Switch to English

స్పెషల్ స్టోరీ: ఈనాడులో ఎందుకిలా..?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

తెలుగులో నంబర్ వన్ పత్రిక ఏది అంటే ఠక్కున.. ‘ఈనాడు’ అని చాలామంది చెబుతారు. పత్రికా రంగంలో టాబ్లాయిడ్లతో సరికొత్త చరిత్ర సృష్టించిన ఘనత ఆ పత్రికదే. పత్రిక మీద వచ్చే ఆదాయంతోనే రామోజీ సామ్రాజ్యం మొత్తం నడిచేదంటే అతిశయోక్తి కాదు. అలాంటి పత్రిక పరిస్థితి ఇప్పుడు గందరగోళంగా మారింది. కరోనా మహమ్మారి దెబ్బకు విలవిలలాడుతోంది. ఒకప్పుడు 31నే జీతాలిచ్చే ఈనాడు.. ఇప్పుడు వారం రోజులు ఆలస్యంగా వేతనాలు చెల్లిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఉండే ఎల్టీయే, లీవ్ ఎన్ క్యాష్ మెంట్ వంటి ఎన్నో వెసులుబాట్లను తమ సిబ్బందికి వర్తింపజేసిన సంస్థలో పరిస్థితులు ఒక్కసారిగా తలకిందులయ్యాయి. కరోనా కారణంగా ఆదాయం పడిపోవడంతో ఖర్చులు తగ్గించుకునే ప్రక్రియ మొన్న ఏప్రిల్ లోనే మొదలుపెట్టింది.

తొలుత ఉద్యోగ విరమణ చేసిన తర్వాత కూడా ఎక్స్ టెన్షన్ పై కొనసాగుతున్నవారిని ఇంటికి సాగనంపింది. పలువురు సీనియర్ ఫొటోగ్రాఫర్లకు మంగళం పాడేసింది. ఎంఎంపీల్ వంటి ఈనాడు అనుబంధ సంస్థల్లో పనిచేసే పలువురు సిబ్బందికి టాటా చెప్పేసింది. ఫొటోగ్రాఫర్లకు ప్యాకేజీ ఇచ్చిన సంస్థ.. ఎంఎంపీఎల్ ఉద్యోగులకు మాత్రం మొదట్లో మొండిచేయి చూపించింది. దీంతో వారిలో పలువురు అనేకసార్లు తమకు న్యాయం చేయాలంటూ యాజమాన్యానికి మొరపెట్టుకున్నారు. కొన్నిచోట్ల ఆందోళనలు కూడా చేశారు. వీరి పరిస్థితి ఇలా ఉంటే.. ఉద్యోగం ఉన్నవారి పరిస్థితి మరోలా ఉంది. కార్మిక చట్టంలోని చిన్న వెలుసుబాటును అడ్డం పెట్టుకుని లేఆఫ్ ప్రకటించారు. అంటే నెలలో కొన్నిరోజులు మాత్రమే పని. అలా పనిచేసిన రోజులకే వేతనం అన్నమాట. ఐదు నెలలుగా ఇది కొనసాగుతోంది. ప్రస్తుతం యాడ్స్ వస్తుండటంతో లేఆఫ్ కి స్వస్తి పలుకుతారేమోనని సిబ్బంది ఆశగా ఎదురుచూస్తున్నారు.

ఇది ఇలా ఉండగా.. ఈనాడు పాత్రికేయులను కూడా తగ్గించుకునే దిశగా యాజమాన్యం సమాలోచనలు చేస్తుందంటూ ప్రచారం మీడియా సర్కిళ్లలో జరుగుతోంది. ఈటీవీ జర్నలిస్టులతో ఈనాడుకు కూడా వార్తలు రాయించుకోవాలని యోచిస్తోందన్నది దాని సారాంశం. ఈనాడుతో పోలిస్తే ఈటీవీ సిబ్బందికి వేతనాలు తక్కువ. ఈ నేపథ్యంలో ఈటీవీ రిపోర్టర్ల చేత ఈనాడుకు కూడా వార్తలు రాయించుకుంటే క్రమంగా ఈనాడు రిపోర్టర్లను తగ్గించుకోవాలనే యోచన ఉన్నట్టు చెబుతున్నారు. అయితే ఇది నిజం కాదనే వాదనలూ ఉన్నాయి. ఈటీవీ రిపోర్టర్లు ఈనాడుకు, ఈనాడు సిబ్బంది ఈటీవీకి పనిచేయడం సాధారణమైన విషయమేనని.. ఇది ఎప్పటినుంచో జరుగుతున్నదేనని పేర్కొంటున్నారు. అందువల్ల దీనిని భూతద్దంలో చూడాల్సిన పనిలేదంటున్నారు. ఇదిలా ఉంచితే ఏటా దసరాకి ఇచ్చే బోనస్ ఈసారి వస్తుందా రాదా అని చాలామంది ఆందోళన చెందుతున్నారు.

దాదాపు ఒక నెల జీతానికి కొంచెం తక్కువగా వచ్చే బోనస్ కోసం అందరూ ఎదురుచూస్తుంటారు. కానీ ఇప్పటికీ లేఆఫ్ అమలు చేస్తుండటం.. ఎల్టీయే, లీవ్ ఎన్ క్యాష్ మెంట్ తీసేయడం వంటి పరిణామాలు చూస్తుంటే బోనస్ వస్తుందా రాదా అనే అనుమానాలు ఎక్కువయ్యాయి. మరో రెండు మూడు రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

19 COMMENTS

  1. As an adult, Lego has rekindled my love for storytelling and imaginative play.
    It’s a good reminder that we can never be too old to release our inner child.
    highest rated lego kits Lego Harry Potter Sets are a
    must for any Harry Potter fan. They bring magic to your home!

    LEGO sets are a great alternative to tablets. You’ll have more fun building the Taj Mahal
    than you would with a tablet!

  2. I created a LEGO-based flower, which quickly became my favourite architecture project.

    Nature-inspired masterpieces! amazing lego building sets
    to consider LEGO sets can be used to create fun and creative architecture.
    Legos have rekindled in me my love of imaginative play and story telling as an adults.
    It reminds us that we are never too old for imaginative
    play and storytelling.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...