నందమూరి బాలకృష్ణ హీరోగా నటించే నెక్స్ట్ సినిమాకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రముఖ తమిళ దర్శకుడు కె ఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాను నిర్మాత సి కళ్యాణ్ నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయి. ఐతే ఈ సినిమాకు సంబందించిన ఓ హాట్ న్యూస్ ఫిలిం వర్గాల్లో హల్చల్ చేస్తుంది. ఇంతకీ ఆ న్యూస్ ఏమిటంటే .. ఈ సినిమాకు రూలర్ అనే టైటిల్ పెడుతున్నట్టు టాక్. తాజాగా రూలర్ అనే టైటిల్ ని నిర్మాత సి కళ్యాణ్ ఫిలిం ఛాంబర్ పై రిజిస్టర్ చేయించాడట. అయితే ఈ సినిమాకు అధికారికంగా ఈ టైటిల్ పెడుతున్నట్టు కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది.
అన్న ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో డిస్సప్పాయింట్ అయిన బాలయ్య ఈ సినిమాతో ఎలాగైనా హిట్టు కొట్టాలనే కసితో ఉన్నాడు. అందుకే పక్క పవర్ ఫుల్ మాస్ కథను ఎంచుకున్నాడు. బాలకృష్ణ – కె ఎస్ రవికుమార్ ల కాంబినేషన్ లో ఇటీవలే వచ్చినా జై సింహ ఆశించిన స్థాయి సక్సెస్ ని అందుకోలేదు. అయినప్పటికీ బాలయ్య, రవికుమార్ చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమాకు ఓకే చెప్పాడట.
ఇక రూలర్ అనే టైటిల్ ఈ సినిమాకు పెడుతున్నారని వార్తలు రావడంతో అటు నందమూరి అభిమానుల్లో సందడి నెలకొంది. బాలయ్య కు ఈ టైటిల్ బాగా సూట్ అవుతుందని అంటున్నారు. ఈ సినిమాలో బాలయ్యకు మరోసారి జగపతి బాబు విలన్ గా మారనున్నాడు. జూన్ నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే ఈ సినిమాకోసం హీరోయిన్ అన్వేషణ జరుగుతుంది.