసీబీ ఈ రోజు ఉదయం అచ్చెనాయుడిని స్వగ్రామంలో అదుపులోకి తీసుకుందన్న వార్త ఆంధ్రప్రదేశ్‌లో చాలామందికి పెద్ద షాకే ఇచ్చింది. ఇదే తరహా కుంభకోణం తెలంగాణలోనూ జరిగింది. అక్కడ అధికారులు మాత్రమే అరెస్టయ్యారు. చిత్రంగా ఆంధ్రప్రదేశ్‌లో అరెస్టులు రాజకీయ నాయకుల వరకూ వెళ్ళడం గమనార్హం. అచ్చెన్న అరెస్ట్ గురించి అధికార పార్టీ నేతలు గత కొన్నాళ్ళుగా బాహాటంగానే మాట్లాడుతున్నారు.
ఇక, అచ్చెన్న అరెస్ట్ అవంగానే, టీడీపీ అధినేత చంద్రబాబు నుంచి ఓ లేఖ బయటకు వచ్చింది. బలహీనవర్గాలపై దాడి.. అంటూ చంద్రబాబు విషయానికి తన ట్రేడ్ మార్క్ ‘పచ్చ రంగు’ పూశారు. ఏ రాజకీయ పార్టీ అయినా ఈ తరహా ఆరోపణలు చేయడం సహజమేననుకోండి.. అది వేరే విషయం. కాస్సేపట్లో ఈ అరెస్ట్ గురించి ఏసీబీ ఓ ప్రకటన చేయనుంది. ఏసీబీ ఉన్నతాధికారులు మీడియా ముందుకు రానున్నారు. ఆ తర్వాతే, అరెస్ట్‌పై పూర్తి స్పష్టత వస్తుంది.
ఒక్కటి మాత్రం నిజం.. ఆంధ్రప్రదేశ్‌లో కుట్ర పూరిత రాజకీయాలు జరుగుతున్నాయి. చంద్రబాబు హయాంలోనూ జరిగాయి.. ఇప్పుడు వైఎస్ జగన్ హయాంలోనూ జరుగుతున్నాయనుకోవాలేమో. అయితే, ఇలాంటి విషయాల్లో ‘కులం రంగు’ పులమడం ఎంతవరకు సబబు.? అన్నదే ఇక్కడ ప్రశ్న. బలహీన వర్గాలపై కుట్ర.. ప్రజలు, మేధావులు దీన్ని ఖండించాలి.. రోడ్డెక్కి నిరసనలు తెలపాలి.. అంబేద్కర్, జ్యోతిరావు పూలే విగ్రహాలకు వినతి పత్రాలు ఇవ్వాలి.. అంటూ టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పిలుపునివ్వడమే ఇక్కడ హాస్యాస్పదంగా మారింది.
సరే, అచ్చెన్నాయుడిపై కేసు ఏమవుతుంది.? రేప్పొద్దున్న కోర్టులో ఈ కేసు పరిస్థితి ఏంటి.? అన్నవి వేరే విషయాలు. ‘అది అసలు నిలబడే కేసు కాదు..’ అని టీడీపీ నేత పట్టాభి చెబుతున్నారు. అసెంబ్లీ సమావేశాలకు ముందు శాసనసభలో తమ పార్టీకి చెందిన ఉప నేతని అరెస్ట్ చేయడం ద్వారా టీడీపీ ఆత్మస్థయిర్యాన్ని దెబ్బ తీయాలని వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్నారు పట్టాభి సహా పలువురు టీడీపీ నేతలు.
అన్నట్టు, అచ్చెన్న గతంలోనే ఈ కుంభకోణంపై స్పందించారు. ‘ఆ వ్యవహారంతో నాకు సంబంధం లేదు. అది కేంద్ర పరిధిలోని అంశం..’ అని తేల్చేశారు. ఇప్పుడాయన వాదన ఎలా వుండబోతోంది.? ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి ప్రకంపనలు సృష్టించబోతోంది.? అన్నిటికీ మించి, చంద్రబాబు కోరుతున్నట్లుగా బలహీన వర్గాలు రోడ్ల మీదకు వచ్చి అచ్చెన్నకు మద్దతివ్వాలా.? ఈ రాజకీయం ఎలాంటి మలుపులు తిరగనుందో వేచి చూడాల్సిందే.
410834 401232Superb post but I was wanting to know should you could write a litte far more on this topic? Id be quite thankful in case you could elaborate slightly bit far more. Thanks! 518777
285613 632296A person essentially lend a hand to make significantly articles I may state. That could be the quite initial time I frequented your web site page and up to now? I amazed with the research you made to create this specific publish incredible. Fantastic activity! 611194
923505 482694Hello! I just now would choose to supply a enormous thumbs up with the wonderful data you could have here within this post. I is going to be coming back to your blog internet site for additional soon. 955084
577641 351358Music began playing anytime I opened this web site, so irritating! 678898
948059 70455Black Ops Zombies […]some folks nonetheless have not played this game. Its hard to envision or believe, but yes, some people are missing out on all of the enjoyable.[…] 591283
510240 238896I discovered your weblog site on google and verify some of your early posts. Continue to maintain up the superb operate. I simply extra up your RSS feed to my MSN News Reader. Searching for forward to reading extra from you in a although! 726019