Switch to English

ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ: బాలకృష్ణ, వెంకటేష్ గార్లతో పనిచేయడం చాలా సంతోషంగా ఉంది- పూర్ణ

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిన పూర్ణ, రీసెంట్ గా రాజ్ తరుణ్ నటించిన పవర్ ప్లేలో ఆసక్తికర పాత్ర పోషించింది. ఈ సినిమాలో ఆమె పాత్రకు మంచి గుర్తింపు వస్తోంది. ఈ నేపథ్యంలో పూర్ణ గారితో ఇంటర్వ్యూ చేసే అవకాశం లభించింది. ఆమెతో సరదా సరదాగా సాగిన సంభాషణ మీకోసం…

హలో పూర్ణ గారు! ఎలా ఉన్నారు?

హలో అండీ! బాగున్నాను.

మీరు చేస్తున్న సినిమాల గురించి మాకు చెప్తారా?

నేను ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ గారి సినిమాలో నటిస్తున్నాను. బోయపాటి శ్రీను గారు దర్శకుడు. ఈ ప్రాజెక్ట్ గురించి చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను. సుందరి అనే ప్రాజెక్ట్ ను పూర్తి చేశాను. అలాగే వెంకటేష్ గారి దృశ్యం 2లో చిన్న పాత్రలో కనిపించనున్నాను. ఇవి కాకుండా మిగిలిన భాషల్లో పలు ప్రాజెక్ట్స్ ఉన్నాయి.

బాలకృష్ణ గారితో సినిమా గురించి కొంచెం ఏమైనా లీక్ చేస్తారా?

సడెన్ గా ఒకరోజు నాకు ఈ సినిమా ఆఫర్ గురించి కాల్ వచ్చింది. వెంటనే నమ్మలేకపోయా. ఇందులో చాలా మంచి పాత్ర చేస్తున్నాను. సినిమా రిలీజ్ కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా. నాకు పేరు తీసుకొచ్చే సినిమా అవుతుంది.

మీరు నటించిన పవర్ ప్లే ఇప్పుడు థియేటర్స్ లో ఉంది. ఈ సినిమా గురించి చెప్పండి

విజయ్ కుమార్ కొండా గారు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాజ్ తరుణ్ హీరోగా నటించారు. నా కెరీర్ లో తొలిసారి నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రను పోషించాను. మొదట ఈ రోల్ చేస్తున్నప్పుడు ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారా అని భయపడ్డాను కానీ ఇప్పుడు నా పాత్రకు, పెర్ఫార్మన్స్ కు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది.

మరి భవిష్యత్తులో కూడా నెగటివ్ రోల్స్ లో నటించడం మీకు ఇష్టమేనా?

తప్పకుండా. నెగటివ్ రోల్ అనే కాదు, నా వరకూ ఎలాంటి పాత్ర చేయడానికైనా నేను రెడీగా ఉన్నాను. అయితే కథ, నా పాత్ర మలిచిన తీరు చాలా ముఖ్యం. అలాగే నా పాత్రకు సినిమాలో మంచి స్కోప్ ఉండాలి. ప్రస్తుతం ఫీమేల్ ఓరియెంటెడ్ స్క్రిప్ట్స్ లో కూడా నటిస్తున్నాను.

పవర్ ప్లేలో మీరు ఎవరితో నటించడాన్ని బాగా ఎంజాయ్ చేసారు?

పవర్ ప్లేలో హీరో రాజ్ తరుణ్ తో కానీ హీరోయిన్ తో కానీ నాకు ఎలాంటి సీన్స్ లేవు. ఈ సినిమాలో నాకు ఎక్కువగా అజయ్ తో సన్నివేశాలు ఉన్నాయి. ఆయన చాలా మంచి నటుడు. అయితే ఈ సినిమా వరకూ మాత్రం దర్శకుడే నా ఫెవరెట్ కో-స్టార్.

విజయ్ గారితో మరో సినిమా చేయడానికి మీరు సిద్ధమేనా?

మరోసారి విజయ్ కుమార్ కొండా గారితో వర్క్ చేయడాన్ని తప్పకుండా ఆస్వాదిస్తాను. ఆయన చాలా కామ్ అండ్ స్వీట్ పర్సన్. సెట్స్ లో అందరినీ బాగా చూసుకుంటారు.

పవర్ ప్లే సినిమాకు మీరు అందుకున్న బెస్ట్ కంప్లిమెంట్ ఏంటి?

