ప్రస్తుతం భీష్మ, రంగ్ దే సినిమాలు చేస్తున్న నితిన్ నెక్స్ట్ సినిమా విషయంలో ఓ హిందీ రీమేక్ పై కన్నేశాడు. ఆ సినిమాను తాను తెలుగులో రీమేక్ చేయాలనీ ఫిక్స్ అయ్యాడు నితిన్. ఆ వివరాల్లోకి వెళితే బాలీవుడ్ లో గత ఏడాది క్రితం వచ్చిన ఆందుదాన్ సినిమా సంచలన విజయం అందుకుంది.
ఆయుష్మాన్ ఖురానా, రాధికా ఆప్టే .. టబు ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు నితిన్ ప్రయత్నాలు మొదలెట్టాడు. తన సొంత నిర్మాణ సంస్థ శ్రేష్ట్ మీడియా ఈ హిందీ రీమేక్ హక్కులను భారీ పోటీ మధ్య సొంతం చేసుకుంది. వైవిధ్యభరిత చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా రీమేక్ కోసం ఏ దర్శకుడిని తీసుకోవాలా అన్న ఆలోచనలో ఉన్నారట.
ఇప్పటికే ఈ సినిమా విషయంలో ఇద్దరు దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి. అందులో హరీష్ శంకర్, సుధీర్ వర్మ ల పేర్లు ప్రముఖంగా ఉన్నాయి. ఈ ఇద్దరు దర్శకులలో ఎవరో ఒకరిని ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నారు. హరీష్ శంకర్ ప్రస్తుతం వరుణ్ తేజ్ తో వాల్మీకి సినిమా చేస్తున్నాడు. ఇక సుధీర్ వర్మ అటు రవితేజ తో ఓ తమిళ రీమేక్ సినిమా చేసే ఆలోచలవు ఉన్నాడు. సో ఇద్దరు దర్శకులలో ఎవరు ఫైనల్ అవుతారో చూడాలి.
611940 336332I truly appreciate this post. Ive been searching all more than for this! Thank goodness I found it on Bing. Youve produced my day! Thank you once more.. 20290