హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఫ్రస్టేషన్ తారాస్థాయికి చేరినట్టు కనిపిస్తోంది. ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే తన వ్యవహార శైలితో తీవ్ర విమర్శల పాలైన బాలయ్య.. తన తీరు మాత్రం మార్చుకోలేకపోతున్నారు. ప్రతిరోజూ ఏదో ఒక సభలో తన నోటి దురుసుతో వార్తల్లోకి వస్తున్నారు. ఇటీవల ఎన్నికల ప్రచారం సందర్భంగా ఓ యూట్యూబ్ ఛానల్ కెమెరా మేన్ పై చేయి చేసుకున్న బాలయ్య.. అనంతరం సొంత పార్టీ కార్యకర్తపైనే జులుం ప్రదర్శించారు. హిందూపూర్ నియోజకవర్గంలో సిరిపురం చెరువుకు నీరు విడుదల చేయాలని కోరిన టీడీపీ కార్యకర్త రవికుమార్ పై బాలకృష్ణ చేయి చేసుకున్నారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన అతడు.. టీడీపీకి రాజీనామా చేసి, వైఎస్సార్ సీపీలో చేరిపోయారు.
అనంతరం రెండు రోజుల క్రితం బాలయ్య తన భార్య వసుంధరతో కలిసి ప్రచారం చేస్తూ.. సొంత అభిమానులపైనే నోరు పారేసుకున్నారు. ప్రచారానికి వచ్చిన బాలయ్యను చూసిన ఆయన అభిమాని.. ఆనందంతో ‘సార్.. ఈసారి మీకు 50 వేల మెజార్టీ వస్తుంది’ అని అరిచాడు. మరో అభిమాని కూడా 60 వేలు గ్యారెంటీ సార్ అంటూ గట్టిగా అరిచాడు. దీనికి ఆనందించాల్సిన బాలకృష్ణ.. ఒక్కసారిగా రెచ్చిపోయారు. నీ సంగతి చెబుతా.. పీక కోస్తా… నా కొడకా.. అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అరే.. నీ పేరు, అడ్రస్ చెప్పరా.. గెలవకపోతే నీ సంగతి చెబుతా.. అంటూ వార్నింగ్ ఇచ్చారు. వీటిపైనే తీవ్ర విమర్శలు వ్యక్తంకాగా, ఈసారి మరింత రెచ్చిపోయారు. ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీపైనే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హిందూపురం నియోజకవర్గంలోని శ్రీకంఠపురంలో ప్రచారం చేసిన సందర్భంగా ప్రధాని మోదీకి సిగ్గులేదని మండిపడ్డారు. గతంలో తాను ఆయన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టానని.. ధర్మపోరాట దీక్ష సందర్భంగా ఎన్ని మాటలన్నా ఆయన సిగ్గు లేకుండా ఉన్నారని ధ్వజమెత్తారు. తాను ఎన్ని మాటలన్నా మోదీ, కేసీఆర్, జగన్ ఎవరూ ఏమీ చేయలేరంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఇది జరిగిన మరుసటి రోజే మరోసారి బాలకృష్ణ అభిమానులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. శనివారం విశాఖ జిల్లా భీమునిపట్నంలో తన చిన్నల్లుడు, విశాఖ టీడీపీ ఎంపీ అభ్యర్థి భరత్ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బాలయ్య మాట్లాడుతుండగా కొందరు అభిమానులు నినాదాలు చేశారు. దీంతో బాలకృష్ణ ఒక్కసారిగా వారిపై మండిపడ్డారు. ‘ఏయ్.. మాట్లాడకు’ అంటూ ఓ అభిమానిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో సదరు అభిమాని ఒక్కసారిగా చిన్నబోయాడు. అనంతరం బాలయ్య తన ప్రసంగాన్ని కొనసాగించారు. అసలే ఎన్నికల ప్రచారం సమయంలో అన్ని వర్గాలనూ ఆకట్టుకునే విధంగా ముందుకు వెళ్లాల్సి ఉండగా.. బాలకృష్ణ మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీ నేతలతోపాటు సొంత పార్టీ కార్యకర్తలు, తన అభిమానులను చెడుగుడు ఆడేసుకుంటున్నారు. దీంతో తెలుగు తమ్ముళ్లు తల పట్టుకుంటున్నారు.
బాలయ్య ప్రచారంతో మైలేజ్ రావడం మాట అటుంచి, మొదటికే మోసం వచ్చేలా ఉందంటూ నిట్టూర్పులు విడుస్తున్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య పోటాపోటీ పోరు తప్పని పరిస్థితులు నెలకొన్న ఈ తరుణంలో బాలయ్య వైఖరి ప్రతికూలంగా మారే అవకాశం ఉందని వారు ఆందోళన చెందుతున్నారు. ఇకనైనా బాలకృష్ణ సంయమనంతో వ్యవహరిస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. మరి మన లెజెండ్ తన వైఖరి మార్చుకుంటారో లేదో చూడాలి.
237471 687710I have fun with, lead to I discovered exactly what I used to be having a look for. 682700
44883 603336But a smiling visitant here to share the really like (:, btw wonderful style and style . 671058
561707 164249Extremely nice style and style and fantastic topic matter, quite little else we want : D. 529883