Switch to English

బిగ్ బాస్ తెలుగు-5 : పొట్టి పిల్ల సిరి కెప్టెన్‌- ఎపిసోడ్-5

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

పవర్ రూమ్‌ టాస్క్‌ తాజా ఎపిసోడ్‌ లో ముగిసింది. ఆ రూమ్‌ లోకి వెళ్లిన విశ్వ, మానస్, హమీద మరియు సిరిలు వెళ్లారు. చివరిగా వెళ్లిన హమీద ఒక కంటెస్టెంట్‌ కెప్టెన్సీ పవర్‌ ను పూర్తిగా లాగేసుకోవడం జరిగింది. ప్రియ ఈ సీజన్ మొత్తంలో కెప్టెన్‌ గా అవ్వలేరు. అందుకు ప్రియ కూడా అంగీకారం తెలియజేశారు. ఓకే ఎవరినో ఒకరిని ఎంపిక చేయాలి కదా అనుకుంటూ సర్ది చెప్పేసుకుంది. పవర్ రూమ్‌ లోకి వెళ్లిన నలుగురికి కెప్టెన్సీ టాస్క్‌ ను ఇవ్వడం జరిగింది. కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా కంటెస్టెంట్స్ నలుగురు గార్డెన్ ఏరియాలో ఉన్న సైకిల్స్ ను కంటిన్యూస్ గా తొక్కుతూ ఉండాలి. సైకిల్‌ రన్‌ అవుతున్నా కొద్ది లైట్లు వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే సైకిల్‌ తొక్కడ ఆగిపోతుందో వెంటనే లైట్లు ఆఫ్ అవుతాయి. తమ లైట్లను ఆఫ్‌ కాకుండా చూసుకుంటూ సైకిల్‌ తొక్కుతూ నలుగురు కంటెస్టెంట్స్‌ ఎక్కువ సమయం ఉండాల్సి ఉంటుంది. కొద్ది సమయం సైకిల్‌ తొక్కిన తర్వాత అడ్డుకోవడం చేయవచ్చు. కాని కొందరు మాత్రం సైకిల్‌ తొక్కడం ప్రారంభించిన వెంటనే అడ్డుకునే ప్రయత్నం చేశారు.

ముఖ్యంగా ఆర్జే కాజల్ విశ్వ మరియు మానస్ ను అడ్డుకునేందుకు ప్రయత్నించింది. ఆమె అడ్డుకునేందుకు ప్రయత్నించగా వెంటనే సరయు కూడా స్పందించి విశ్వకు మద్దతు తెలిపింది. అలా ఇద్దరి మద్య చిన్న పాటి గొడవ కూడా జరిగింది. కాజల్ తన ప్రయత్నంలో సక్సెస్ అయ్యింది. ఆయిల్‌ పోసి విశ్వ సైకిల్‌ ఆగిపోయేలా చేసింది. ఆ తర్వాత మానస్ కూడా తన ప్రయత్నంను అడ్డుకోవడంతో ఆపేశాడు. చివరకు అమ్మాయిలు ఉండగా హమీదా కూడా ఆపేసింది. దాంతో సిరి హనుమంతు విజయం సొంతం చేసుకుంది. అనూహ్యంగా సిరికి దక్కిన విజయంతో ఆమె ఆనందంతో ఎగిరి గంతేసింది. తనకు వచ్చిన అవకాశంను సద్వినియోగం చేసుకుంటాను అంది.

సంచాలక్ గా వ్యవహరించిన ప్రియ గారు సిరికి కెప్టెన్సీ బ్యాండ్‌ పెట్టి అభినందించింది. ఆ తర్వాత ఇంటి సభ్యులు అందరితో కూర్చుని రేషన్ మేనేజర్ గా విశ్వకు అవకాశం ఇచ్చింది. మొత్తానికి సిరి సీజన్ 5 కి మొదటి కెప్టెన్‌ గా నిలిచింది. ఆమె చాలా స్ట్రాంగ్ అమ్మాయి అంటూ ఈ కెప్టెన్సీ టాస్క్‌ తో తేలిపోయింది. ఆమె ముందు ముందు కూడా తప్పకుండా మంచి ఫర్ఫార్మెన్స్ ను కూడా ఇస్తుందని దీంతో తేలిపోయింది. చాలా చిల్ పర్సన్‌ కనుక కెప్టెన్సీ ని కూడా చాలా చిల్ గానే చేస్తుందని.. అందరిని ఆకట్టుకునే విధంగా ఆమె కెప్టెన్సీలో ఇంటి సభ్యులు ఉంటారు అంటూ అంతా భావిస్తున్నారు. అందరికి సన్నిహితురాలు గొడవలు లేని అమ్మాయిగా సిరికి పేరుంది. కనుక ఆమె కెప్టెన్సీలో ఇల్లు అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది అనేది చాలా మంది నమ్మకం. ఇక బిగ్ బాస్ సీజన్‌ 5 మొదటి కెప్టెన్సీ టాస్క్ రెండు దశల్లో జరిగింది. రెండు దశల్లో కూడా ప్రతిభ చూపిన వారు సిరి కాకుండా విశ్వ మరియు హమీద. ఇద్దరు కూడా చాలా కష్టపడ్డారు. ఫిజికల్‌ టాస్క్ ల్లో వారు ముందు ముందు ఖచ్చితంగా ప్రభావం చూపిస్తారు అనిపిస్తుంది.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

రాజకీయం

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఎక్కువ చదివినవి

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...