Switch to English

జస్ట్ ఆస్కింగ్: 4 భాషలు తెలిస్తే ప్రధానమంత్రి అయిపోవచ్చా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

దేశంలో నాలుగు భాషలు తెలిసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రమేనట. అందుకే, ఆయన ప్రధాని అయ్యేందుకు అవకాశాలు ఎక్కువగా వున్నాయనీ, ఖచ్చితంగా వైఎస్ జగన్ ప్రధాని అవుతారనీ వైసీపీ నేతలు కొందరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తప్పేమీ లేదు.. దేశంలో ఎవరైనా ముఖ్యమంత్రి అవ్వొచ్చు.. ప్రధాన మంత్రీ అవ్వొచ్చు. కానీ, నాలుగు భాషలు తెలిసిన ముఖ్యమంత్రి.. అనేది ప్రధాన మంత్రి అవడానికి ఓ క్వాలిఫికేషన్ అవుతుందా.? అలాగని నమ్ముతున్నోళ్ళని అసలు రాజకీయ నాయకులనగలమా.? నవ్విపోదురుగాక మనకేటి సిగ్గు.? అన్నట్టు తయారైంది వ్యవహారం.

పీవీ నరసింహారావుకి చాలా భాషలు వచ్చు. ఆ మాటకొస్తే, చాలా మంది రాజకీయ నాయకులకు చాలా భాషలు వచ్చి వుంటాయి. మాతృభాషకి అదనంగా హిందీ, ఇంగ్లీషు భాషలు వచ్చిన రాజకీయ నాయకులు దేశంలో లెక్కలేనంతమంది వున్నారు. ముఖ్యమంత్రి పదవుల్లో వున్నవారికి మరికొన్ని అదనపు భాషలు తెలిసే అవకాశం వుంటుంది. ఆ మాటకొస్తే, దేశంలో వివిధ ప్రాంతాల్లో వ్యాపారాలు నిర్వహిస్తుంటారు గనుక.. అందుకు అనుగుణంగా ఎక్కువ భాషలు నేర్చుకునే రాజకీయ నాయకులు ఎంతోమంది వుంటారు. ఒక్క భాష కూడా రాకపోయినా, రాజకీయాల్లో రాణించొచ్చు.

ఫలానా భాష మాట్లాడితేనే రాజకీయాల్లో ఓ పదవి వస్తుందని ఎవరైనా భావిస్తే.. అంతకన్నా దారుణమైన విషయం ఇంకోటుండదు. ఎలాగైనా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టిలో పడాలన్న దుగ్దతో స్వామి భక్తిని కాస్త ఎక్కువ ప్రదర్శించే కొందరు నాయకులు.. ఇలా డబ్బా కొట్టడం మామూలే. అలాంటివాళ్ళని నిజానికి, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు ఎంటర్‌టైన్ చేసే పరిస్థితీ వుండదు. ‘ఇంత సిల్లీగా ఎలా మాట్లాడగలుగుతున్నారు.?’ అని ఆయా నేతలపై అధినేతలు గుస్సా అవడమే కాదు, వారి అమాయకత్వానికి చింతిస్తుంటారు కూడా.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ జగన్ చక్రం తిప్పుతున్నారు. తెలంగాణలో తన చెల్లెలు షర్మిల ద్వారా రాజకీయంగా పై చేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ లెక్కన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వైఎస్ జగన్ హవా ముందు ముందు వుండొచ్చుగాక. తన స్థాయిని పెంచుకుంటూ వెళితే వైఎస్ జగన్, ప్రధాన మంత్రి అవుతారేమో. కానీ, నాలుగు భాషలొస్తే ప్రధాని అవుతారనేంత నిల్ నాలెడ్జ్ నాయకుల్ని పార్టీలో ప్రోత్సహిస్తే మాత్రం.. వైఎస్ జగన్ తన స్థాయిని మరింత తగ్గించుకోవాల్సి వస్తుంది.

అన్నట్టు, వైఎస్ జగన్ మాట్లాడే తెలుగుకి ఎన్ని వంకర్లు వుంటున్నాయో చూస్తున్నాం. ప్రతిపక్ష నేతగా వున్నప్పుడెప్పుడూ ఆయన మాటల్లో పెద్దగా పొరపాట్లు రాలేదు. కానీ, ముఖ్యమంత్రి అయ్యాక.. ఎప్పుడు ఏది మాట్లాడినా ఓ మాట.. అంతకు మించిన మాటలు ఆయన్ని నవ్వులపాల్జేస్తున్నాయి.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

రాజకీయం

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

ఎక్కువ చదివినవి

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...