Switch to English

ఇంత నీఛమా.? భార్యా, పిల్లల్ని బదనాం చేసుకుంటావా పోసానీ.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

పవన్ కళ్యాణ్ అభిమానుల పేరుతో ఎవరో పోసాని కృష్ణమురళిని తిట్టారట. సో, పవన్ కళ్యాణ్ స్వయంగా పోసాని కృష్ణమురళి కుటుంబ సభ్యుల్ని దూషించినట్లేనట. అదే నిజమైతే, వైఎస్ జగన్ అభిమానిగా పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యుల మీద పోసాని కృష్ణమురళి దూషణలకు దిగినప్పుడు.. వాటిని వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆపాదించవచ్చా.?

అప్పుడు చిరంజీవి, ఇప్పుడు పవన్ కళ్యాణ్. ఏం మారలేదు. అదే రాజకీయం. చిరంజీవి, ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన సమయంలో ఎలాగైతే, చిరంజీవి మీద అత్యంత జుగుప్సాకరమైన రీతిలో.. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా దిక్కుమాలిన రాజకీయాలు చేశారో.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ విషయంలో అంతకు మించిన దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్నారు.

పోసాని కృష్ణమురళి నోరు తెరిస్తే ఛండాలం. అది అందరికీ తెలిసిన విషయమే. ఆ ఛండాలాన్ని ఈ రోజు మీడియా ప్రతినిథులు కూడా భరించలేకపోయారు. ఓ జర్నలిస్టు, పోసాని నోటి ఛండాలాన్ని తట్టుకోలేక ప్రశ్నిస్తే, పోసాని విరుచుకుపడిపోయారు. ఏ భార్య అయినా, ఏ కూతురు అయినా సహించలేని మాటల్ని పోసాని కృష్ణమురళి చాలా గర్వంగా వల్లించేశారు.

అసలు పోసాని కృష్ణమురళి వెనకాల అతన్ని ప్రోత్సహిస్తున్నదెవరు.? ఆయన్ని ఉసిగొల్పుతున్నదెవరు.? ‘మా’ ఎన్నికల రాజకీయమా.? లేదంటే, పవన్ కళ్యాణ్ మీద కుట్ర పన్నుతోన్న బులుగు – పసుపు రాజకీయమా.? చిరంజీవి మీద కాంగ్రెస్, టీడీపీ ఇదే స్థాయి దాడి చేశాయి. అదే కాంబినేషన్.. చిన్న మార్పుతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ కలిసి పవన్ కళ్యాణ్ మీద దాడి చేస్తున్నాయన్నమాట.

పవన్ కళ్యాణ్ అభిమానులు నన్ను ఏదేదో చేసేస్తామంటున్నారంటూ.. తమ స్క్రిప్టులోని తదుపరి అంశాల గురించి పోసాని బాగానే లీకులిచ్చేశారు. కానీ, పోసాని ఆశించినట్లు.. ఆయన మీద ఎవరూ దాడికి వెళ్ళలేదు. ఎందుకంటే, ‘గ్రామ సింహాన్ని కొట్టినా, పోసాని కృష్ణమురళిని కొట్టినా ఒకటే..’ అన్న భావనతోనే.. అనే అభిప్రాయం పవన్ అభిమానుల నుంచి వ్యక్తమవుతోంది. ‘నేను వైసీపీ కార్యకర్తని..’ అని చెప్పుకుని మరీ పోసాని కృష్ణమురళి, మీడియా సాక్షిగా బూతులు మాట్లాడాడంటే, ఇలా బూతులు మాట్లాడేవాళ్ళని ఎవరు ప్రోత్సహించి పంపుతున్నారన్నది సుస్పష్టం.

దేనికోసం ఇదంతా.? పోసాని కృష్ణమురళి తెలుసుకోవాల్సిందేంటంటే.. ఎవరి కోసం ఆయన ఈ పని చేస్తున్నా.. పోసాని బదనాం చేసుకుంటున్నది తన సొంత కుటుంబాన్ని మాత్రమే. చిరంజీవి మీద ఇలాగే చాలామంది మొరిగారు.. అలా మొరిగినోళ్ళంతా చిరంజీవి ‘అందరివాడు’ అంటున్నారు. ఆ విషయం పోసాని, పోసానిని ఉసిగొల్పినోళ్ళు తెలుసుకుంటే మంచిదేమో.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

రాజకీయం

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

ఎక్కువ చదివినవి

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree). కమలేష్ కుమార్ నిర్మాత. మే24న విడుదలవుతోన్న...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...