Switch to English

శర్వానంద్ ‘శ్రీకారం’ మూవీ రివ్యూ

Critic Rating
( 2.50 )
User Rating
( 3.50 )

No votes so far! Be the first to rate this post.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,466FansLike
57,764FollowersFollow
Movie శ్రీకారం
Star Cast శర్వానంద్, ప్రియాంక అరుళ్ మోహన్, రావు రమేష్
Director కిషోర్ బి
Producer రామ్ ఆచంట - గోపి ఆచంట
Music మిక్కీ జె మేయర్
Run Time 2 గంటల 12 నిమిషాలు
Release మార్చ్ 11, 2021

వరుస ప్లాప్ లతో సతమతమవుతున్న యంగ్ హీరో శర్వానంద్ హిట్ కొట్టాలనే దిశగా హార్డ్ హిట్టింగ్ పాయింట్ వ్యవసాయం మీద చేసిన సినిమా ‘శ్రీకారం’. నూతన దర్శకుడు కిషోర్ బి దర్శకత్వంలో 14 రీల్స్ నిర్మించిన ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్. తెలంగాణ మినిష్టర్ కేటీఆర్, మెగాస్టార్ చిరులతో సహా పలువురు సెలబ్రిటీస్ మెచ్చుకున్న ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం..

కథ:

కార్తీక్ (శర్వానంద్) ఓ సక్సెస్ఫుల్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్. ఆ టైంలోనే చైత్ర(ప్రియాంక మోహన్) ప్రేమించమని కార్తీక్ వెంటపడుతుంది. కానీ కార్తీక్ పట్టించుకోడు. కార్తీక్ చేస్తున్న ప్రాజెక్ట్ సూపర్ సక్సెస్ అవ్వడంతో మేనేజర్ గా ప్రమోట్ చేసి అబ్రాడ్ లో ఆఫర్ ఇస్తారు. కానీ ఆ టైంకి శ్రీకాంత్ ఫ్యామిలీ అప్పులు తీరిపోవడంతో జాబ్ మానేసి తన ఊరికెళ్ళి వ్యవసాయం చేయాలని డిసైడ్ అవుతాడు. ఆ నిర్ణయం కార్తీక్ ఫాదర్ అయిన కేశవులు(రావు రమేష్)కి నచ్చదు. దాంతో తండ్రీ – కొడుకుల మధ్య దూరం పెరుగుతుంది. అయినా సరే ఊరి నుంచి వెళ్ళిపోయిన కొందరిని వెనక్కి పిలిపించి వ్యవసాయం మొదలు పెడతాడు. ఇక కొత్తరకమైన వ్యవసాయం చేయడంలో శర్వానంద్ ఎలాంటి సవాళ్ళని ఎదుర్కున్నాడు? అసలు కార్తీక్ అంత మంచి ఆఫర్ వదులుకుని ఎందుకు వ్యవసాయం చేయాలనుకుంటాడు?మొదట్లో కార్తీక్ కి సపోర్ట్ చేయని ఆ గ్రామస్తులు తనతో జాయిన్ అయ్యారా? లేదా? కార్తీక్ ని చివరికి కేశవులు సపోర్ట్ చేశాడా? లేదా అన్నదే కథ.

తెరమీద స్టార్స్..

శర్వానంద్ శ్రీకారంలో రెండు డిఫరెంట్ లుక్స్ లో కనిపిస్తాడు. ఫస్ట్ హాఫ్ లో కొంతవరకూ కనిపించే సిటీ బాయ్ లుక్ బాగుంది మనం ఇది వరకూ చూసేసిందే, కానీ పల్లెటూరి లుంగీ లుక్ లో నిజమైన రైతులా కనిపించి సరికొత్తగా అనిపిస్తాడు. అలాగే నటన పరంగా ఇంకోమెట్టు పైకి ఎక్కాడనే చెప్పాలి. అన్ని సీన్స్ ఒక ఎత్తైతే రావు రమేష్, ప్రియాంక మరియు గ్రామస్తులతో చేసిన ఎమోషనల్ సీన్స్ లో సూపర్బ్ అనిపించుకున్నాడు. దేశానికి వెన్నెముకలాంటి వాడు రైతు అంటారు. అలా ఈ సినిమాకి హైలైట్ అయిన పాత్ర చేసింది రావు రమేష్. రైతుల మనోవేదనని కళ్ళకు కట్టినట్టు చూపించడంలో రావు రమేష్ నటన వావ్ అనిపిస్తుంది. ప్రియాంక అరుళ్ మోహన్ అటు మోడ్రన్ లుక్ లో, ఇటు ట్రెడిషనల్ లంగా వోణీలో ఆకట్టుకుంటుంది. అలాగే మొదటి సినిమాకి పూర్తి భిన్నంగా ఎనర్జిటిక్ పాత్రలో అదరగొట్టింది. ఎమోషనల్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో సాయి కుమార్ మెప్పిస్తే, శర్వాకి ఫ్రెండ్ గా అటు కామెడీని ఇటు ఎమోషన్ ని బాలన్స్ చేసే పాత్రలో సత్య సూపర్బ్ అనిపించాడు. నరేష్ ఎమోషనల్ సీన్స్ కూడా మనసుకి హత్తుకుంటాయి.

