కరోనా వల్ల వచ్చిన లాక్ డౌన్ టైమ్ ను చక్కగా యుటిలైజ్ చేసుకుంటున్నారో మాజీ మంత్రివర్యులు. రాజకీయంగా మరింత ఎదిగేందుకు రాజకీయం నేర్చుకోవడం మానేసి స్టూడెంట్ అయిపోయారట. స్టూడెంట్ అంటే కాలేజీబుల్లోడు లా కాదండోయ్.. ఎప్పుడూ మాట్లాడే రాయలసీమ యాస నుంచి ఇంట్లోనే ఉంటూ హిందీ, ఇంగ్లీషు నేర్చుకునేంతగా.. అంతే. ఇంతకీ ఆయన ఎవరనేగా.. గత టీడీపీ హయాంలో మంత్రిగా పని చేసి ప్రస్తుతం బీజేపీ నాయకుడిగా ఉన్న ‘ఆదినారాయణ రెడ్డి’ ఆ స్టూడెంట్.
2019లో టీడీపీ, ఆయన ఓటమి అనంతరం బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. బీజేపీ జాతీయపార్టీ కావడంతో నాయకులందరూ హిందీ, ఇంగ్లీషులోనే మాట్లాడతారు. ఇప్పుడిదే సమస్యగా మారింది ఆదినారాయణ రెడ్డికి. ఇన్నాళ్లూ కడప యాసలో చక్కగా పలకరించే ఆయన.. ఇప్పుడు ఆయన్ను పలకరించేవారందరూ హిందీ, ఇంగ్లీషుల్లో మాట్లాడేసరికి ఇబ్బంది పడుతున్నారట. అనుకుందే తడవుగా ఇంగ్లీష్, హిందీలప పట్టు పెంచుకునేందుకు సిద్ధమయ్యారు. ప్రొద్దుటూరు నుంచి ఇద్దరు ట్యూటర్లను పెట్టుకుని ఇంగ్లీష్, హిందీ నేర్చుకుంటున్నారట.
అయితే.. ఎంత క్లాసుల్లో నేర్చుకుంటే మాత్రం రెగ్యులర్ గా మాట్లాడకపోతే భాషపై పట్టు రాదని చెప్పారట. దీంతో కొంతమంది తెలిసినవారికి ఫోన్లు చేసి మరీ ఇంగ్లీషు, హిందీలో మాట్లాడుతున్నారట. ‘హలో దిస్ ఈజ్ ఆదినారాయణ రెడ్డి.. హౌ ఆర్ యూ.. హలో మై ఆదినారాయణరెడ్డి హూ.. ఆప్ కైసే హై…’ అంటూ మాట్లాడి భాషపై పట్టు తెచ్చుకుంటున్నారట. రోజూ రాయలసీమ యాసలో మాట్లాడుతూ పలకరించే తమ అయ్యోరు ఇప్పుడు ఇలా హిందీ, ఇంగ్లీషలోకి మారిపోవటంపై అనేక ఛలోక్తులు పడుతున్నాయట.
జమ్మలమడుగు నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆదినారాయణ రెడ్డి ఎమ్మెస్సీ చదివి కొన్నాళ్లు లెక్చరర్ గా పని చేసారు. ఆయనకు ఇంగ్లీష్ పెద్ద సమస్య కాకపోయినా హిందీపై మాత్రం పట్టు రావాల్సిందే. పైగా నార్త్ ఇండియన్స్ అనర్గళంగా మాట్లాడతారాయే. ఇన్నాళ్లూ రఫ్ గా రాయలసీమ యాసను తెలుగులో మాట్లాడేసిన ఆదినారాయణ రెడ్డికి ఇది పరీక్షా సమయంగా మారిందన్న మాట.
754596 120845I like the way you conduct your posts. Have a good Thursday! 292155
652355 695703After study some of the websites along with your internet web site now, i really as if your way of blogging. I bookmarked it to my bookmark web site list and will be checking back soon. Pls appear at my web site likewise and figure out what you believe. 329466
469076 160837Fantastic internet site, determined several something completely new! Subscribed RSS for later, aspire to see far more updates exactly like it. 434977
940937 106607We guarantee authentic brands avoiding inferior commercial imitations, or even dangerous counterfeits. 390534
162109 909446woah i like yur website. It genuinely helped me with the info i wus looking for. Appcriciate it, will bookmark. 265219
926698 966871Dead written topic matter, Genuinely enjoyed reading by way of . 108461