అక్టోబర్ లో ప్రారంభం కాబోతున్న టీ20 వరల్డ్ కప్ కోసం ఇప్పటికే బీసీసీఐ 15 మంది సభ్యులతో టీమ్ ను ప్రకటించిన విషయం తెల్సిందే. ఐపీఎల్ లో ప్రదర్శణ ఆధారంగా ఆ 15 మంది సభ్యుల నుండి నలుగురిని తొలగించే విషయమై చర్చలు జరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది. గత సీజన్ లో మంచి ప్రతిభ కనబర్చిన ఇషాన్ కిషన్ మరియు సూర్య కుమార్ యాదవ్ లు ఈ సీజన్ లో అట్టర్ ప్లాప్ అయ్యారు. వీరితో పాటు రాహుల్ చాహర్ మరియు హార్దిక్ పాండ్యా కూడా ఫామ్ లేక సతమతం అవుతున్నారు.
ఇప్పటికే ఎంపిక అయిన ఈ నలుగురు ఆటగాళ్ల స్థానంలో కొత్త వారిని తీసుకోవాలనే విషయమై చర్చలు జరుగుతున్నాయి. అతి పెద్ద టోర్నీ కనుక టీ20 ప్రపంచ కప్ కోసం అత్యుత్తమ జట్టును ఎంపిక చేయాలని బీసీసీఐ ప్రయత్నాలు చేస్తోంది. జట్టు కెప్టెన్ మరియు సెలక్టర్ లు మరోసారి చర్చించి నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. కొత్తగా వచ్చే వారికి అవకాశాలు ఇవ్వడం వల్ల పరిస్థితి ఎలా ఉంటుంది అనే విషయమై కూడా చర్చలు జరుగుతున్నాయి. వరల్డ్ కప్ ప్రారంభంకు ఇంకా సమయం ఉంది కనుక అప్పటి వరకు ఏమైనా జరుగవచ్చు అంటున్నారు.