తెర వెనుక టాలెంట్..

శ్రీకారం కథ కోసం ఎంచుకున్న పాయింట్ చాలా బాగుంది. అలాగే సినిమాలో రాసుకున్న ఎమోషనల్ సీన్స్ కూడా చాలా చోట్ల మనసుకు హత్తుకొని, గడిచిపోయిన ఎన్నో జ్ఞాపకాలను మళ్ళీ మనకు గుర్తు చేస్తుంది. అక్కడి వరకూ ప్రాబ్లెమ్ అనిపించదు, కానీ హీరో పాత్ర ఎక్కడో శతమానంభవతి సినిమాని పోలి ఉండడం రొటీన్ అనిపిస్తుంది. కథ పరంగా సెకండాఫ్ ని ఇంకాస్త బెటర్ గా కొత్త వే లో చెప్పి ఉండాల్సింది. ఎందుకంటే ఈ ఫ్లేవర్ ఇది వరకూ చూసేసాం అనే ఫీలింగ్ వస్తుంది. కథనం పరంగా చూసుకుంటే ఫస్ట్ హాఫ్ లో లవ్ ట్రాక్ కాస్త ఇబ్బంది పెట్టినా, మిగిలిన సినిమా అంటా చాలా ఎమోషనల్ గా సాగి సెకండాఫ్ మీద ఆసక్తిని క్రియేట్ చేస్తుంది. కానీ సెకండాఫ్ బాగా డ్రాప్ అవుతూ అక్కడక్కడా ఒక్కో సీన్స్ బాగుంది అనేలా సాగడం వలన ఫస్ట్ హాఫ్ ఫీల్ ని క్యారీ చేయలేకపోయింది. ఇకపోతే డైరెక్టర్ గా కథ నుంచి డీవియేట్ అవ్వకుండా అనుకున్న పాయింట్ ని హార్ట్ టచింగ్ గా చెప్పడంలో సక్సెస్ అయ్యాడు. ఇలాంటి కాన్సెప్ట్ కి దగ్గరగా మహర్షి రావడంతో సెకండాఫ్ లో చేసిన మార్పులు చేర్పులు సినిమాకి మైనస్ అని చెప్పాలి.

సాయి మాధవ్ బుర్రా రాసిన డైలాగ్స్ ఒక్కోటి ఒక్కో ఆణిముత్యం అని చెప్పచ్చు. ప్రతి డైలాగ్ లోనూ ఎంతో లోతైన అర్థం ఉంటుంది. కచ్చితంగా ఆ డైలాగ్స్ శ్రీకారంకి ప్రాణం పోశాయి. యువరాజ్ సినిమాటోగ్రఫీ సింప్లీ సూపర్బ్.. ముఖ్యంగా వ్యవసాయం చేసే షాట్స్ ని చూపించిన విధానం, ఎమోషనల్ సీన్స్ లో తన విజువల్ తో మూడ్ ని క్రియేట్ చేసిన విధానం చాలా బాగుంది. ఆ విజువల్స్ ని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లేలా ఆడియన్స్ కి ఇంకా బాగా ఎమోషన్ కనెక్ట్ అయ్యేలా చేయడంలో మిక్కీ జె మేయర్ మ్యూజిక్ మైండ్ బ్లోయింగ్ అని చెప్పాలి. పాటలు ఎంత బాగున్నాయో అంతకు మించి నేపధ్య సంగీతం బాగుంది. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ కూడా బాగుంది. అవినాష్ కొల్ల సెట్ వర్క్ కూడా బాగుంది. 14 రీల్స్ ప్లస్ నిర్మాణ విలువలు సూపర్బ్.

