Switch to English

‘అ’ అంటే అప్పు.. ‘ఆ’ అంటే ఆంధ్రపదేశ్.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

‘అ’ అంటే అభివృద్ధి.. ‘ఆ’ అంటే ఆంధ్రపదేశ్.. ఇది ఒకప్పటి మాట. కానీ, ఇప్పుడు ‘అ’ అంటే అప్పులు.. ‘ఆ’ అంటే ఆంధ్రపదేశ్. అవును, ఆంధ్రపదేశ్ అనే పేరు కంటే ముందు అప్పుల గురించిన ప్రస్తావన వస్తోంది. అప్పుడు చంద్రబాబు, ఇప్పుడు వైఎస్ జగన్.. రాష్ట్ర భవిష్యత్తు కొత్తగా ఏం మారలేదు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేయడం.. అనే ఘనకార్యాన్ని చంద్రబాబు ఘనంగా నిర్వహిస్తే.. అంతకన్నా ఘనంగా వైఎస్ జగన్ అప్పులు చేస్తూ.. రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తున్నారు.. వెరసి.. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఇక తేరుకోవడం దాదాపుగా అసాధ్యం.

కేవలం 10 నెలల్లో దాదాపు 74 వేల కోట్లకు పైగా అప్పులు చేసిందట రాష్ట్రం. ‘కాగ్’ వెల్లడించిన విషయాలివి. ఇంకో రెండు నెలల్లో చేయబోయే అఫ్పులెలా వుంటాయ్.? అన్నది ప్రస్తుతానికైతే భయంకరమైన ప్రశ్నే. ఇంతకీ, ఇన్ని అప్పులు చేసేసి.. రాష్ట్రానికి గొప్ప రాజధానినేమైనా ప్రభుత్వం నిర్వహించేస్తోందా.? అంటే అదీ లేదు. రాష్ట్రంలో కొత్తగా నగరాలేమైనా అభివృద్ధి చెందాయా.? అంటే అదీ లేదు. సంక్షేమ పథకాల పేరుతో విచ్చలవిడిగా జనానికి డబ్బులు పంచిపెడుతోంది జగన్ సర్కార్. ఆ డబ్బుల్ని తిరిగి రాబట్టేసుకోవడానికి ఎడాపెడా ‘పన్నులు’ పెంచేసుకుంటూ పోతోంది. ఇదీ రాష్ట్రంలో పాలన.

పొరుగు రాష్ట్రాలతో పోల్చితే, రాష్ట్రంలో మద్యం ధరలు ఎక్కువ, పెట్రో ధరలూ ఎక్కువే. అలా ఆదాయాన్ని పెంచుకుంటూపోతున్న రాష్ట్రం, అప్పుల్ని అంతకు మించి పెంచేస్తోంది. ఇంతకీ, ఈ డబ్బు అంతా ఏమైపోతోంది.? ఇదే ప్రస్తుతం మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిపోయింది. పంచాయితీ ఎన్నికల వేళ 40 లక్షల నుంచి కోటి రూపాయలదాకా ఖర్చు చేసింది అధికార పార్టీ.. అనే విమర్శలున్నాయి. మునిసిపల్ ఎన్నికల వేళ కూడా కోటి రూపాయలదాకా ‘ధర’ పలుకుతోంది అభ్యర్థుల్ని ‘ప్రలోభాలకు గురిచేయడం’ కోసం. ఇక, ఓటర్ల కోసం వెచ్చించే సొమ్ములు.. అది మరో మేటర్. ఇంతలా రాష్ట్రం అభివృద్ధి చెందడం మాత్రం న భూతో న భవిష్యతి.. అనాలేమో.

‘చంద్రబాబు అప్పులు చేసేస్తున్నారహో..’ అంటూ ప్రతిపక్షంలో వున్నప్పుడు విమర్శించిన వైసీపీ, తమ హయాంలో జరుగుతున్న అప్పుల గురించి మాత్రం పెదవి విప్పడంలేదు. ఏ రాయి అయితేనేం పళ్ళూడగొట్టుకోవడానికి.. అని జనం విస్తుపోవాల్సి వస్తోంది చంద్రబాబు, జగన్ పాలనల్ని బేరీజు వేసుకుని.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఎక్కువ చదివినవి

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ అనేక గాసిప్స్ వస్తూనే ఉన్నాయి. అనేక...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...