Switch to English

మారటోరియం పొడిగింపు.. ఈ దోపిడీకి ఏదీ ముగింపు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,424FansLike
57,764FollowersFollow

కేంద్రం మరోమారు మారటోరియంని పొడిగించనుందట. రెండేళ్ళపాటు మారటోరియం కొనసాగించే అవకాశముందంటూ సుప్రీంకోర్టుకి కేంద్రం తెలిపింది. అంటే, దానర్థం మారటోరియం ఇప్పట్లో ముగిసే అవకాశం లేదన్నమాట. అంతా బాగానే వుందిగానీ, మారటోరియం పీరియడ్‌లో బ్యాంకులు, వినియోగదారులపై మోపుతోన్న వడ్డీ భారం మాటేమిటి.? ‘రిజర్వు బ్యాంకు నిబంధనల ప్రకారం, మారటోరియం పీరియడ్‌లో వడ్డీ వర్తిస్తుంది’ అని కేంద్రం తెలిపింది సుప్రీంకోర్టుకి. మరి, మారటోరియం వల్ల వినియోగదారుడికి కలిగే ప్రయోజనమేంటి.? అన్నది సుప్రీంకోర్టు, కేంద్రానికి వేసిన సూటి ప్రశ్న.

వడ్డీలు మాత్రమే కాదు.. ఆ వడ్డీల మీద వడ్డీలు విధిస్తూ బ్యాంకులు, వినియోగదారులకు చుక్కలు చూపించేస్తున్నాయి. క్రెడిట్‌ కార్డుల విషయంలో బ్యాంకుల తీరు మరీ దారుణంగా తయారైంది. ప్రైవేటు ఏజెన్సీలకు వసూళ్ళ బాధ్యతల్ని అప్పగించడంతో, ఆ ఏజెంట్ల నుంచి వస్తోన్న ఫోన్‌ కాల్స్‌.. వినియోగదారుల్ని మానసికంగా కుంగదీసేస్తున్నాయి.

‘లాక్‌డౌన్‌’ని అమల్లోకి తెచ్చింది కేంద్రమే. ఆ లెక్కనే, ఈ లాక్‌డౌన్‌ పీరియడ్‌లో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు పరిష్కారం చూపాల్సింది కూడా కేంద్రమే. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. లాక్‌డౌన్‌ దెబ్బకి దేశంలో ఆర్థిక కార్యకలాపాలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. సామాన్యుడి సంపాదన మీద ఈ లాక్‌డౌన్‌ తీవ్ర ప్రభావం చూపింది. ఆర్థికంగా జనం చితికిపోయారు. కఠినతరమైన లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌.. రెండు మూడేళ్ళు సామాన్యుడిపై వుంటుందని గతంలోనే ఆర్థిక రంగ నిపుణులు అంచనా వేశారు. మరి, బ్యాంకులు కూడా ఈ దిశగా ఆలోచించాలి కదా.! బ్యాంకులు ఆలోచించినా, ఆలోచించకపోయినా.. ప్రభుత్వాలు ఆ దిశగా చర్యలు తీసుకోవాలి కదా.?

‘కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ విధించాం.. ఈ మారటోరియం సమస్యలతో మాకు సంబంధం లేదు’ అని కేంద్రం చేతులు దులిపేసుకోవడానికి వీల్లేదు. వందల కోట్లు, వేల కోట్లు ఎగ్గొట్టి పారిపోయిన బడా బాబుల్ని ఏమీ అనలేని బ్యాంకులు.. సామాన్యుడి నడ్డి విరిచేయడానికి మాత్రం ‘వడ్డీ’ మార్గం ఎంచుకుంటాయ్‌. ఈ దోపిడీకి ఖచ్చితంగా ఫుల్‌స్టాప్‌ పడి తీరాల్సిందే. బ్యాంకుల కంటే వడ్డీ వ్యాపారులే నయం.. అన్న పరిస్థితి రాకుండా కేంద్రమే రంగంలోకి దిగాలి. దిగుతుందా మరి.?

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

రాజకీయం

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఎక్కువ చదివినవి

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....