Switch to English

ఓటిటి రివ్యూ: పావ కధైగల్ – ఎమోషనల్ టచ్ తో ఓకే అనిపించుకునే పాత కథలు.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ ‘పావ కధైగల్’ ఒరిజినల్ అంథాలజీ సీరీస్ తో తమిళ్లో ఒరిజినల్ కంటెంట్ చేయడం మొదలు పెట్టారు. తమిళ్లో స్టార్ దర్శకులైన సుధ కొంగర, గౌతమ్ వాసుదేవ్ మీనన్, విగ్నేష్ శివన్, వెట్రిమారన్ లు ఒక్కో స్టోరీ ని డైరెక్ట్ చేయగా అంజలి, సాయి పల్లవి, సిమ్రాన్, ప్రకాష్ రాజ్, గౌతమ్ మీనన్, కాళిదాస్ జయరాం ప్రధాన పాత్రలు పోషించారు.

కథ:

నాలుగు ఎపిసోడ్స్ తో కూడిన ఆంథాలజీ సీరీస్..

తంగం – సుధ కొంగర డైరెక్ట్ చేసిన ఈ కథలో ఒక ట్రాన్స్ జెండర్(కాళిదాస్ జయరాం) చిన్నప్పటి నుంచి తను ఇష్టపడి, ప్రేమించిన తంగం(శాంతను భాగ్యరాజ్) తన సొంత సిస్టర్ ని ప్రేమిస్తున్నాడని తెలిసి ఎంతటి త్యాగం చేసింది అనేదే కథ.

లవ్ పన్నా వుట్రనుమ్ – విగ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన ఈ కథలో ప్రజల ముందు సమానత్వం అని చెప్పి కులాంతర వివాహాలు చేసే ఓ నాయకుడు, తన సొంత కవల పిల్లల ప్రేమ విషయంలో ఎలాంటి కఠిన నిర్ణయం తీసుకున్నాడు అనేదే కథ.

వాన్మగళ్ – గౌతమ్ మీనన్ డైరెక్ట్ చేసిన ఈ స్టోరీలో, తల్లి, తండ్రి, ఇద్దరు కుమార్తెలు, కొడుకు కలిసి ఉన్న ఒక హ్యాపీ ఫ్యామిలీ. ఒకరోజు 12 ఏళ్ళ అమ్మాయిని రేప్ చేసి వదిలేస్తారు. ఎవరికీ తెలియకపోయినా ఆ విషయంపై ఫ్యామిలీ తీసుకున్న నిర్ణయం ఏంటనేది కథ.

ఊర్ ఇరవు – ప్రేమించిన వ్యక్తితో వెళ్ళిపోయి గర్భంతో ఉన్న సుమతి(సాయి పల్లవి)ని వెతుక్కుంటూ వచ్చిన తండ్రి జానకి రామన్ (ప్రకాష్ రాజ్) శ్రీమంతం కోసం ఇంటికి తీసుకువస్తారు. శ్రీమంతమే జరిగిందా లేక ఇంకేమైనా జరిగిందా అనేదే కథ.

తెర మీద స్టార్స్..

తెరపైన కనిపించిన ప్రతి ఒక్కరూ అద్భుతమైన నటనని కనబరిచారు. ప్రతి ఒక్క స్టోరీలో కంటెంట్ మనసుకు హత్తుకొని, చూసే ఆడియన్స్ ఎమోషనల్ అయ్యేలా చేయడానికి కారణం మాత్రం నటీనటుల ప్రతిభే.. అంజలి ఒక సీన్ లో సూపర్ హాట్ గా కనిపించి అందరినీ సర్ప్రైస్ చేస్తే, సాయి పల్లవి గర్భిణీ పాత్రలో మనసును ఆకట్టుకుంటుంది. గౌతమ్ మీనన్, సిమ్రాన్, కాళిదాస్ జయరామ్ లు కూడా వారి వారి పాత్రలకి పూర్తి న్యాయం చేశారు.

