Switch to English

గుంటూరు శ్రీను.. అఖిలప్రియ కిడ్నాప్ గ్యాంగ్ లో ఎలా చేరాడు..?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి అఖిలప్రియ అరెస్టయిన సంగతి తెలిసిందే. హఫీజ్ పేట భూముల వివాదంలో హైదరాబాద్ లోని ప్రవీణ్ రావుతో పాటు ఆయన ఇద్దరు అన్నదమ్ములను కిడ్నాప్ చేసిన ఘటన సంచలనం రేపింది. కిడ్నాప్ చేసిన వారిలో గుంటూరు శ్రీను అనే వ్యక్తి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ఇతని అసలు పేరు మాదాల శ్రీనుగా తెలుస్తోంది. శ్రీను గుంటూరువాసి అయినా అఖిలప్రియ అనుచరుడిగా ఎలా మారారనే అంశంపై పోలీసులు సేకరించిన సమాచారం ప్రకారం..

గుంటూరు అరండల్‌పేటలో నివాసం ఉంటోంది శ్రీను కుటుంబం. తండ్రి రమణయ్య గుంటూరులో కొన్నాళ్ల క్రితం టీస్టాల్‌ నిర్వహించారు. వారికి వడ్డీ, స్థిరాస్తి వ్యాపారాలు ఉన్నాయి. ఎటువంటి రాజకీయ, నేర చరిత్ర లేని శ్రీను సివిల్ ఇంజనీరింగ్ చదివాడు. చదువు మధ్యలోనే ఆపేసి మరో ఇద్దరు స్నేహితులతో కలసి బ్రాడీపేటలో ఇంటీరియర్‌ డిజైన్‌ వర్క్స్‌ కన్సల్టెన్సీ ప్రారంభించాడు. 2015లో స్థానిక విద్యానగర్‌లోని భూమా నాగిరెడ్డికి చెందిన ఇంటిలో ఇంటీరియర్‌ వర్క్స్‌ కాంట్రాక్టు దక్కింది. పనుల్లో భాగంగా శ్రీనుకు భూమా నాగిరెడ్డితో పరిచయం ఏర్పడింది.

అయితే.. బిల్లుల కోసం నాగిరెడ్డి వద్దకు వెళ్లే శ్రీనుకు భూమా రాజకీయ నేపథ్యం ఆకర్షించింది. అఖిలప్రియకు కూడా సన్నిహితంగా మారాడు. నాగిరెడ్డి మరణం.. అఖిలప్రియ మంత్రి అయిన నేపథ్యంలో అఖిలప్రియ విజయవాడకు మకాం వచ్చారు. ఆమె ఇంటి నిర్వహణ పనులు చూస్తూ క్రమంగా ఆమెకు అనుచరుడిగా మారాడు. నంద్యాల ఉప ఎన్నికల్లో కూడా అఖిలప్రియకు అనుకూలంగా పని చేశాడు. మంత్రి హోదాలో అఖిలప్రియ గుంటూరులోని శ్రీను నివాసానికి కూడా ఒకసారి రావడం అఖిలప్రియకు అభిమానిగా మారేలా చేశాయి.

ఇలా భూమా కుటుంబానికి శ్రీను దగ్గరయ్యాడు. 2019 ఎన్నికల తర్వాత కూడా అఖిలప్రియతోనే శ్రీను ప్రయాణం కొనసాగుతోంది. దాదాపు రెండేళ్లుగా శ్రీను గుంటూరులో నివాసం ఉండటం లేదని తెలుస్తోంది. ఈ గొడవల నేపథ్యంలో శ్రీను కుటుంబం గుంటూరు వదిలి వెళ్లిపోయారని తెలుస్తోంది. ప్రస్తుతం శ్రీను కోసం తెలంగాణ పోలీసులు గాలిస్తున్నారు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎక్కువ చదివినవి

Chandrababu Naidu : యూట్యూబ్‌లో బాబు బయోపిక్‌ ‘తెలుగోడు’

Chandrababu Naidu : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి ఏ స్థాయిలో ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి సమయంలో సోషల్‌ మీడియా క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. సోషల్‌ మీడియా ద్వారా ఓటర్లను...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి మళ్లీ ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అంటూ...