‘బొంగు’ అనడం తప్పా.? ‘నా కొడకా’ అనడం తప్పా.? ‘పిచ్చోడా’ అనడం తప్పా.? ఈ మూడిట్లో ఏది పెద్ద తప్పు.? ఏది చిన్న తప్పు.? దేన్ని క్షమించేయొచ్చు.? దేన్ని క్షమించకూడదు.?
బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో ఏడో సీజన్ లేటెస్ట్ ఎపిసోడ్.. అదీ వీకెండ్ ఎపిసోడ్లో హోస్ట్ అక్కినేని నాగార్జున, ఈ మూడు పదాల విషయమై కంటెస్టెంట్లకు క్లాస్ పీకాడు. ‘పిచ్చోడా’ అని అన్నందుకు శోభా శెట్టికి లైట్ కోటింగ్ పడింది. కాస్త బెటర్ కోటింగ్ అమర్‌కి ‘నా కొడకా.. పగిలిపోద్ది..’ అన్నందుకుగాను పడింది.
‘బొంగు’ అన్నందుకు మాత్రం సందీప్‌కి కోటింగ్ చాలా గట్టిగా పడింది. ‘బొంగులో ఆన్సర్..’ అంటూ విరుచుకుపడిపోయాడు అక్కినేని నాగార్జున, డాన్స్ మాస్టర్ సందీప్ విషయంలో. అంత రెచ్చిపోయి, తుస్సుమనిపించేయడం నాగార్జున ప్రత్యేకత అనుకోవాలేమో.!
పై మూడు విషయాల్లో ఏదీ చిన్న తప్పు కాదు.! వాస్తవానికి, నేరుగా హౌస్ నుంచి బయటకు గెంటేయాల్సిన మాటలే ఇవి. కానీ, కంటెస్టెంట్ల మీద హోస్ట్ నాగార్జున జాలి ప్రదర్శించినట్లున్నాడు.
అయినా, ఈ మొత్తం వ్యవహారంలో గట్టిగా క్లాస్ తీసుకోవాల్సింది పల్లవి ప్రశాంత్‌కి. నామినేషన్ల వ్యవహారం వస్తే చాలు, అపరిచితుడిలా మారిపోతుంటాడు. పల్లవి ప్రశాంత్ కారణంగానే హౌస్‌లో వాతావరణం పూర్తిగా చెడిపోతోంది నామినేషన్ల సందర్భంగా.
శోభా శెట్టి కూడా తక్కువేం కాదు. ఆమె కూడా అర్థం పర్థం లేని బిహేవియర్ ప్రదర్శిస్తోంది. అన్నట్టు, భోళే కూడా.. ఒకింత దారుణంగానే ప్రవర్తిస్తున్నాడు. వీకెండ్ ఎపిసోడ్లో కంటెస్టెంట్లను సంస్కరించాల్సిన నాగార్జున, అదేదో మొక్కుబడి వ్యవహారంగా మార్చేస్తున్నాడు. ఫలితం, ప్రతి వారం హౌస్‌లో నాన్సెన్స్ తప్ప ఇంకేమీ వుండటంలేదు.