Switch to English

రాజకీయాలకు బండ్ల గణేష్ గుడ్ బై

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

ప్రముఖ సినీ నిర్మాత, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బండ్ల గణేష్ రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం ట్వీట్ చేశారు. వ్యక్తిగత కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ‘‘నా వ్యక్తిగత కారణాలతో రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నాను. నాకు అవకాశం కల్పించిన ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు.

ఇక నుంచి నేను ఏ రాజకీయ పార్టీకీ సంబంధించినవాడిని కాదు. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నా విమర్శలు, వ్యాఖ్యల వల్ల బాధపడినవారిని పెద్దమనసుతో క్షమించమని కోరుతున్నాను’’ అని బండ్ల గణేష్ పేర్కొన్నారు. సినిమాల్లో చిన్ననటుడిగా జీవితం ప్రారంభించిన బండ్ల గణేష్.. అనంతర కాలంలో నిర్మాతగా మారారు. పెద్ద హీరోలతో సినిమాలు కూడా తీశారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తనకు దేవుడితో సమానం అంటూ అందరి దృష్టినీ ఆకర్షించిన ఆయన.. తర్వాత కొంతకాలంపాటు పవన్ కు దూరమయ్యారు.

ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీ వెళ్లి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న బండ్ల గణేష్.. ఆ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తారని భావించారు. అయితే, కొన్ని కారణాల నేపథ్యంలో ఆయనకు టీపీసీసీ సీటు ఇవ్వలేదు. దీంతో ఆయన్ను సంతృప్తి పరచడం కోసం కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నియమిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.

ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవకపోతే బ్లేడుతో పీక కోసుకుంటానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం మూటగట్టుకోవడంతో ఫలితాలు వచ్చిన తర్వాత నాలుగైదు రోజులపాటు ఆయన ఎవరికీ కనిపించలేదు. ఆ క్రమంలో తిరుపతిలో మాడియా కంటపడ్డారు. ఈలోగా బండ్లపై సోషల్ మీడియాలో సెటైర్లు వెల్లువెత్తాయి. బ్లేడ్ రెడీ.. పీక కోసుకోవడానికి నువ్వు రెడీనా అంటూ జోకులు పేలాయి. ఈ క్రమంలో తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన బండ్ల వద్ద మీడియా ఈ విషయాన్ని ప్రస్తావించగా.. తెలివిగా సమాధానం చెప్పి తప్పించుకున్నారు. ఆ తర్వాత రాజకీయాలకు కాస్త దూరం పాటిస్తూ వచ్చారు.

అయితే, బండ్ల అతిచేష్టల వల్లే కాంగ్రెస్ అధిష్టానం ఆయన్ను పక్కన పెట్టిందనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయాలనేది తన చిరకాల కోరిక అని చెప్పిన బండ్ల.. కొద్ది రోజుల్లోనే రాజకీయాల నుంచి తప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది. వ్యక్తిగత కారణాలతోనే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టుగా ఆయన ట్వీట్ చేసినా, దీనివెనుక ఏదో మతలబు ఉందని అంటున్నారు. పైగా గురువారం జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మద్దతుగా ట్వీట్ చేయడం ఇందుకు బలం చేకూరుస్తోంది. ‘‘నిజాయతీకి నిలువుటద్దం, మానవత్వానికి ప్రతిరూపం, మంచితనానికి మరోపేరు.. నా దైవం, నా బాస్.. పవన్ కల్యాణ్ గారిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చూడాలని నా ప్రగాఢమైన కోరిక. నా ఆశ, నా కోరిక నిజం చేయాలని రాష్ట్ర ప్రజలకు నా

నా హృదయపూర్వక విజ్ఞప్తి’’ అంటూ ట్వీట్ చేసిన మరుసటి రోజే బండ్ల రాజకీయాలకు గుడ్ బై చెప్పడం గమనార్హం. శాశ్వతంగా రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించిన ఆయన.. మరి ఏ విధంగా జనసేనకు మద్దతుగా నిలుస్తారో చూడాలి.

7 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

రాజకీయం

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

ఎక్కువ చదివినవి

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

Elephant: గున్న ఏనుగుకు జెడ్ కేటగిరీ భద్రత.. వీడియో వైరల్

Elephant: కుటుంబం తమ పిల్లల సంరక్షణను ఎలా చూసుకుంటుందో మానవ సంబంధాలలో చూస్తూంటాం. తమకూ తెలుసనిపించేలా ఉన్న అడవిలోని ఏనుగులకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు ‘ఎక్స్’లో...

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.. దీనిపై ఎన్టీఆర్ టీమ్ స్పందించింది. ప్రస్తుతం...