Switch to English

కొడాలి నానికి బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి ‘పవర్‌’ పంచ్‌.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,450FansLike
57,764FollowersFollow

హిందూ ధర్మంపై అవాకులు చెవాకులు పేలుతున్నారంటూ మంత్రి కొడాలి నానిపై దుమ్మెత్తిపోస్తున్నారు బీజేపీ నేతలు. ‘ఆంజనేయస్వామి బొమ్మ చెయ్యి విరిగిపోతే, ఆంజనేయస్వామికి నష్టమేంటి.?’ అంటూ వెటకారం చేసిన కొడాలి నాని, తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామి దేవాలయానికి వెళితే, అక్కడ బొమ్మ కనిపించిందా.? దేవుడు కనిపించాడా.? అని ప్రశ్నించారు. ఇదీ ‘పవర్‌ పంచ్‌’ అంటే. అంతే మరి.!

హిందూ ధర్మమంటే.. పుట్ట, చెట్టు.. రాయి, రప్ప.. ఇలా అన్నిట్లోనూ దైవత్వాన్ని చూస్తుంది. అంతెందుకు, జంతువుల్ని కూడా దేవుడిగా కొలిచే గొప్ప గుణం హిందూ ధర్మానికి వుంది. దుండగులు ఆంజనేయస్వామి విగ్రహాన్ని ధ్వంసం చేస్తే, ‘బొమ్మ ధ్వంసమైతే, ఆంజనేయస్వామికి నొప్పేంటి.?’ అని ప్రశ్నించే కొడాలి నాని, బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుపతికి వెళ్ళింది.. వెంకటేశ్వరస్వామి మీద భక్తితోనా.? లేదంటే, అధినేత వైఎస్‌ జగన్‌ కోసమే ఆయన తిరుపతికి వెళ్ళారా.? అన్న చర్చ తెరపైకి రావడం సహజమే కదా.!

‘రధం తగలబడితే, ఇన్స్యూరెన్స్‌ వుందంటారా? హిందూ సమాజం పట్ల మీరు చేస్తున్న విపరీత వ్యాఖ్యలు క్షమార్హం కాదు..’ అంటూ విష్ణువర్ధన్‌రెడ్డి ఓ ఛానల్‌ చర్చా కార్యక్రమంలో కొడాలి నానిపై విరుచుకుపడ్డారు. కొడాలిపై విష్ణువర్ధన్‌రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో వైసీపీ నేత రవిచంద్రారెడ్డికి నోట మాట రాకపోవడం గమనార్హం.

మరోపక్క, మంత్రి కొడాలి నాని, ప్రధాని నరేంద్ర మోడీపై చేసిన వ్యాఖ్యల్ని వైసీపీ ముఖ్య నేత, సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తప్పు పట్టారు. ‘ఆ వ్యాఖ్యలు కొడాలి నాని వ్యక్తిగతం. పార్టీతో సంబంధం లేదు..’ అని వ్యాఖ్యానించారు సజ్జల. ఇదిలా వుంటే, వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు సైతం కొడాలి నానిపై తీవ్రంగా మండిపడ్డారు. ‘మీ తండ్రిగారి ఫొటో మీద ఎవరైనా ఉమ్మేస్తే, అలా చేసిన వ్యక్తి చెంప పగలగొట్టకుండా, ఫొటోనే కదా.. తుడిచేసుకుంటానని సరిపెట్టుకోగలరా.?’ అని ప్రశ్నించారు రఘురామకృష్ణరాజు.

ఏదిఏమైనా, అత్యుత్సాహంతో హిందూ సమాజంపైనా, ప్రధాని నరేంద్ర మోడీపైనా నోరు పారేసుకున్న కొడాలి నానికి, ఇప్పుడు సొంత పార్టీ నుంచే మద్దతు కరవయ్యేలా వుంది. నోరు మంచిదైతే, ఊరు మంచిదవుతుందని పెద్దలు ఊరికనే అనలేదు కదా.!

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy)....

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

Mudragada: ముద్రగడ ఇంట రాజకీయ చిచ్చు.. కుమార్తె వ్యాఖ్యలపై పద్మనాభం స్పందన

Mudragada: మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంకు సొంత ఇంటి నుంచే వ్యతిరేకత ఎదురైంది. పవన్ ను ఓడించకపోతే పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్న వ్యాఖ్యలను ఆయన కుమార్తె క్రాంతి ఖండించారు. ఆమె...

ఎక్కువ చదివినవి

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు మేకర్స్. ఈక్రమంలోనే టాలీవుడ్, బాలీవుడ్ కి...

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు మల్లి అంకం

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఆ ఒక్కటీ అడక్కు’...

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా: దర్శకుడు వంశీ

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి దర్శకుడిగా తొలి సినిమా. సితార సినిమా...

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ చూస్తారు: అల్లరి నరేశ్

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో అల్లరి నరేశ్ (Allari Naresh) అన్నారు....

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...