Switch to English

బీజేపీ, టీడీపీ, వైసీపీ.. ఎవరి ట్రాప్‌లో ఎవరు పడ్డారు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,517FansLike
57,764FollowersFollow

రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడులకు సంబంధించి ప్రధాన రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. బీజేపీ, తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ.. ఒకరి మీద ఒకరు దుమ్మెత్తిపోసుకుంటోన్న విషయం విదితమే. ఈ వివాదానికి సంబంధించి బీజేపీ – జనసేన మిత్రపక్షాలు కావడంతో, రెండు పార్టీలూ ఓ కార్యాచరణ ప్రకారం ముందడుగు వేస్తున్నాయి.. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నాయి. జనసేన మీద వైసీపీ విమర్శలు చూశాం. ఇప్పుడు బీజేపీ మీద వైసీపీ విమర్శలు చేస్తున్నాం.

అయితే, చంద్రబాబు మీదా.. పవన్‌ కళ్యాణ్‌ మీద రెచ్చిపోయే చాలామంది వైసీపీ నేతలు, ఇప్పుడు సైలెంటయిపోయారు. కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్‌ తదితర కొందరు ‘సెలక్టివ్‌ నేతలు’ మాత్రమే అత్యుత్సాహం చూపుతున్నారు. ఇదిలా వుంటే, బీజేపీ నేతలు టీడీపీ ట్రాప్‌లో పడ్డారంటూ వైసీపీ ఆరోపిస్తోంది. వైసీపీ నేతలేమో, బీజేపీ నేతలు టీడీపీ ట్రాప్‌లో పడ్డారని విమర్శిస్తుండడం గమనార్హం.

బీజేపీ వాదన ఇంకోలా వుంది. టీడీపీ ట్రాప్‌లో వైసీపీ పడిందన్నది బీజేపీ ఆరోపణ. ఎవరి ట్రాప్‌లో ఎవరు పడ్డారు.? అన్న విషయాన్ని పక్కన పెడితే, రాష్ట్రంలో మాత్రం ఓ పద్ధతి ప్రకారం హిందూ మతంపై దాడి జరుగుతోందన్నది నిర్వివాదాంశం. వరుసగా హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి. దేవతా మూర్తుల విగ్రహాలపై దాడులు కొనసాగుతున్నాయి. అయినాగానీ, ప్రభుత్వం, అధికార పార్టీ స్పందించాల్సిన స్థాయిలో స్పందించడంలేదు.

తూర్పుగోదావరి జిల్లాలో ఓ చర్చికి సంబంధించిన విగ్రహాలు ధ్వంసమైతే, ‘ఇది అసాంఘీక శక్తుల కుట్ర’ అని వైసీపీ నేత ఒకరు ఆరోపించారు. మరి, అంతర్వేది రధం దగ్ధం కేసులో ‘తేనె తుట్టె’ కథ ఎలా తెరపైకొచ్చింది.? బిట్రగుంటలో ఓ రధం దగ్ధమైతే ‘ఆకతాయి పని’ అంటూ అధికార పార్టీ నేతలు ఎలా మాట్లాడగలిగారు.? పిఠాపురంలోని ప్రముఖ దేవాలయంలో దేవతా మూర్తుల విగ్రహాల్ని దుండగులు ధ్వంసం చేస్తే, ‘ఆకతాయిల పని’ అని ఎలా వైసీపీ కొట్టి పారేయగలిగింది.?

చర్చికి సంబంధించిన ఘటనలేమో అసాంఘీక శక్తుల కుట్రల కారణంగా జరిగినట్లు.. హిందూ దేవాలయాల విషయానికొస్తే మాత్రం ఆకతాయిల పనులని అధికార పార్టీ ఎలా చెప్పగలుగుతోంది.? తొలుత అధికార పార్టీ నేతలు ఏ ట్రాప్‌లో పడ్డారో తేల్చుకుని, హిందూ మతంపై జరుగుతున్న దాడులపై విశ్లేషించుకుని.. ఆ తర్వాత ఇతర పార్టీల గురించి మాట్లాడితే మంచిదేమో.!

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Taapsee: తాప్సీ సీక్రెట్ గా పెళ్లి చేసుకుందా..!? న్యూస్ వైరల్

Taapsee: హీరోయిన్ తాప్సీ (Taapsee) పెళ్లి చేసుకుందా..? అంటే తాప్సీ ఫ్రెండ్, నిర్మాత కనిక చేసిన ఇన్ స్టా పోస్ట్ ఔననే సమాధానమే ఇస్తోంది. కొన్ని...

Ram Charan: రామ్ చరణ్-సుకుమార్ కాంబో.. RC17 ప్రకటన వచ్చేసింది..

Ram Charan: యావత్ తెలుగు చిత్ర పరిశ్రమ మాత్రమే కాకుండా మెగాభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న  భారీ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. గ్లోబల్ స్టార్ రామ...

Ram Charan Birthday Special: కథల ఎంపికలో రామ్ చరణ్ స్పెషాలిటీ...

Ram Charan: మెగా ఫ్యామిలీ హీరోలకు మాస్ ఇమేజ్ ఓ వరం. దశాబ్దాలుగా మెగాస్టార్ చిరంజీవి సాధించిన క్రేజ్ అది. తనదైన శైలి నటన, డైలాగులు,...