నా స్నేహితులకు ఈ సినిమాలో నా రోల్ బాగా నచ్చింది. ఈ సినిమాలో నా పాత్ర నిజ జీవితానికి దగ్గరగా ఉంది అంటూ నన్ను ఆటపట్టిస్తున్నారు. నా దృష్టిలో వారిదే బెస్ట్ కంప్లిమెంట్.

ఈ సినిమాలో నెగటివ్ రోల్ చేసేటప్పుడు ఎవరినైనా ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారా?

రమ్య కృష్ణ మేడమ్ నా బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్. ఈ సినిమా ఒప్పుకున్నప్పుడు రమ్య కృష్ణ గారి నీలాంబరి పాత్రను స్ఫూర్తిగా తీసుకున్నాను. పవర్ ప్లే చేస్తున్నన్ని రోజులు రమ్య కృష్ణ మేడమ్ నా మైండ్ లోనే ఉన్నారు.

పవర్ ప్లే సినిమా చూడటానికి మెయిన్ ప్లస్ పాయింట్స్ ఏంటి?

ఇది ఒక థ్రిల్లర్ మూవీ. విజువల్స్, సౌండ్ ఎఫెక్ట్స్, నరేషన్ ఈ సినిమాలో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్. థియేటర్ లోనే కచ్చితంగా ఎంజాయ్ చేసే సినిమా పవర్ ప్లే.

మీరు తెలుగులో చేసిన పాత్రల్లోకి మీ బెస్ట్ రోల్ ఏంటి?

కచ్చితంగా అవును చిత్రం. ఈ సినిమా నాకు ఒక ఛాలెంజ్ లాంటిది. ఇందులో నేను భయపడుతూ ప్రేక్షకులను భయపెట్టాలి. అయితే అక్కడ భయపడటానికి ఏం ఉండదు. నేనే ఏదో ఊహించుకుని భయపడాలి. దీన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకుని కష్టపడ్డాను.

టాలీవుడ్ లో మీ ఫెవరెట్ దర్శకుడు ఎవరు?

నేను ఇప్పటిదాకా పనిచేసిన దర్శకులు అందరికీ వారి వారి స్టైల్ ఉంది. వీరందరూ నా ఫెవరెట్. అవకాశం వస్తే అందరితో మళ్ళీ పనిచేయాలని ఉంది.

ఏ దర్శకుడు, నటుడుతో పనిచేయాలని మీ కోరిక?

నేను బాగా చేయగలను అని నమ్మి, నాకు అవకాశం ఇచ్చే ఏ దర్శకుడితోనైనా పనిచేయడం నాకు ఇష్టమే. వీరితో పనిచేయాలని ఉంది అని పాయింట్ అవుట్ చేయలేను. ఇక హీరోలలో ఎన్టీఆర్ గారితో, అల్లు అర్జున్ గారితో పనిచేయాలని ఉంది. వారితో కలిసి ఏదో ఒకరోజు డ్యాన్స్ చేయగలను అనే అనుకుంటున్నాను.

మీరు చాలా మంచి డ్యాన్సర్. మీ నుండి డ్యాన్స్ ఓరియెంటెడ్ ఫిల్మ్ ను ఊహించవచ్చా?

నేను ఎప్పటినుండో డ్యాన్స్ ఓరియెంటెడ్ సినిమా చేయాలని అనుకుంటున్నాను. అయితే దానికి తగ్గ కథ, దర్శకుడు వచ్చినప్పుడు కచ్చితంగా డ్యాన్స్ ఓరియెంటెడ్ స్క్రిప్ట్ చేస్తాను.

చివరిగా మీ ఫ్యాన్స్ కు మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా?

నా ఫ్యాన్స్ అందరికీ పెద్ద థాంక్స్. ఇన్నేళ్ల నుండి నేను ఇండస్ట్రీలో విజయవంతంగా కొనసాగగలుగుతున్నా అంటే అది కచ్చితంగా వారి వల్లనే. వారి ప్రేమ, అభిమానులు ఎప్పుడూ నాపైన అలానే ఉండాలని కోరుకుంటున్నా.

ఆ విధంగా పూర్ణగారికి ఆల్ ది బెస్ట్ చెబుతూ మా ఇంటర్వ్యూ ముగిసింది.

ఇంటర్వ్యూ బై

రసజ్ఞ అదితి

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...