అంతర్జాతీయ స్థాయిలో ఆర్ఆర్ఆర్ సాధిస్తున్న విజయాలను చూసి భారతీయులంతా కలిసి సెలబ్రేట్ చేసుకోవాలని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు.
‘ఆర్ఆర్ఆర్ ఇప్పటికే ఎన్నో అవార్డులు గెలుచుకుంది. ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డునూ గెలుచుకుంది. ఇది చిన్న విషయం కాదు. రాజమౌళి సినిమాకు దక్కిన గుర్తింపు మాత్రమే కాదు.. భారతీయ సినిమాకు దక్కిన గుర్తింపు. అడుగు దూరంలో ఉన్న ఆస్కార్ అవార్డును కూడా ఆర్ఆర్ఆర్ దక్కించుకుంటుందనే నమ్మకం నాకుంది’.
‘భారతదేశం నుంచి ఓ సినిమా అంతర్జాతీయ వేదికపై నిలబడినందుకు మనమంతా గర్వించాలి. సినిమా ఏదైనా ఆస్కార్ నామినేషన్ దక్కించుకోవడమంటే ఆషామాషీ విషయం కాదు. భారతీయ సినిమాకు ఇదొక ప్రోత్సాహం. ఆర్ఆర్ఆర్ సాధిస్తున్న విజయాలు మనందరం ఆస్వాదించాలి’ అని అన్నారు.
ఆర్ఆర్ఆర్ లో నాటునాటు పాటకు ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కన విషయం తెలిసిందే. ఆస్కార్ లిస్టులో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కు నామినేట్ అయింది. మార్చి 13న ఆస్కార్ అవార్డుల వేడుక జరుగనుంది.
684759 719442Wonderful blog, Im going to spend more time reading about this subject 730608
85725 16125Does your blog have a contact page? Im having a tough time locating it but, Id like to send you an e-mail. Ive got some suggestions for your blog you may be interested in hearing. Either way, fantastic internet site and I appear forward to seeing it expand over time. 734610