Kamal Haasan: ‘కల్కి’లో తన పాత్ర రివీల్ చేసిన కమల్ హాసన్

Kamal Haasan: అగ్ర కథానాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. మరోవైపు లోక్ సభ ఎన్నికల సమయం కావడంతో...

Ram Charan: ‘సుజిత్ పెళ్లికి ఎందుకు పిలవలేదు..’ ఆనంద్ మహీంద్రాకు రామ్...

Ram Charan: సుజిత్ పెళ్లికి నన్నెందుకు ఆహ్వానించలేదని రామ్ చరణ్ (Ram Charan) ప్రశ్నించడంతో పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) సమాధానమిచ్చారు. ఇంతకీ...

రాజకీయం

వైసీపీని గెలిపించడమే బీజేపీ లక్ష్యమా.?

టీడీపీ - జనసేన కూటమితో కలిసింది బీజేపీ.. అధికారికంగా.! కానీ, వైసీపీతో కలిసి పనిచేస్తున్నట్లుగా వుంది బీజేపీ వ్యవహారం.! ఇదీ, నిన్నటి బీజేపీ ఎంపీ అభ్యర్థుల లిస్ట్ తర్వాత రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్న...

పవన్ కళ్యాణ్ మీద విషం కక్కుతున్న ముద్రగడ.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం విషం చిమ్ముతున్నారు. తన కుటుంబ సభ్యులపై చంద్రబాబు పోలీసుల ద్వారా దాడి చేయించారనీ, బూతులు తిట్టించారనీ ముద్రగడ పద్మనాభం ఆరోపిస్తున్నప్పుడు,...

Janasena: జనసేనలో నిరసనలు.. తిరుగుబాట్లు..

Janasena: జనసేన (Janasena)లో అంతర్గపోరు తప్పేలాలేదా అంటే ప్రస్తుత పరిణామాలు ఇవే సూచిస్తున్నాయి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు ఆశిస్తున్న జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్, స్థానిక కార్యకర్తలు, ఆయన మద్దతుదారులు...

రఘురామ కృష్ణరాజుకి ఎందుకిలా జరిగింది చెప్మా.?

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకి షాక్ తగిలింది. కొద్ది రోజుల క్రితమే ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఎన్నికల ముందర చేసిన రాజీనామా కావడంతో, అది ఆమోదం పొందలేదు. చాలాకాలంగా...

ఎన్నికల బరిలో కంగనా రనౌత్.. పోటీ అక్కడ నుంచే

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్( Kangana Ranaut) భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేయనున్నారు. ఆ పార్టీ ఈరోజు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇందులో...

ఎక్కువ చదివినవి

RC16 : లాంఛనంగా చరణ్ కొత్త సినిమా ప్రారంభం

RC16 : రామ్‌ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమా ప్రకటన వచ్చి ఏడాది దాటింది. గేమ్ చేంజర్ సినిమా ఆలస్యం అవ్వడంతో బుచ్చిబాబు సినిమాను చరణ్ ఆలస్యం చేస్తూ వచ్చాడు. ఎట్టకేలకు...

వైనాట్ 175 అటకెక్కింది.! ఓన్లీ పిఠాపురం చుట్టూ వైసీపీ గింగరాలు తిరుగుతోంది.!

అదేంటీ, వైనాట్ 175 అన్నారు కదా.. ఇప్పుడేంటి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహా వైసీపీ అంతా, పిఠాపురం నియోజకవర్గం చుట్టూనే తిరగడం.? ఔను, వైసీపీ అధినాయకత్వం పూర్తిగా పిఠాపురం మీదనే...

Lokesh Kanagaraj: రొమాంటిక్ సాంగ్ లో లోకేశ్ కనగరాజ్.. వీడియో వైరల్

Lokesh Kanagaraj: ఖైదీ, విక్రమ్ సినిమాలతో టాప్ రేంజ్ కి వెళ్లిన దర్శకుడు లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj). ప్రస్తుతం ఆయన నటుడిగా మారారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్...

Ram Charan Birthday special: విమర్శలకు చెక్.. విమర్శకులకు సమాధానం.. రామ్ చరణ్

Ram Charan: సినిమా బాషలో ఓ మాట ఉంది. ‘విమర్శకుల మెప్పు పొందిన సినిమా.. హీరో’ అని. సినిమాలో లోపాలు, హీరో నటనపై, దర్శకుడి ప్రతిభపై విమర్శలు చేస్తూ.. ఒకరకంగా హీరో, దర్శకుడు,...

ఆపరేషన్ పిఠాపురం: ఒక్కని ఓటమి కోసం.. వంద వ్యూహాలు

ఒక్క పవన్ కళ్యాణ్‌ని ఓడించేందుకు, వైసీపీ అనుసరిస్తున్న వంకర వ్యూహాలు, అందర్నీ విస్మయానికి గురిచేస్తున్నాయి. గాజువాక, భీమవరం, తిరుపతి.. ఇప్పుడేమో పిఠాపురం.. ఇదో పెద్ద ప్రసహనంగా తయారైంది వైసీపీకి.! ప్రస్తుతానికైతే కుట్రల కేంద్రం పిఠాపురం.!...