Switch to English

అర్భక రాధాకృష్ణ.. అర్థం పర్థం లేని వివరణ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,432FansLike
57,764FollowersFollow

ఇంతకీ క్షమాపణ చెప్పాడా.? వివరణ ఇచ్చాడా.? సీనియర్ జర్నలిస్టు వేమూరి రాధాకృష్ణ, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి అధినేత హోదాలో, ఇంకోసారి ‘చెత్త పలుకు’ పలికాడు.! ఎవరో ఏదో అనుకుంటున్నారట.. అది తెలుసుకుని కథలల్లుతాడట. పైగా, అది నిజమని జనం నమ్మాలట.!

కాపు సామాజిక వర్గానికి చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల దగ్గర, పవన్ కళ్యాణ్‌కి సంబంధించిన రాజకీయ అంశాల గురించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ ప్రస్తావించారట. అది వేమూరి రాధాకృష్ణ అనే సీనియర్ జర్నలిస్టు చెవిన పడిందట.! ఇలాంటి ‘అట’లు అన్నీ పోగేసి, ‘కొత్త పలుకు’ అని పేరు పెడితే, దాన్ని జర్నలిజం అని జనం ఒప్పుకోవాలట.!

పవన్ కళ్యాణ్‌కి వెయ్యి కోట్ల ప్యాకేజీ ఇవ్వాలన్నది కేసీయార్ వ్యూహమట. అలాగని ‘చెత్త పలుకులు’ రాధాకృష్ణ పలుకుతాడట. ఈ క్రమంలో ఆయన తనను తాను ‘అర్భకుడ్ని ఏమీ కాదు’ అని సర్టిఫికెట్ ఇచ్చుకుంటాడట. నవ్విపోదురుగాక.. ఆయనకేటి సిగ్గు.? అన్నట్టు తయారైంది పరిస్థితి.

మీడియా అంటే వాస్తవాల్ని కదా జనం ముందుంచాల్సింది.? ‘అట’లు అన్నీ పోగేస్తే, అది జర్నలిజం ఎలా అవుతుందో సీనియర్ జర్నలిస్టు వేమూరి రాధాకృష్ణకే తెలియాలి. పవన్ కళ్యాణ్ అభిమానులకి కోపమొచ్చిందట, ‘వెయ్యి కోట్ల ప్యాకేజీ’ రాతలతో. కేసీయార్ వ్యూహాల్లో ‘ప్యాకేజీ’ అంశం వుంటే, ముందుగా ఆ ప్యాకేజీని పాత మిత్రుడు చంద్రబాబుకి కదా ఆయన ఇస్తారు.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు, శాశ్వత మిత్రులు ఎవరూ వుండరు. గతంలో టీడీపీ – టీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నాయ్. ఆ లెక్కన కేసీయార్ – చంద్రబాబు ఇంకోసారి మిత్రులైపోయి, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పే అవకాశం వుండొచ్చు కదా.? అబ్బే, ఇలాంటి ఆలోచనలు ‘అర్భక’ రాధాకృష్ణకి రావు మరి.!

కుల జాడ్యం లేదు.. రాజకీయ జాడ్యం లేదు.. వేమూరి రాధాకృష్ణకి. అలాగని ఆయన చెబితే అంతా నమ్మేయాలి. ‘గాడ్ ఫాదర్’ సినిమా మీద పైత్యం, ‘ప్రజారాజ్యం పార్టీ’ మీద పైత్యం.. ఇప్పుడేమో జన సేన పార్టీ మీద కూడా అంతకు మించిన ఏడుపు. అయినా, వేమూరి రాధాకృష్ణవి అర్భక రాతలు కావు.!

కర్నాటక తరహాలో పవన్ కళ్యాణ్‌ని కుమారస్వామిగా మార్చేయాలన్నది కేసీయార్ వ్యూహమో కాదో తెలియదుగానీ.. అలా ప్రస్తావించి, జనసేన పార్టీని చంపెయ్యాలన్నది ఆర్కే ‘చెత్త పలుకు’లోని తాజా కోణం.!

పవన్ కళ్యాణ్ ఎప్పుడూ గెలుపోటముల గురించి ఆలోచించలేదు. సినిమాల్లో అయినా, రాజకీయాల్లో అయినా.! ప్రజల్లో మార్పు కోసం జనసేన పార్టీని స్థాపించారు పవన్ కళ్యాణ్. మార్పు కోసం పోరాడుతూనే వుంటానని చెబుతున్నారాయన. అర్భక రాధాకృష్ణ ఈ ప్యాకేజీ రాతలు మానేస్తే మంచిది.!

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

ఎక్కువ చదివినవి

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి ని తెలుగు లో 'సత్య' గా...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన మంచు...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి ఆ ఫొటో ఆమె పోస్ట్ చేయలేదని...