మన్మధుడు .. కింగ్ నాగార్జున హీరోగా అప్పట్లో వచ్చిన మన్మధుడు సూపర్ హిట్ విజయాన్ని అందుకుని నిజంగా నాగార్జున గ్లామర్ కు కేర్ అఫ్ అడ్రస్ గా మారింది. ఆ సినిమా తరువాత టాలీవుడ్ మన్మదుడిగా నాగ్ పేరు మారుమ్రోగిపోయింది. చాలా గ్యాప్ తరువాత ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం పోర్చుగల్ లో జరుగుతుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ తో పాటు కన్నడ బ్యూటీ అక్షర గౌడ కూడా నటిస్తుంది.
అయితే ఇందులో మరో కీలక రోల్ లో నాగార్జున కోడలు సమంత కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. సమంత ఈ సినిమాలో నటిస్తుందన్న వార్త తెలిసినప్పటినుండి ఆమె ఫాన్స్ లో ఆసక్తి ఎక్కువైంది. ఇంతకీ ఇందులో సమంత పాత్ర ఏమిటి ? అని. తాజాగా ఈ సినిమాలో సమంత రోల్ ఏమిటో తెలిసిపోయింది. మన్మధుడు చిత్రంలో హీరో అమ్మాయిలకు దూరంగా ఉంటాడు. అసలు అమ్మాయిలంటేనే చిరాకు, ఏ అమ్మాయిని దగ్గరికి కూడా రానివ్వడు. చూడడానికి మన్మదుడిగా ఉన్న వ్యక్తికీ ఎందుకు అమ్మాయిలంటే పడదు అన్న ప్రశ్న ఉంటుంది కదా .. దాన్ని రివీల్ చేసే పాత్రలో సమంత నటిస్తుందట.
అంటే మన్మధుడు మొదటి భాగంలో తనికెళ్ళ భరణి పోషించిన పాత్ర తరహాలో సమంత పాత్ర ఉంటుందని టాక్. అయితే ఈమె నాగ్ పాత్రకు ఎలాంటి వరుస అవుతుందనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి ఇన్నేళ్ల వయసులో కూడా నాగార్జున మన్మధుడు 2 కోసం నిజంగా మన్మదుడిగా మారిపోయాడు. తాజాగా అయన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రాన్ని దసరాకు విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.