ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ‘అమ్మకానికి’ పెట్టేస్తున్నారా.? విపక్షాల విమర్శల్ని బట్టి చూస్తే ‘ఔనని’ అన్పించడం ఖాయం. అమరావతిని అమ్మేయడమేంటి.? అంటే, దానికీ ఓ లెక్కుందట. రాష్ట్ర రాజధాని అమరావతిని ‘డైల్యూట్’ చేసే ప్రక్రియని పక్కాగా అమలు చేస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం. కాస్సేపట్లో క్యాబినెట్ డెసిషన్ రాబోతోంది. మూడు రాజధానుల కాన్సెప్ట్ వెనుక అమరావతిని నిర్వీర్యం చేయాలన్న ఆలోచన సుస్పష్టం.
‘భూముల్ని తిరిగిచ్చేస్తాం..’, ‘అసెంబ్లీకి వెళుతోంటే ఎడారిలా అనిపిస్తోంది..’, ‘అమరావతి ఎక్కడుంది.. అంతా స్మశానమే..’ అంటూ అధికార పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలు, అమరావతి ప్రాంత ప్రజల్ని తీవ్ర ఆవేదనకు గురిచేసిన మాట వాస్తవం. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉధృతంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఇంతా చేసి, ఇప్పుడు అదే ‘ఎడారి’ అనబడ్డ ప్రాంతంలో, అదే ‘స్మశానం’ అన్న ప్రాంతంలో అమరావతి భవిష్యత్తుపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతోంది.
ఇదిలా వుంటే, అమరావతిపై అధికార పార్టీకి చెందిన ఓ ముఖ్య నేత కన్ను పడిందనీ, పార్టీలో.. ప్రభుత్వంలో ఆయన కీలక భూమిక పోషిస్తున్నారనీ, పైగా విద్యా సంస్థల వ్యాపారంలో ఆయనకు అపారమైన అనుభవం వుందనీ, ఆయనకే అమరావతిలో మెజార్టీ భూముల్ని కట్టబెట్టే దిశగా సమాలోచనలు జరుగుతున్నాయంటూ ఓ ప్రచారం విపక్షాల నుంచి తెరపైకొచ్చింది.
సదరు వైసీపీ ముఖ్య నేతకి తెలంగాణలో అధికార పార్టీకి చెందిన ఓ ముఖ్య నేత జత కలిశారట. ‘ఎడ్యుకేషనల్ క్యాపిటల్’ ముసుగులో అమరావతిని అమ్మకానికి పెట్టే కుట్ర జరుగుతోందని విపక్షాలు గగ్గోలు పెడ్తున్నాయి.
అమరావతి శంకుస్థాపనకు వెళ్ళి, ఆర్థిక సహాయం అందించాలనుకున్నట్లు గతంలో చెప్పిన కేసీఆర్, ఆ తర్వాత మాట మార్చి.. అమరావతిని దండగ ప్రాజెక్టుగా కొట్టి పారేసిన విషయం విదితమే. ఎలా చూసినా, అమరావతి మీద ‘రాజకీయ గద్దల’ కన్ను సుస్పష్టం. మరి, ఈ పరిస్థితి నుంచి తమ ప్రాంతాన్ని అమరావతి ప్రజానీకం కాపాడుకోగలుగుతుందా.? వేచి చూడాల్సిందే.
936314 952399You got a quite great site, Gladiolus I discovered it by means of yahoo. 305084
909095 953481Hmm is anyone else experiencing troubles with the images on this blog loading? Im trying to discover out if its a problem on my end or if it is the blog. Any feed-back would be greatly appreciated. 912771