Switch to English

ఏపీలోనే రవిప్రకాష్?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

కేసుల మీద కేసులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్ ఆంధ్రప్రదేశ్ లోనే తల దాచుకున్నట్టు సమాచారం. టీవీ9 వాటాల వ్యవహారంలో అవకతవకలకు పాల్పడటంతోపాటు కంపెనీ సెక్రటరీ సంతకాన్ని ఫోర్జరీ చేసిన విషయంలో, టీవీ9 లోగోలను రూ.99 వేలకు అమ్మినట్టు కేసులు ఎదుర్కొంటున్న ఆయన.. గత కొంత కాలంగా పత్తా లేకుండా పోయిన సంగతి తెలిసిందే. పోలీసులు రెండు సార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ, రవిప్రకాష్ విచారణకు హాజరుకాలేదు. దీంతో ఆయన్ను అరెస్టు చేసే దిశగా పోలీసులు చర్యలు ప్రారంభించారు.

రవిప్రకాష్ పై ఆరోపణలు వచ్చిన రోజు సాయంత్రం టీవీ9 స్టూడియోలో అకస్మాత్తుగా ప్రత్యక్షమై.. తాను ఎక్కడికీ పారిపోలేదని, తాను ఇప్పుడు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లోని టీవీ9 కార్యాలయంలోనే ఉన్నానని, తన వార్తలు తానే చదువుతున్నానని పేర్కొన్నారు. తర్వాతి రోజు ఉదయాన్నే కార్యాలయానికి వచ్చి మధ్యాహ్నం వరకు అక్కడే ఉన్నారు. పోలీసులు వస్తున్నారనే సమాచారం తెలియడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఎక్కడా కనిపించలేదు. ఫోన్ లో కూడా అందుబాటులో లేకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు జారీ చేసినప్పటికీ స్పందించలేదు. తనకు పది రోజుల గడువు కావాలని మాత్రం లాయర్ ద్వారా కబురు పంపించారు. కానీ పోలీసులు విచారణకు హాజరు కావాల్సిందేనని స్పష్టంచేసినా, రవిప్రకాష్ ఖాతరు చేయలేదు.

విచారణకు వస్తే తనను అరెస్టు చేస్తారనే అనుమానం ఉండటంతో ఆయన విచారణకు రావడంలేదని తెలుస్తోంది. అందువల్లే ముందస్తు బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ కూడా వేశారు. తాము రెండు సార్లు నోటీసులు జారీచేసినప్పటికీ స్పందించకపోవడంతో సైబరాబాద్ క్రైమ్ పోలీసులు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. తాజాగా రవిప్రకాష్ తోపాటు ఆయన సన్నిహితుడు, సినీనటుడు, గరుడ పురాణంతో ఫేమస్ అయిన శివాజీపై లుకౌట్ నోటీసులు జారీచేశారు. వీరిద్దరూ దేశం విడిచి వెళ్లిపోకుండా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇప్పటికే రవిప్రకాష్ పాస్‌పోర్టును సీజ్ చేసిన పోలీసులు.. తాజాగా ఆయనపై లుకౌట్ నోటీసులు జారీచేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో వీరిద్దరినీ ఏ క్షణంలోనైనా అరెస్టు అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం రవిప్రకాష్ ఎక్కడ ఉన్నారో పోలీసులు ఆరా తీస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆయన ఆంధ్రప్రదేశ్ నే తన షెల్టర్ జోన్ గా ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వ పెద్దల సహకారంతో ఆయన సురక్షితమైన ప్రదేశంలో ఉన్నట్టు సమాచారం. రవిప్రకాష్ ప్రకాశం జిల్లాలోని ఓ రిసార్టులో ఉన్నాడంటూ అందిన సమాచారాన్ని రూఢీ చేసుకునే పనిలో సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు నిమగ్నమైనట్టుగా తెలుస్తోంది.

అయితే, వీరు ఈ విషయాన్ని నిజమో కాదో నిర్ధారించుకుని అక్కడకు వెళ్లేసరికి రవిప్రకాష్ మాయం అయ్యే అవకాశం లేకపోలేదని అంటున్నారు. అక్కడి ప్రభుత్వ పెద్దలు సహకరించినంత కాలం రవిప్రకాష్ ను అదుపులోకి తీసుకోవడం కష్టమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక ఐదు రోజుల్లో ఏపీ ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. టీడీపీ విజయం సాధిస్తే రవిప్రకాష్ సేఫ్ జోన్ లో ఉండే అవకాశం ఉంటుంది. అలా కాకుండా జగన్ అధికారంలోకి వస్తే మాత్రం ఆయనకు కష్టకాలం తప్పదు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడున్నా పోలీసులు అరెస్టు చేయడం ఖాయం. ఈలోగా ముందస్తు బెయిల్ తీసుకుంటే అరెస్టు కాకుండా తప్పించుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఆయన ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ అనేక గాసిప్స్ వస్తూనే ఉన్నాయి. అనేక...

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...