తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాల నోటిఫికేషన్ విషయంలో చూపిస్తున్న అలసత్వంపై అసహనం వ్యక్తం చేస్తూ నల్లగొండ జిల్లా మిర్యాలగూడెంకు చెందిన సంపత్ అనే యువకుడు ఆత్మహత్యకు యత్నించాడు. గత ఏడాది కాలంగా గ్రూప్ నోటిఫికేషన్ ఎదురు చూస్తూ చదువుతున్న సంపత్ ఇక నోటిఫికేషన్ రాదేమో అన్న ఆందోళన మరియు ఆవేదనతో ఆత్మహత్యకు యత్నించాడు. విషం తాగడానికి ముందు వీడియో రికార్డ్ చేశాడు. ఈ సందర్బంగా అతడు మాట్లాడుతూ ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలంటూ కోరాడు.
కోటి ఆశలతో తెలంగాణ తెచ్చుకున్నాం. ఉద్యోగాలు వస్తాయని ఎంతో ఆశ పడ్డాం. ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో తెలియడం లేదు. కేసీఆర్ సార్ ఇన్ టైంలో నోటిఫికేషన్ ఇవ్వండి. చదివి చదివి మైండ్ అంతా పోతుంది. ఏం చేయాలో అర్థం కాక ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లుగా పేర్కొన్నాడు. ఓయూలో పీజీ పూర్తి చేసిన సంపత్ గత ఏడాది నుండి హైదరాబాద్ లో ఒక శిక్షణ కేంద్రంలో గ్రూప్స్ కు కోచింగ్ తీసుకుంటున్నాడు. తండ్రి కష్టపడుతూ ఉండగా ఇంకా చదువుతూ ఉండటం ఇష్టం లేక చివరకు ఇలా ఆత్మహత్యకు ప్రయత్నించాడు.
584464 142573Gems form the internet […]very few websites that happen to be detailed below, from our point of view are undoubtedly properly worth checking out[…] 707262
309118 691530I discovered your weblog site on google and check some of your early posts. Continue to maintain up the quite good operate. I just additional up your RSS feed to my MSN News Reader. Seeking forward to reading much more from you later on! 835054
609409 963054The leading source for trustworthy and timely health and medical news and info. 106303