గుండె పోటుతో ఆసుపత్రిలో జాయిన్ అయిన బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆరోగ్యం నిలకడగా ఉందని వైధ్యులు ప్రకటించారు. ఆయన కు సాదారణ ట్రీట్మెంట్ ను అందిస్తున్నట్లుగా ఈ సందర్బంగా ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి.
ప్రస్తుతానికి గంగూలీ ఆరోగ్యం బాగానే ఉన్నా కూడా ముందు ముందు పరిస్థితుల నేపథ్యంలో మరో యాంజియోప్లాస్టీ చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కొన్ని రోజులు లేదా కొన్ని వారాల తర్వాత ఆయనకు యాంజియోప్లాస్టీ చేయాల్సి రావచ్చు అంటూ వైధ్యులు అంటున్నారు.
గంగూలీ గుండె రక్తనాళాల్లో మూడు పూడికలను గుర్తించినట్లుగా వైధ్యులు తెలియజేశారు. అందులో ఒక దాన్ని తొలగించేందుకు స్టంట్ వేయడం జరిగింది. త్వరలోనే మరోసారి ఆ పక్రియ చేయాల్సి ఉందంటూ కోల్ కత్తాకు చెందిన వుడ్ ల్యాండ్స్ ఆసుపత్రి వర్గాల వారు పేర్కొన్నారు.
గంగూలీ ఆరోగ్యం విషయం అభిమానులతో పాటు దేశ వ్యాప్తంగా ప్రముఖులకు ఆందోళన కలిగించింది. గంగూలీ పూర్తిగా ఆరోగ్యవంతంగా రావాలంటూ అభిమానులు పూజలు చేస్తున్నారు.
906471 560559Howdy! I just want to give an enormous thumbs up for the excellent details you may have here on this post. I will likely be coming back to your weblog for a lot more soon. 302221