Switch to English

రూ.35 కోసం రైల్వే శాఖతో రెండేళ్లు పోరాటం, చివరికి విజయం..కానీ

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

మనం ఎక్కడైనా 50 రూపాయలో 100 రూపాయలో పోగొట్టుకుంటే కాసేపు బాధపడి ఆ విషయాన్ని వదిలేస్తాం, ఎందుకంటే ఆ డబ్బు మన జీవితాన్ని ఏం మార్చేయదు అని మనకు తెలుసు.. అలాంటింటి ఒక వ్యక్తి తనకు రావాల్సిన 35 రూపాయల కోసం ఏకంగా రెండేళ్ల పాటు పోరాటం చేసి విజయాన్ని సాధించాడు. 35 రూపాయలకు బదులు 33 రూపాయలు రావడం తో మిగిలిన ఆ రెండు రూపాయల కోసం మళ్ళీ పోరాటం చేస్తా అంటున్నాడు.. ఇంతకీ అసలు విషయంలోకి వెళ్తే…

రాజస్థాన్‌లోని కోటాకు చెందిన సుజీత్ స్వామి ఓ ఇంజనీర్. ఆయన 2017 జూలై 2న తను నివసిస్తున్న ప్రదేశం నుండి ఢిల్లీ కి వెళ్లాలనుకున్నాడు.దానికోసం దాదాపు రెండు నెలల ముందుగా టికెట్ బుక్ చేసుకున్నారు. అయితే వెయిటింగ్ లిస్ట్ ఎక్కువ ఉండటంతో కొద్దిరోజుల ముందు సుజీత్ తన టికెట్ రద్దు చేసుకున్నారు. కానీ టికెట్ రద్దు చేసుకున్న తర్వాత సుజీత్‌కు రావాల్సిన పూర్తి మొత్తం డబ్బు వెనక్కి రాలేదు. అతను చెల్లించిన మొత్తం టికెట్ ధరలో ( రూ.765 ) రూ.100 తగ్గించి, రూ.665 రీఫండ్ చేశారు.రైల్వేశాఖ నిబంధనల ప్రకారం వెయిటింగ్ జాబితాలో ఉన్న టికెట్‌ను రద్దు చేసుకుంటే రూ.65 ఛార్జ్ ని టికెట్ మొత్తం ధరలో నుండి తీసివేసి మిగిలిన మొత్తాన్ని వాపసు ఇస్తారు. అయితే తన నుంచి రూ. 65 ఛార్జ్ చేయడంతో సుజీత్ రైల్వేశాఖను సంప్రదించారు.అదే ఏడాది జీఎస్టీ అమల్లోకి రావడంతో మిగతా రూ.35 సర్వీస్ ట్యాక్స్ కింద ఛార్జ్ చేసినట్లు రైల్వేశాఖ తెలిపింది. అయితే తాను జీఎస్టీ అమల్లోకి రావడానికి ముందే టికెట్‌ను రద్దు చేసుకున్నానని తన రూ.35 తనకు ఇవ్వాలని ఐఆర్‌సీటీసీని కోరారు.

కానీ రైల్వే శాఖల నుండి అతనికి ఎటువంటి సమాచారం రాలేదు దీనితో అతను 2018 ఏప్రిల్‌లో లోక్‌ అదాలత్‌ను ఆశ్రయించారు. ఇక్కడ కూడా తన సమస్య పరిష్కారం కాకపోవడంతో సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేసుకున్నారు.ఈ విధంగా సుమారు రెండేళ్ల పాటు సుజీత్ రైల్వేశాఖతో పోరాటం చేశారు. ఈ క్రమంలో మే 1న ఆయన పోరాటానికి ఫలితం దక్కింది. ఆయన ఖాతాలోకి రూ. 33ను ఐఆర్‌సీటీసీ జమ చేసింది.ఇన్నాళ్లపాటు తనకు రావాల్సిన సొమ్మును ఇవ్వకపోవడంతో పాటు రూ.2 తగ్గించి ఇవ్వడంతో సుజీత్ ఆవేదన వ్యక్తం చేశారు. రూ.35 కి బదులుగా రూ.33 చెల్లించడం తో మిగిలిన ఆ రెండు రూపాయల కోసం తాను మళ్ళీ పోరాటం చేస్తానని తెలిపారు..

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Hema: ‘నన్ను ఇందులోకి లాగొద్దు..’ బెంగళూరు రేవ్ పార్టీపై నటి హేమ

Hema: బెంగళూరు (Bengaluru) నగర శివారులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఓ ఫామ్ హౌస్ లో జరిగినట్టుగా వార్తలు...

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.....

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

రాజకీయం

కింగ్ మేకర్ జనసేనాని: వైసీపీ అంతర్గత సర్వేల్లో ఇదే తేలిందా.?

టీడీపీ - వైసీపీకి సమానంగా సీట్లు రావొచ్చు. జనసేన పార్టీకి తక్కువలో తక్కువ పన్నెండు సీట్లు వస్తాయ్.! రెండు ఎంపీ సీట్లు కూడా జనసేన గెలుచుకోబోతోంది. ఈ పరిస్థితుల్లో జనసేన అధినేత పవన్...

ఓటు అమ్ముకున్న పోలీస్.! వింతేముంది.?

దొరికేదాకా దొరలే.! దొరికితేనే దొంగ.! ఓ పోలీస్ అధికారి ఓటుని అమ్ముకుని, సస్పెండ్ అయ్యాడు.! ఏంటీ, భారతదేశంలో ఓటుని అమ్ముకోవడం నేరమా.? మరి, కొనుక్కుంటున్న రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల సంగతేంటి.? ఎమ్మెల్యే టిక్కెట్...

జగన్, చంద్రబాబు.. విదేశీ ‘రాజకీయ’ పర్యటనల వెనుక.!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ వెళ్ళారు. నారా చంద్రబాబునాయుడు విదేశాలకు వెళ్ళనున్నారు. పవన్ కళ్యాణ్ కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం వుందట. విదేశాలకు వెళితే తప్పేముంది.? ఒకరు విదేశాలకు వెళితే, పారిపోయినట్టు...

వంగా గీత మెగాభిమానం.! నిజమేనా.? నమ్మొచ్చా.?

మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య అంటే, నాకు అమితమైన అభిమానం. చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ అన్నా కూడా అభిమానమే. నాగబాబు అంటే కూడా అంతే గౌరవం.! ఈ మాటలు అన్నదెవరో కాదు, కాకినాడ ఎంపీ...

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

ఎక్కువ చదివినవి

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ తనయుడిగా బాలనటుడిగా తెరంగేట్రం చేసి తొలి...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

Elephant: గున్న ఏనుగుకు జెడ్ కేటగిరీ భద్రత.. వీడియో వైరల్

Elephant: కుటుంబం తమ పిల్లల సంరక్షణను ఎలా చూసుకుంటుందో మానవ సంబంధాలలో చూస్తూంటాం. తమకూ తెలుసనిపించేలా ఉన్న అడవిలోని ఏనుగులకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు ‘ఎక్స్’లో...