Switch to English

సారంగదరియా వివాదంకు కమ్ముల ఫుల్‌ స్టాప్‌

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య మరియు సాయి పల్లవి జంటగా రూపొందిన లవ్‌ స్టోరీ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. ఈ సినిమా లోని సారంగదరియా పాట సూపర్‌ డూపర్ హిట్ అవ్వడంతో పాటు చాలా పెద్ద వివాదంను మూట కట్టుకుంది. కోమలి అనే జానపద గాయకురాలు తన పాటను తనకు క్రెడిట్ ఇవ్వకుండా తనతో సంప్రదించకుండా పాడారు అంటూ ఆరోపిస్తూ మీడియా ముందుకు వచ్చింది. దాంతో శేఖర్‌ కమ్ముల మరియు ఇతర చిత్ర యూనిట్‌ సభ్యులపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

 

తాజాగా ఆ విషయమై దర్శకుడు క్లారిటీ ఇచ్చాడు. పాట అనౌన్స్ చేసిన తర్వాత ఆమెతో పాడించేందుకు ప్రయత్నించగా ఆమె జలుబుగా ఉందని చెప్పి పాడను అంది, క్రెడిట్ ఇస్తే చాలు అన్నట్లుగా అప్పుడు చెప్పారు. అందుకే మంగ్లీతో పాడించాము. ఇప్పుడు ఆమెకు సినిమా లో టైటిల్‌ కార్డు వేయడంతో పాటు కొంత మొత్తం డబ్బు ఇస్తామని శేఖర్ కమ్ముల అన్నాడు. ఇక ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఆమెతో పాట పాడించేందుకు కూడా శేఖర్‌ కమ్ముల ఒప్పుకుని మొత్తం వివాదానికి ఫుల్‌ స్టాప్‌ పెట్టేశాడు.

 

శేఖర్‌ కమ్ముల సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన ప్రెస్‌ నోట్‌ ఉన్నది ఉన్నట్లుగా…

చాలా ఏళ్ళ కిందట ‘రేలా రే రేలా’ ప్రోగ్రాంలో శిరిషా అనే అమ్మాయి ‘సారంగ దరియా’ అనే పాట పాడింది. ఆ పాట నాకు అలా గుర్తుండి పోయింది. ఆ పాట ఎంత నచ్చింది అంటే అంత నచ్చింది. ఈ ఫిల్మ్ visualise చేస్తున్నప్పుడల్లా ఈ పాట నా mind లో తిరుగుతూనే ఉంది.
నా first film ‘dollar dreams’ లో లక్కి అలి పాట ఉంటుంది. ఆ పాటని ఫిల్మ్ లో use చేసినందుకు SONY company కి నేను pay చేసా, ఫిల్మ్ లో credits కూడా ఇచ్చా. తర్వాత తీసిన ‘ఆనంద్’ లో లక్కి అలి తో పాడించుకున్నా కూడా. ఆనంద్ ఫిల్మ్ లో సుబ్బలక్స్మి గారి పాట నుండి ఫిదాలో మల్లీశ్వరి సినిమా లో ని అప్పగింతల పాట వరకు స్టొరీ రాస్తున్నప్పుడు నాకు ఒకో సినిమా కి ఒకో పాట తిరుగుతుంటుంది. love story ఫిల్మ్ కి నా మనసులో ఈ పాట ఉంది.
సుద్దాల గారిని కలిసాను. ఈ పాటని film కి అనుకూలంగా రాయాలి అంటే, ఈ పాట పల్లవి తీస్కొని, చరణాలు రాశారు. ఆ పాట కి అంత బాగా lyrics రాసినందుకు చాలా happy అయిపొయా.
మా టీం లో a.d ఒకరు sirisha ఫొన్ నంబెర్ సంపాదించి, ఆమెని contact చేశారు. ఆమెకి అప్పటికి delivery టైం అంటే, మేము ఇంక సరే అనుకున్నాం. కరొన వల్ల ఫిల్మ్ ఆగి, మళ్ళీ షూట్ start అయ్యింది. new born baby తో ఉన్న శిరిషని ఇబ్బంది పెట్టాలి అనిపించలేదు.
ఈ పాట ని నవంబర్లో షూట్ చేశాం. అది కూడా track singer పాడిన version తోనే. february ఆఖరులో మంగ్లి తో పాడించాం. promo రిలీజ్ అయ్యాక సుద్దాల గారు ఫోన్ చేశారు. ‘ఇద్దరు singers ఆ పాట మేమే పాడాలి అంటున్నరు అని’. ఇద్దరి నంబర్లు ఇచ్చారు. మా టీం లో a.d ఆ ఇద్దరితో మాట్లాడారు. నేను వెంటనే సుద్దాల గారి ఇంటికి వెళ్ళాను.
ఈలోగా ఆయన వివరాలు సేకరించి, ‘ఆ ఇద్దరిలో కొమలే ఆ పాట ని వెలికితీసుకొచ్చింది, ఆమెతో పాడిద్దాం’ అని సుద్దాల గారు అన్నారు. నా ముందే ఆయన కోమలకి ఫోన్ చేశారు. ‘పాట రిలీజ్ చేస్తాం అని announce చేసాం కాబట్టి, కోమల ని వెంటనే రమ్మని’ అడిగాం. వరంగల్ నుండి రావటానికి ఏర్పాటు చేస్తాం అన్నాం. music director ని చెన్నయ్ నుండి రప్పించాం. ‘జలుబు ఉంది, రాలేను’ అంది కోమల. పాట announce చేశాం కాబట్టి మా ఇబ్బంది చెప్పాం. తనకి credit ఇస్తే అభ్యంతరం లేదు అంది. ‘genuine case sir, credit తో పాటు డబ్బులు కూడా ఇస్తే బాగుంటుంది’ అని సుద్దాల గారు అన్నారు. కోమల ని అడిగితే, మీ ఇష్టం సర్, ఎంత ఇస్తే అంత ఇవ్వండి అంది. కచ్చితంగా ఇస్తాం అని చెప్పాను.
audio function లో పాడమని, visibility బాగా ఉంటుంది అని, కచ్చితంగా రమ్మని నేనే కోమలకి చెప్పాను. ఆమె సరే అంది.
సుద్దాల గారి ఇంటి నుండి ఫోన్లో కొమలతో చెప్పినట్టుగానే, పాట రిలీజ్ చేసినప్పుడు – facebook లో కోమల ki thanks చెప్పాను.
మరుగున పడిన జానపద గీతాన్ని వెలికి తీసుకొచ్చిన కోమల కి మేం promise చేసినట్టు ఫిల్మ్ లో credit ఇస్తాం, money ఇస్తాం, audio function fix అయితే , కోమలకి పాడమని invitation పంపిస్తాం.
post production పనుల్లో పడి నేను టివి ల్లో జరుగుతున్న చర్చలు follow కాలేదు. ఒకేసారి facebook లో అందరికి information ఇస్తున్నాను. thanks to all.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఎక్కువ చదివినవి

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...