Switch to English

క్షమించు బాలూ.. నిన్ను ఉండగానే చంపేస్తున్నాం..!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,433FansLike
57,764FollowersFollow

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారిందని నిన్న సాయంత్రం ఓ మెడికల్‌ బులెటిన్‌ని విడుదల చేసింది, ఆయనకు వైద్య చికిత్స అందిస్తోన్న చెన్నయ్‌లోని ఓ ప్రముఖ ఆసుపత్రి. అంతే, మీడియాలో.. అందునా తెలుగు మీడియాలో.. అందునా ఓ ఎల్లో ఛానల్‌లో ఆయన్ని ముందే చంపేశారు. ‘బాలు ఇక లేరన్న సమాచారం వుంది..’ అంటూ ఓ రాజకీయ ప్రముఖుడు చేసిన వ్యాఖ్యల్ని ఉటంకిస్తూ, ‘బాలు ఇక లేరు’ అనే బ్రేకింగ్‌ న్యూస్‌ని క్వశ్చన్‌ మార్క్‌ పెట్టి ప్రచారంలోకి తీసుకొచ్చేసింది ‘యెల్లో ఛానల్‌’. నవ్విపోదురుగాక మనకేటి సిగ్గు.? అన్నట్టుంది వ్యవహారం.

గతంలోనూ పలువురు సినీ ప్రముఖుల విషయంలో ఇదే తరహా అత్యుత్సాహం తెలుగు మీడియా ప్రదర్శించింది. ఎస్పీ బాలు త్వరగా కోలుకోవాలని కోట్లాదిమంది సంగీత ప్రియులు కోరుకుంటున్నారు. సరే, ప్రాణం పోకడ అనేది దేవుడి చేతుల్లో వుంటుందనుకోండి.. అది వేరే విషయం. దాదాపు యాభై రోజులుగా ఆసుపత్రిలో అత్యంత విషమ పరిస్థితుల్లో వైద్య చికిత్స పొందుతున్న ఎస్పీ బాలు, కోలుకుని మన మధ్యకు రావాలనే కోరుకుంటున్నారు చాలామంది. ఇలాంటి తరుణంలో, ‘ఎస్పీ బాలు ఇక లేరు’ అనే వార్తని అందరికన్నా ముందే ‘బ్రేకింగ్‌’ చేసెయ్యాలనుకోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.?

మామూలుగా రాజకీయ వ్యభిచారం.. అని అంటాం. ఇక్కడ, మీడియా వ్యభిచారం అనాలేమో. కానీ, ఇంతకన్నా దారుణమైన పదాన్ని వెతికితే బావుంటుందేమో. ఎందుకంటే, మీడియాలో నైతిక విలువలు అంత పతన స్థాయికి పడిపోయాయి. ‘దయచేసి ఫేక్‌ న్యూస్‌ ప్రచారం చేయొద్దు..’ అంటూ బాలు అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా నిన్న సాయంత్రం నుంచీ వేడుకుంటూనే వున్నారు.

కొన్నాళ్ళ క్రితం సీనియర్‌ నటుడు చంద్రమోహన్‌ని ఇలాగే తెలుగు మీడియా చంపేసింది.. కానీ, ఆయన ఆరోగ్యంగానే వున్నారు. అంతెందుకు, మొన్నటికి మొన్న సునీల్‌ విషయంలోనూ ఈ తరహా దిక్కుమాలిన ప్రచారమే జరిగింది. అయినా, ‘మరణం’ విషయంలో ఈ మీడియాకి ‘తొందర’ ఎందుకు.? వాళ్ళింట్లో చావులకీ ఇలాగే సోకాల్డ్‌ ‘మీడియా’ స్పందిస్తుందా.? ‘క్షమించు బాలూ.. నిన్ను ముందే చంపేస్తున్నాం..’ అంటూ బాలు అభిమానులు కన్నీరు మున్నీరవుతున్నారు మీడియాలో వస్తున్న దురుద్దేశ్యపూర్వక కథనాల నేపథ్యంలో.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

ఎక్కువ చదివినవి

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను : చిరంజీవి

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి ఆ తర్వాత కొంత సమయం సరదాగా...

Sukumar: సుకుమార్ కెరీర్ @20 ఆయన బ్రెయిన్ పవర్ 2.0

Sukumar: లెక్కలు.. ఈ సబ్జెక్టే ఎంతో కష్టం. కానీ.. ఇష్టంగా భావించేవాళ్లకు లెక్కలు తప్ప మరొకటి ఎక్కదు. లెక్కలతో పదునెక్కిన మనిషి మెదడు చేసే ఏ పనిలో అయినా అలాగే ఆలోచింపజేస్తుంది. అంతే...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...