Switch to English

నాగార్జునకి ‘బిగ్‌’ టెస్ట్‌: ‘కింగ్‌’ అన్పించుకుంటాడా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,422FansLike
57,764FollowersFollow

బిగ్‌ బాస్‌ రియాల్టీ షో మూడో సీజన్‌కి హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న కింగ్‌ అక్కినేని నాగార్జునకి తొలి పరీక్ష కాస్సేపట్లో ఎదురుకాబోతోంది. సీజన్‌ ప్రారంభోత్సవంలో నాగార్జున తనదైన స్టయిల్లో అదరగొట్టేసిన మాట వాస్తవం. కంటెస్టెంట్స్‌ని హౌస్‌లోకి పంపించే క్రమంలో నాగ్‌ జోష్‌ అందరికీ నచ్చింది. కంటెస్టెంట్స్‌తోపాటు ఆడి, పాడి అలరించాడు నాగార్జున. కానీ, వీకెండ్‌ ఎపిసోడ్స్‌లోనే అసలు సిసలు పరీక్షను ఎదుర్కోవాల్సి వుంటుంది నాగార్జున.

మొదటి రెండు సీజన్లతో పోల్చితే, ఈసారి బిగ్‌ హౌస్‌లో కంటెస్టెంట్స్‌ చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నారు. రెండు సీజన్స్‌ ఆల్రెడీ చూసిన అనుభవం వుండడంతో, సెలబ్రిటీ స్టేటస్‌ తక్కువ వున్నవాళ్ళు కూడా, తమదైన ప్రత్యేకతను చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నారు మూడో సీజన్‌లో. ఎవరూ తక్కువ కాదు.. అనే స్థాయిలో కంటెస్టెంట్స్‌ ఎవరికి వారు తమదైన వ్యూహాలతో ముందుకెళుతున్నారు. ఈ వారం ఎలిమినేషన్‌ ద్వారా ఎవరి వికెట్‌ పడుతుందోగానీ, రెండు రోజులపాటు వీకెండ్‌ షోస్‌లో అక్కినేని నాగార్జున, కంటెస్టెంట్ల సాదక బాధకాల్ని వినాల్సి వుంటుంది. వారికి కొన్ని సలహాలు ఇవ్వాలి, కొన్ని హెచ్చరికలూ చేయాలి.

ఈ విషయంలో రెండో సీజన్‌ హోస్ట్‌ నానితో పోల్చితే, మొదటి షోకి హోస్ట్‌ అయిన యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌కే ఎక్కువ మార్కులు పడతాయి. మరి, నాగార్జున పరిస్థితి ఏంటి.? మీలో ఎవరు కోటీశ్వరుడు షో ద్వారా, బుల్లితెర అనుభవం బాగానే సంపాదించినా, బిగ్‌బాస్‌ అనేది ఓ డిఫరెంట్‌ బాల్‌ గేమ్‌. 15 మంది కంటెస్టెంట్లు.. ఆయా కంటెస్టెంట్లకు విడివిడిగా సోషల్‌ మీడియాలో ఆర్మీలు.. వీటన్నిటినీ తట్టుకోవడమంటే నాగార్జునకి కత్తి మీద సాము అని చెప్పక తప్పదు.

సోషల్‌ మీడియాలో ఆల్రెడీ నాగార్జునకి వ్యతిరేకంగా ట్రోలింగ్‌ జరగడాన్ని చూశాం. అదీ ఫస్ట్‌ ఎపిసోడ్‌.. అందునా ఓపెనింగ్‌ సెర్మానీకే అంతటి ట్రాలింగ్‌ జరిగింది. మరి, హౌస్‌లో కంటెస్టెంట్స్‌ని వార్న్‌ చేసినా, సలహాలు ఇచ్చినా.. ఆ తర్వాత సీన్‌ మారిపోతుంది. అన్నట్టు, హౌస్‌లో గొడవలపై నాగార్జునతోనే తేల్చుకుంటానని సీనియర్‌ నటి హేమ ఇప్పటికే ప్రకటించిన విషయం విదితమే. ‘నాగార్జునగారి స్థాయి ఏంటి.? మన పత్తి యవ్వారం స్థాయి ఏంటి.?’ అని మహేష్‌ విట్టా సెటైర్‌ కూడా వేసేశాడనుకోండి.. అది వేరే సంగతి. బిగ్‌బాస్‌ రియాల్టీ షో సంగతి పక్కన పెడితే, నాగ్‌ హీరోగా తెరకెక్కిన ‘మన్మథుడు-2’పై ప్రీ రిలీజ్‌ బజ్‌ సూపర్బ్‌గా వుంది. ఆగస్ట్‌ 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం విదితమే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

రాజకీయం

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

ఎక్కువ చదివినవి

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree). కమలేష్ కుమార్ నిర్మాత. మే24న విడుదలవుతోన్న...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

Elephant: గున్న ఏనుగుకు జెడ్ కేటగిరీ భద్రత.. వీడియో వైరల్

Elephant: కుటుంబం తమ పిల్లల సంరక్షణను ఎలా చూసుకుంటుందో మానవ సంబంధాలలో చూస్తూంటాం. తమకూ తెలుసనిపించేలా ఉన్న అడవిలోని ఏనుగులకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు ‘ఎక్స్’లో...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...