తెర వెనుక టాలెంట్..

అందరికీ తెలిసిన స్టార్ డైరెక్టర్స్ ఈ సీరీస్ చేసినప్పటికీ అందరూ తీసుకున్న కామన్ పాయింట్ ఒక్కటే.. కులం, స్టేటస్, పరువు, లింగ భేదాల ఇతివృత్తంతో కథ చెప్పడం. ప్రతి కథ, అందులోని ఎమోషన్స్ ని ఇప్పటికే పలుసార్లు చూసేసి ఉన్నాం.. కావున కథ పరంగా, కథనం పరంగా సూపర్బ్ అనేలా ఏమీ లేదు. కానీ డైరెక్టర్స్ మేకింగ్ పరంగా, పెర్ఫార్మన్స్ పరంగా ప్రేక్షకుల మనసుల్ని టచ్ చేస్తారు. ఎంతైనా తెలిసిన కథ, ఎమోషన్ కావడం వలన చూసేటప్పుడు అంత ఎగ్జైట్ మెంట్, సస్పెన్స్ అనిపించదు. కొన్ని కొన్ని మన నిజజీవితంలో చూసిన, జరిగే సంఘటనలు కాబట్టి కనెక్ట్ అవుతాము. ఈ నాలుగు కథల్లో సుధ కొంగర, వెట్రిమారన్ కథలు బాగున్నాయి, గౌతమ్ వాసుదేవ్ మీనన్, విగ్నేష్ శివన్ కథలు పరవాలేధనిపిస్తాయి.

ప్రతి ఒక కథకి ఒక్కో సినిమాటోగ్రాఫర్, మ్యూజిక్ డైరెక్టర్ పనిచేసారు. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, లొకేషన్స్ సీరీస్ లో హైలైట్ అని చెప్పాలి.

విజిల్ మోమెంట్స్:

– నటీనటుల పెర్ఫార్మన్స్
– సినిమాటోగ్రఫీ
– బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
– ఎమోషనల్ టచ్

బోరింగ్ మోమెంట్స్:

– తెలిసిన స్టోరీ లైన్స్
– ఇంకాస్త ఆసక్తిగా ఉండాల్సిన కథనం
– స్లోగా సాగడం
– ఎంగేజింగ్ గా లేకపోవడం
– వీక్ క్లైమాక్స్

విశ్లేషణ:

ఒకే కథా వస్తువుతో, నాలుగు డిఫరెంట్ కథలతో తీసిన ఈ ‘పావ కథైగల్’ సీరీస్ లో నటీనటులు, డైరెక్టర్స్ స్టార్స్ అవ్వడం వలనే ఈ సీరీస్ కి ఇంత హైప్ వచ్చింది. అలాగే ఏదో తీసేసి ఉంటారని ఆసక్తి చూపారు కానీ తీరా చూస్తే చెప్పిన కథనే, చాలా స్లోగా చెప్పారు. కానీ నటీనటులు స్టార్స్ అవ్వడం వలన కొంత వరకూ చూడగలం. ఓవరాల్ గా ఎమోషనల్ డ్రామాస్ ఇష్టపడే వాళ్ళకి కళ్ళు చెమర్చుతాయి, మిగిలిన ఆడియన్స్ కి చూసిందే చుపిస్తారేంటి అని బోర్ కూడా కొట్టచ్చు. పావ కథైగల్ సీరీస్ చూసాక ఇంత స్టార్ ఇమేజ్ ఉన్న దర్శకులు చెప్పాల్సిన కథలైతే ఇవి కావు అని మాత్రం ప్రతి ఒక్కరూ ఫీలవుతారు.

చూడాలా? వద్దా?: ఎమోషనల్ టచ్ ఇష్టపడే వాళ్ళకి మాత్రమే.

తెలుగుబులెటిన్.కామ్ రేటింగ్ : 2/5 

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎక్కువ చదివినవి

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి ని తెలుగు లో 'సత్య' గా...