Switch to English

‘చట్ట’ సభ తీరుపై జస్టిస్ ఎన్వీ రమణ ఆక్షేపణ

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

పాలకులు చేసే చట్టాలు సరిగ్గా అమలు చేయడం న్యాయస్థానాల విధి. చట్టాలు మాత్రమే కాదు, రాజ్యాంగం ప్రకారమే పాలన నడుస్తోందా.? లేదా.? అనేది చూడాల్సింది కూడా న్యాయ వ్యవస్థే. న్యాయ వ్యవస్థ ఆదేశాల్ని పాటించాల్సింది, అమలు చేయాల్సింది మళ్ళీ ప్రభుత్వమే. న్యాయ వ్యవస్థ మితి మీరిన జోక్యం ప్రదర్శించకూడదంటూ ప్రభుత్వ పెద్దలు అడపా దడపా గుస్సా అవుతుంటారు. ఇటీవలి కాలంలో అది తరచూ వినిపిస్తోంది. ‘అంతా మా ఇష్టం. మేం చట్టం చేస్తే, అది అమలయి తీరాల్సిందే. మేం విధానపరమైన నిర్ణయం తీస్తే, దాన్ని కోర్టులు సైతం ప్రశ్నించజాలవు..’ అంటున్నారు పాలకులు. ఇది నిజంగానే ఓ వైపరీత్యం.

ఇక, అసలు విషయంలోకి వస్తే, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, గత కొంతకాలంగా రూపొందుతోన్న చట్టాల్లోని లోపాల పట్ల సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఒకప్పుడు చట్టాలు చేసేటప్పుడు, చట్ట సభల్లో జరగాల్సిన స్థాయిలో చర్చ జరిగేది. ఇప్పుడు పరిస్థితులు మారాయి. రకరకాల కారణాలతో సరైన చర్చ లేకుండానే చట్టాలు రూపొందుతున్నాయి. దాంతో, చాలా లోపాలు ఆ చట్టాల అమలులో ఎదురవుతున్నాయి. లిటిగేషన్లు పెరిగిపోతున్నాయి. న్యాయస్థానాలపై ఒత్తిడి పెరుగుతోంది..’ అని జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు.

దేశంలో కొత్త వ్యవసాయ చట్టాల చుట్టూ జరుగుతున్న రచ్చ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆ చట్టాల అమలుని కొంత కాలం పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ఒప్పుకోవాల్సి వచ్చిందంటే.. అధికారంలో వున్నోళ్ళు ఎంత అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. కక్ష సాధింపు చర్యల కోసమో, మొండితనంతోనో.. అధికారం తమ చేతుల్లో వుందన్న అహంకారంతోనో.. పాలకులు చేస్తోన్న చిత్ర విచిత్రమైన చట్టాల కారణంగా న్యాయస్థానాల్లో లిటిగేషన్లు పెరిగిపోతున్నమాట వాస్తవం.

చట్ట సభలకు ఎలాంటివారు వెళుతున్నారు.? అక్కడ ఎలాంటి చర్చలు జరుగుతున్నాయి.? అన్నదానిపై సామాన్యులు ఆత్మవిమర్శ చేసుకోవాలి. కరెన్సీ నోట్లతో ఓట్లను కొనుగోలు చేసేసి, అధికారంలోకి వచ్చేవాళ్ళ నుంచి ‘సరైన చట్టాలు’ వస్తాయని ఎలా అనుకోగలం.?

7 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...