విజిల్ మోమెంట్స్:

– శర్వానంద్ బ్రిలియంట్ పెర్ఫార్మన్స్
– రావు రమేష్, నరేష్ ఎమోషనల్ సీన్స్
– హృదయాల్ని హత్తుకునే ఎమోషనల్ టచ్ తో ఫస్ట్ హాఫ్
– ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్
– మిక్కీ జె మేయర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్

బోరింగ్ మోమెంట్స్:

– స్పీడ్ బ్రేకర్ లాంటి లవ్ ట్రాక్
– రొటీన్ అనిపించే సెకండాఫ్ సీన్స్
– స్లో నేరేషన్
– వేరే సినిమాల్ని పోలిన ఫీలింగ్
– సెకండాఫ్ లో ఎమోషనల్ జర్నీ మిస్ అవ్వడం

విశ్లేషణ:

శర్వానంద్ నుంచి వచ్చిన ‘శ్రీకారం’ సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ ఒక్కో చోట కచ్చితంగా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుంది. కానీ రెగ్యులర్ కామెడీ, పాట, ఫైట్ కోరుకునే ప్రేక్షకులకి మాత్రం ఈ సినిమా అంతగా నచ్చదు. శ్రీకారం మన మనసుల్ని తట్టి లేపి మనలో ఉన్న ఆవేదనల్ని, మన గడిచిన రోజుల జ్ఞాపకాల్నీ గుర్తు చేసే ఎమోషనల్ సినిమా. ఓవరాల్ గా స్లోగా సాగుతూ, అక్కడక్కడా ఎమోషనల్ గా హై ఇచ్చే సినిమా ‘శ్రీకారం’.

చూడాలా? వద్దా?: మీ లైఫ్ లోని విలేజ్ మెమోరీస్ ని టచ్ చేయాలనుకుంటే చూడచ్చు.

తెలుగుబులెటిన్.కామ్ రేటింగ్: 2.5/5

8 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

రాజకీయం

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...

మెగాస్టార్ చిరంజీవి మీద పడి ఏడుస్తున్న వైసీపీ బ్యాచ్.!

2024 ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని ముందే ఊహించుకున్న వైసీపీ, ప్రతి చిన్న విషయానికీ కలత చెందుతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు...

ఎక్కువ చదివినవి

రాయి వెనుక రాజకీయం.! వైసీపీని వెంటాడుతున్న వైసీపీ నేతల వీడియోలు.!

ఓ కొడాలి నాని.. ఓ అంబటి రాంబాబు.. ఓ కన్నబాబు.. ఓ పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి.. ఓ వల్లభనేని వంశీ.. ఇలా చెప్పుకుంటూ పోతే, లిస్టు చాలా పెద్దది. ఔను, చాలా...

Vote: ఓటు గొప్పదనం ఇదే..! ఒక్క ఓటరు కోసం 18కి.మీ అడవి బాట.. ఎక్కడంటే..

Vote: ప్రస్తుతం దేశంలో ఎలక్షన్ (Elections 2024) ఫీవర్ నడుస్తోంది. ఈక్రమంలో మొదటి విడత పోలింగ్ కొన్ని రాష్ట్రాల్లో నిన్న ప్రారంభమైంది. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి.. రాజ్యాంగం కల్పించిన హక్కు...

Raghu Babu: నటుడు రఘుబాబు కారు ఢీకొని బైకర్ మృతి..

Raghu Babu: సినీ నటుడు రఘుబాబు (Raghu Babu) ప్రయాణిస్తున్న కారు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన హైదరాబాద్ పరిధిలో జరిగింది. నల్గొండ బైపాస్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో కారు ఢీకొని...

Viral News: పేరెంట్స్ నిర్లక్ష్యం.. బైక్ ఫుట్ రెస్ట్ పై బాలుడిని నిలబెట్టి.. వీడియో వైరల్

Viral News: ప్రయాణంలో జాగ్రత్తలు, రోడ్డు ప్రమాదాలు, హెల్మెట్స్, సీట్ బెల్ట్స్ పెట్టుకోవడం, ఫుట్ బోర్డు ప్రయాణాల వద్దని నిత్యం అవగాహన కల్పిస్తూంటారు ట్రాఫిక్ పోలీసులు. కొందరు సూచనలు పాటిస్తే.. మరికొందరు నిర్లక్ష్యంగా...

గ్రౌండ్ రిపోర్ట్: నిడదవోలులో జనసేన పరిస్థితేంటి.?

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నిడదవోలు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఎలా వున్నాయ్.? 2024 ఎన్నికల్లో ఏ పార్టీ ఈ నియోజకవర్గం నుంచి గెలవబోతోంది.? నాటకీయ పరిణామాల మధ్య జనసేన పార్టీకి ‘కూటమి’ కోటాలో...