Switch to English

బాబుకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ కు ముందు రోజు నుంచి ఇప్పటివరకు కేంద్ర ఎన్నికల సంఘంపై టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తుతూనే ఉన్నారు. ఈసీతోపాటు సీఎస్ పైనా విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, వైఎస్సార్ సీపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపణలు గుప్పించారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదీపై విరుచుకుపడిన ఆయన.. అనంతరం సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యంపైనా విమర్శలు చేశారు. బీజేపీ చెప్పినట్టే ఎన్నికల సంఘం పనిచేస్తోందని, తాము ఫిర్యాదు చేస్తే పట్టించుకోని సీఈసీ.. వైఎస్సార్ సీపీ ఫిర్యాదు చేస్తే మాత్రం ఆగమేఘాల మీద నిర్ణయాలు తీసుకుంటోందని ఆరోపించారు.

తాజాగా చంద్రగిరి నియోజకవర్గంలో రిగ్గింగ్ జరిగిందని నిర్ధారణ కావడంతో ఐదు కేంద్రాల్లో రీపోలింగ్ కు ఆదేశిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. దీంతో చంద్రబాబులో అసహనం మరింత పెరిగిపోయింది. ఈసీ తీరు ఏమాత్రం బాగోలేదని దుయ్యబట్టారు. ఈ విషయంపై మాట్లాడేందుకు ఢిల్లీ వెళ్లి, కేంద్ర ఎన్నికల కమిషనర్లను కలిశారు. రీపోలింగ్ ఎందుకు ఆదేశించారని నిలదీశారు. ఇలాంటి వ్యవహారం ఏదో జరిగే అవకాశం ఉందని భావించడంతో అప్పటికే పక్కా ఆధారాలు సిద్ధం చేసుకున్ని ఉన్న కమిషనర్లు.. వాటిని చంద్రబాబుకు చూపించారు.

పోలింగ్ కేంద్రాల్లో రిగ్గింగ్ ఎలా జరిగిందో చాలా స్పష్టంగా నమోదైన దృశ్యాలను చూపించేసరికి చంద్రబాబుకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయినట్టు సమాచారం. ఆయా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రిగ్గింగ్ వ్యవహారం మొత్తం రికార్డైంది. అధికార పార్టీకి చెందిన వ్యక్తులు బూత్ లను ఆక్రమించుకోవడం, అందుకు ఎన్నికల సిబ్బంది సహకరించడం, రిగ్గింగ్ చేసుకోవడం వంటి పరిణామాలన్నీ స్పష్టంగా ఆ వీడియో దృశ్యాల్లో నమోదయ్యాయి. వీటిని చూపించిన కమిషనర్లు.. రీపోలింగ్ పై నిర్ణయం తీసుకోవడం సబబా కాదా అని ఎదురు ప్రశ్నించినట్టు సమాచారం. దీంతో చంద్రబాబూ ఏమీ మాట్లాడలేకపోయారని తెలిసింది.

వాస్తవానికి ఏడు కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని ఫిర్యాదు అందిందని.. అయితే, రెండు కేంద్రాల్లో సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో అక్కడ రీపోలింగ్ పై నిర్ణయం తీసుకోలేదని వివరించినట్టు సమాచారం. దీంతో చంద్రబాబు ఇక చేసేదేమీ లేక.. తాము ఇచ్చిన ఫిర్యాదులపై నిర్ణయం తీసుకోలేదని అడిగినట్టు తెలిసింది. అయితే, అందుకు సంబంధించిన ఆధారాలను సమర్పిస్తే.. తప్పకుండా పరిశీలిస్తామని ఈసీ చెప్పడంతో మౌనంగా వెనుదిరిగారని సమాచారం.

అయితే, మీడియాతో మాట్లాడినప్పడు మాత్రం షరా మామూలుగానే ఎన్నికల సంఘంపై విమర్శలు చేశారు. పోలింగ్ జరిగిన 25 రోజుల తర్వాత నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. ఇదంతా వివక్ష కాదా (ఈజ్ ఇట్ నాట్ వివక్షత?) అని ప్రశ్నించారు. కాగా, చంద్రగిరి నియోజకవర్గంలోని మరో రెండు కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా ఆదేశించింది. ఇప్పటికే ఎన్ఆర్ కమ్మపల్లి, పులవర్తివారిపల్లి, కొత్తకండ్రిగ, కమ్మపల్లి, వెంకటరామాపురం పోలింగ్ బూత్ లతో రీపోలింగ్ కు ఆదేశాలివ్వగా.. తాజాగా శనివారం కుప్పం బాదూరు, కాలూరు కేంద్రాల్లో కూడా రీపోలింగ్ నిర్వహించాలని ఆదేశించింది.

దీంతో ఆదివారం చంద్రగిరిలోని మొత్తం 7 కేంద్రాల్లో రీపోలింగ్ జరగనుంది. చంద్రబాబు సీఈసీని కలిసిన మరుసటి రోజు కొత్తగా మరో రెండు కేంద్రాల్లో రీపోలింగ్ కు ఆదేశాలు జారీకావడం సర్వత్రా చర్చనీయాంశమైంది.

7 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

Elephant: గున్న ఏనుగుకు జెడ్ కేటగిరీ భద్రత.. వీడియో వైరల్

Elephant: కుటుంబం తమ పిల్లల సంరక్షణను ఎలా చూసుకుంటుందో మానవ సంబంధాలలో చూస్తూంటాం. తమకూ తెలుసనిపించేలా ఉన్న అడవిలోని ఏనుగులకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు ‘ఎక్స్’లో...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు కూడా వుంటారు. అందుకే, యూ ట్యూబ్ ఇంటర్వ్యూలలో...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....