ప్రఖ్యాత డీమార్ట్ యజమాని రాధాకిషన్ దమాని 1,001 కోట్లతో ఇంటిని కొనుగోలు చేశారు. దక్షిణ ముంబైలోని అత్యంత సంపన్న ప్రాంతాల్లో ఒకటైన మలబార్ హిల్లో సోదరుడు గోపీకిషన్ దమానితో కలిసి కొనుగోలు చేశారు. ఇంటి విస్తీర్ణం 5,752.22 చదరపు అడుగులు. స్టాంప్ డ్యూటీ కోసమే దమాని మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖకు 30 కోట్లు చెల్లించారు. ఇంటి మార్కెట్ విలువ 724 కోట్ల రూపాయలుగా అంచాన వేస్తున్నారు.
సౌరభ్ మెహతా, వర్షా మెహతా, జయేశ షా వద్ద నుంచి దమాని ఈ ఇంటిని కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం దమాని ముంబైలోని ఆల్టమౌంట్ రోడ్లోని పృథ్వి అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు. హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2021 ప్రకారం.. రాధాకిషన్ దమాని 14.5 బిలియన్ డాలర్లతో భారతీయ సంపన్నుల జాబితాలో ఎనిమిదో స్థానంలో ఉన్నారు. డిమార్ట్ భారత్ లో అత్యంత ఆదరణ ఉన్న రిటైల్ మార్ట్ అనే విషయం తెలిసిందే.
67778 581392light bulbs are very good for lighting the home but stay away from incandescent lamps because they generate so a lot heat;; 400712
135703 84053I really delighted to find this internet website on bing, just what I was searching for : D too saved to fav. 28935