‘అఖండ’ సినిమా హిట్టు కొట్టిన ఉత్సాహంలో వున్నారు సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. ఈ జోరులో, స్వర్గీయ నందమూరి తారకరామారావుకి అప్పట్లో నారా చంద్రబాబునాయుడు రాజకీయంగా పొడిచిన వెన్నపోటు వ్యవహారంపై ‘తిమ్మిని బమ్మిని’ చేయాలనుకుంటున్నారేమో బాలయ్య, దానికోసమే ‘ఆహా’ వేదికగా, ‘అన్స్టాపబుల్’ కార్యక్రమాన్ని వాడేసుకున్నారు.
బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన ‘అఖండ’ సినిమా ప్రమోషన్ కోసం, ‘ఆహా’లో చిత్ర బృందంతో కలిసి సందడి చేశారు బాలకృష్ణ. ‘అన్ స్టాపబుల్’ కార్యక్రమానికి ఆయనే హోస్ట్. అందుకేనేమో, అడ్వాంటేజ్ తీసుకుని, ఒకప్పటి ‘వెన్నపోటు’ ఎపిసోడ్ మీద క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ ఘటనకు సంబంధించి జరిగిన, జరుగుతున్న దుష్ప్రచారం గుర్తు చేసుకుంటే కన్నీళ్ళొస్తాయని బాలయ్య చెప్పుకొచ్చారు.
ఔనా, అలాగైతే.. స్వర్గీయ ఎన్టీయార్ ఎంతలా విలవిల్లాడి వుండాలి.? లక్ష్మీపార్వతి ఎప్పుడైతే ఎన్టీయార్ జీవితంలోకి ప్రవేశించారో, ఆ తర్వాతి నుంచీ నందమూరి కుటుంబంలో వివాదాలు మొదలయ్యాయి. తెలుగుదేశం పార్టీలోనూ లుకలుకలు షురూ అయ్యాయి.
ప్రస్తుత టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, ఆనాటి ఆ ప్రత్యేక పరిస్థితుల్ని తనకు అనుకూలంగా మార్చుకున్నారు. కుటుంబంలో గొడవలు పెద్దవయ్యాయ్.. పార్టీలో ప్రకంపనల తీవ్రతా పెరిగింది. చివరికి స్వర్గీయ ఎన్టీయార్ని నందమూరి కుటుంబం నుంచి బయటకు పంపేశారు.. టీడీపీ నుంచీ గెంటేశారు. ఇది చరిత్ర.. దీన్ని తప్పుగానో, ఇంకోరకంగానో చిత్రీకరించే అవకాశమే లేదు.
సరే, ఎన్టీయార్ చేసిన ‘తప్పు’ వల్లనే ఇదంతా జరిగిందా.? అంటే అది వేరే చర్చ. చంద్రబాబు, ఎన్టీయార్ని రాజకీయంగా వెన్నుపోటు పొడిచారు.. దానికి నందమూరి కుటుంబ సభ్యులు (బాలకృష్ణ సహా) సహకరించారు. ఎన్టీయార్ బోరున విలపించారు.. తనకు జరిగిన అన్యాయంపై.
అది వెన్నుపోటని ఎవరైనా అంటే, బాలయ్యకు కన్నీరు వస్తుందట.. వెన్నుపోటు కాదని ఎవరన్నా అంటే, ఎన్టీయార్ ఆత్మ ఘోషిస్తుందని బాలయ్యకు తెలియదా.? అన్నట్టు, బాలయ్య కూడా వెన్నపోటులో భాగస్వామి.. అంటూ సాక్షాత్తూ ఎన్టీయార్ మరో అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గతంలో స్పష్టం చేశారు. ఆ పాత వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. సో, బాలయ్య తన బావ చంద్రబాబు ఏడ్చారు కాబట్టి, వెన్నుపోటు అనగానే తనకూ ఏడుపొస్తుందని అంటున్నారుగానీ.. అలా ఏడిస్తే వచ్చేవి కన్నీళ్ళు కావు, మొసలి కన్నీళ్ళని మనం అర్థం చేసుకోవాలన్నమాట.
135992 910124Perfectly written topic material , thanks for selective info . 797259