యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి రూపొందిస్తున్న మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమాలో బాలీవుడ్ తారలతో పాటు హాలీవుడ్ తారలు కూడా నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన రామ్ చరణ్, ఎన్.టి.ఆర్ టీజర్లు ఇండియా వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.
ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ పోషిస్తున్న కొమరం భీమ్ పాత్రకి జోడీగా హాలీవుడ్ భామ ఒలీవ మోరిస్ నటిస్తుందని అందరికీ తెలిసిందే. వీరిద్దరికీ సంబందించిన షూటింగ్ కూడా పూర్తయ్యింది. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ కి జోడీగా మరో హీరోయిన్ కి అవకాశం ఉంది. ఎన్.టి.ఆర్ ని ఇష్టపడే గిరిజన అమ్మాయిగా ఓ పాత్ర ఉంది. ఈ పాత్ర చాలా చిన్నదే అయినప్పటికీ కథకి ఎంతో కీలకం కావడంతో ఓ టాలెంటెడ్ హీరోయిన్ ని ఎన్నుకున్నారని సమాచారం. తనెవరో కాదు ఇప్పటికే తమిళంలో స్టార్ హీరోయిన్ అనిపించుకుని ఇప్పుడిప్పుడే తెలుగులో వరుస సినిమాలు దక్కించుకుంటున్న భామ ఐశ్వర్య రాజేష్.
తను అయితే పాత్రకి పర్ఫెక్ట్ గా సరిపోతుందని, నటన విషయంలోనూ సినిమాకి బాగా హెల్ప్ అవుతుందని ఆమెని ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నారని సమాచారం. దీంతో ఈ సినిమాకి మరో స్టార్ యాక్టర్ బ్రాండ్ కూడా దొరికినట్టే. ఐశ్వర్య రాజేష్ ప్రస్తుతం నాని టక్ జగదీశ్, సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్ సినిమాల్లో నటిస్తోంది.
241180 570233You created some decent points there. I looked online for that difficulty and discovered most people goes coupled with with all your web site. 49464
373777 540041Glad to be one of several visitants on this awful internet site : D. 478560
855562 505850I adore foregathering valuable info, this post has got me even much more info! . 790855